- Home
- Entertainment
- TV
- Bigg Boss Telugu 7: రతిక మైండ్ ట్యూన్ చేసి గేమ్ మార్చేసిన శివాజీ... వలలో పడింది, బలి కానుందా?
Bigg Boss Telugu 7: రతిక మైండ్ ట్యూన్ చేసి గేమ్ మార్చేసిన శివాజీ... వలలో పడింది, బలి కానుందా?
షో చివరి దశకు చేరుతుండగా శివాజీ తన తెలివికి మరింత పదును పెడుతున్నాడు. రతిక మైండ్ ట్యూన్ చేసి ఆమె గేమ్ మార్చేశాడు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Bigg Boss Telugu 7
హీరో శివాజీ నేచర్ ప్రకారం హౌస్లో ఆయన గేమ్ అగ్రెసివ్ గా సాగుతుందని అందరూ భావించారు. అదే చేస్తే శివాజీ టైటిల్ ఫేవరేట్ అయ్యేవాడు కాదు. కూల్ గేమ్ ఆడుతూ, అప్పుడప్పుడు తన అసహనం బయటపెడుతూ ఇంటిలిజెంట్ గా వ్యవహరిస్తున్నాడు.
Bigg Boss Telugu 7
హౌస్లో డామినేషన్ కి గురయ్యే వాళ్ళను ఆదరించడం వలన మనకు కలిసి వస్తుందని శివాజీ కరెక్ట్ గా గెస్ చేశాడు. సామాన్యుడు హోదా లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్, భాష రాక ఇబ్బంది పడుతున్న యావర్ ని తన టీమ్ లో చేర్చుకున్నాడు. సీరియల్ బ్యాచ్ గ్రూప్ కి వ్యతిరేకంగా మరో గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాడు.
యావర్, పల్లవి ప్రశాంత్ సక్సెస్ వెనుక శివాజీ ఉన్నాడనే సందేశం ప్రేక్షకుల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి పల్లవి ప్రశాంత్ స్ట్రాంగ్ ప్లేయర్ గా ఉన్నా కూడా శివాజీ తర్వాతే అన్నట్లు పరిస్థితులు మారాయి. ఇలా ఒక్కో మెట్టు పేర్చుకుని శివాజీ టాప్ కి చేరాడు. తాజాగా తన మైండ్ గేమ్ కి రతిక కూడా ప్రభావితం చెందింది.
Also Read Bhole Shavali: బిగ్ బాస్ 7 నుంచి పాట బిడ్డ భోలే షావలికి అందిన పారితోషికం ఎంతంటే? నిజంగా జాక్ పాటే
Bigg Boss Telugu 7
ఒకసారి ఎలిమినేటై బయటకు వెళ్లి వచ్చిన రతిక టాప్ లో శివాజీ ఉన్నాడని తెలుసుకుంది. దాంతో రాగానే అతని టీమ్ లో చేరింది. శివాజీ సలహాలు తీసుకుంటుంది. అయితే రీఎంట్రీ తర్వాత ఆమెలో ఫైర్ తగ్గింది. అగ్రెసివ్ గా ఆడటం వలనే వ్యతిరేకత వచ్చింది. అందుకే ఎలిమినేట్ అయ్యానని భావిస్తుంది. ఒక కన్ఫ్యూషన్ లో ఉన్న రతిక మైండ్ సెట్ మార్చేశాడు.
Bigg Boss Telugu 7
ఎలిమినేషన్స్ కి ముందు నువ్వు చెప్పాలనుకున్న పాయింట్ స్ట్రెయిట్ గా, స్ట్రాంగ్ గా చెప్పు. సోదంతా చెప్పకు అని రతికకు సలహా ఇచ్చాడు శివాజీ. ఆయన చెప్పినట్లే నామినేషన్స్ లో రతిక రెచ్చిపోయింది. ప్రియాంక, శోభల మీద విరుచుకుపడింది. ఆమె ఈ ప్రవర్తన వెనుక శివాజీ మైండ్ గేమ్ ఉన్నదనేది నిజం. రతిక తీరు నచ్చకపోతే ఆమెకు మైనస్ అవుతుంది.
Bigg Boss Telugu 7
హౌస్ లో ఉన్న నలుగురు అమ్మాయిలో రతికనే వీక్. రతిక రీఎంట్రీ తర్వాత కూడా వెళ్లిపోయేది. హౌస్లో అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంది. ఈ కారణంగా లేడీ కంటెస్టెంట్స్ సేవ్ అవుతున్నారనే వాదన ఉంది. ఎటూ ఫైనల్ దగ్గరపడుతోంది కాబట్టి ఈసారి మేల్ కంటెస్టెంట్ ని కాకుండా లేడీని బయటకు పంపే ఏర్పాటు చేయవచ్చు. కాగా ఎలిమినేషన్స్ జనాల ఓటింగ్ కి వ్యతిరేకంగా జరుగుతున్నాయనే వాదన ఉంది.