Bigg Boss Telugu 7 : నామినేషన్స్ షురూ.. రతికాకు బిగ్ బాస్ వార్నింగ్.. పల్లవి ప్రశాంత్, అర్జున్ మధ్య వాగ్వాదం

నేడు బిగ్ బాస్ హౌజ్ లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రతికా.. శోభాశెట్టి, ప్రియాంకల మధ్య  మాటల యుద్ధం జరిగింది. మధ్యలోకి నాగార్జునను లాగడం ఆసక్తికరంగా మారింది. మిగితా నామినేషన్ ప్రక్రియ కూడా రసవత్తరంగా జరిగింది. 
 

Bigg Boss Telugu 7 seventh week nominations begin NSK

దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ముగిసింది. నేడు Bigg Boss Telugu సీజన్ 7లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే పది వారాలు పూర్తి అయ్యింది. నిన్న భోలే షావలి (Bhole Shavali)  నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈరోజు హౌజ్ లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. గత వారం శివాజీ, రతిక, గౌతమ్, యావర్, భోలే నామినేట్ అయ్యారు. యావర్, భోలే డేంజర్ జోన్లోకి వచ్చారు. వీరిద్దరిలో తక్కువ ఓట్లు తెచ్చుకున్న భోలే ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే. 

భోలే ఇంటి నుంచి వెళ్లిపోవడంతో అశ్విని గుక్కపెట్టి ఏడ్చింది. అక్కనుంచి ప్రారంభమైన షో ఆసక్తికరంగా సాగింది. ఈరోజు నామినేషన్స్ లో ఒక్కో కంటెస్టెంట్ బిగ్ బాస్ ఇచ్చిన బాటిల్స్ ను తలపై పగలగొట్టి ఇద్దరు కంటెస్టెంట్లను నామినేట్ చేయాల్సి  ఉంటుంది. శివాజీని ఈవారం క్యాప్టెన్ గా బిగ్ బాస్ ప్రకటించారు. దీంతో మిగిలిన కంటెస్టెంట్లు నామినేషన్ ప్రక్రియలో పాల్గొనాల్సి  ఉంటుంది. 

తొలుత రతికా రోజ్ నామినేషన్ ప్రక్రియను ప్రారంభించింది. కానీ నామినేషన్స్ స్టార్ట్ చేసేందుకు కాస్తా సమయం పడుతుందని చెప్పడంతో బిగ్ బాస్ ఆమెకు వార్నింగ్ ఇచ్చారు. ఆలస్యం చేస్తే నేరుగా బిగ్ బాసే నామినేట్ చేస్తారని హెచ్చరించారు. దీంతో రతికా శోభాశెట్టి పేరు చెప్పింది. గత వారం ఆమెకు ఇచ్చిన కెప్టెన్సీని సరిగా వినియోగించలేదని అందుకు నామినేట్ చేశానంటూ రీజన్ చెప్పుకొచ్చింది. అదే రీజన్ తో ప్రియాంక జైన్ కూడా నామినేట్ చేసింది. 

దీంతో ప్రియాంక, శోభాశెట్టిలు ఇద్దరు రతికాను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. వీరి ముగ్గురు మధ్య మాటల యుద్ధం జరిగింది. మరో విషయం ఏంటంటే వీరి మాటల్లోకి నాగ్ సార్ ను లాగారు. ప్రతి దానికి మీకు నాగ్ సారే కావాలిగా ఒకసారి సార్ ను హౌజ్ లోకి రమ్మందాం.. అప్పుడు తెలుస్తుంది అంటూ రతికా అన్న మాటలకు.. శోభా ఏమో నువ్వు పిలిస్తే నాగ్ సార్ వస్తాడు కావొచ్చు.. మేం పిలిస్తే రాడు అనడం ఇంట్రెస్టింగ్  గా మారింది. దీనిపై బిగ్ బాస్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

ఆ తర్వాత అర్జున్ నామినేషన్ ప్రక్రియను కొనసాగించారు. పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేశారు. ప్రశాంత్ కొన్ని సందర్భాల్లో ప్రవర్తించే తీరు బాగోలేదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య కాస్తా వాగ్వాదం జరిగింది. శివాజీకి మద్దుతుగా మాట్లాడటం సరికాదంటూ అర్జున్ వాదించారు. నాకు అనిపించింది చేశానంటూ పల్లవి ప్రశాంత్ బదులిస్తూ వచ్చారు. ఆ తర్వాత శోభాశెట్టిని అర్జున్ నామినేట్ చేశారు. తన కెప్టెన్సీని సరిగా నిర్వహించలేదని, బాధ్యతాయుతంగా నిర్వహించలేదని అభిప్రాయపడ్డారు. వాగ్వాదం తర్వాత ఇద్దరి పై బాటిల్స్ పగల గొట్టారు. 

ఇక ప్రియాంక జైన్ రతికా రోజ్ ను నామినేట్ చేశారు. ఈ సందర్భంగా రతికా, ప్రియాంక మాటల యుద్ధం జరిపించారు. ఈ సమయంలోనూ రతికా ప్రియాంకపై మాటలతో రెచ్చిపోయింది. శివాజీ జోక్యంతోనూ సర్దిమనుగణలేదు. చివరిగా రతికాపై బాటిల్ పగిలింది. ఆ తర్వాత అశ్వినిని నామినేట్ చేసింది. లాస్ట్ వీక్ మొత్తం రూడ్ గా వ్యవహరించిందని కారణం చెప్పుకొచ్చింది. లాస్ట్ లో ప్రియాంక రతిక తలపై బాటిల్ ను పగలగొట్టడం చాలా నొప్పిగా ఫీల్ అయ్యింది రతిక. దీనిపైనా  కాస్తా రచ్చ జరిగింది. నెక్ట్స్ ఎపిసోడ్ లో మిగిలిని నామినేషన్స్ ను జరగనున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios