Asianet News TeluguAsianet News Telugu

Bhole Shavali: బిగ్‌ బాస్‌ 7 నుంచి పాట బిడ్డ భోలే షావలికి అందిన పారితోషికం ఎంతంటే? నిజంగా జాక్‌ పాటే

తనదైన పాటలతో బిగ్‌ బాస్‌ షోలో అలరించిన భోలే షావలి పదో వారంలో ఎలిమినేట్‌ అయ్యాడు. ఆయన ఎంత పారితోషికం అందుకున్నాడనేది ఆసక్తికరంగా మారింది.

bhole shavali how much remuneration taking from bigg boss telugu 7 for five weeks arj
Author
First Published Nov 14, 2023, 7:46 AM IST | Last Updated Nov 14, 2023, 11:09 AM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 7 షో పది వారాలు పూర్తి చేసుకుంది. ఇక్కడి వరకు వచ్చిన వారంతా సూపర్‌ కంటెస్టెంట్లుగా చెప్పొచ్చు. అయితే పదో వారంలో భోలే షావలి ఎలిమినేషన్‌ అందరిని షాక్‌కి గురి చేస్తుంది. గత వారం హౌజ్‌లో మంచి ఎంటర్‌టైనర్‌గా నిలిచిన టేస్టీ తేజని ఎలిమినేట్‌ చేసి విమర్శలు ఎదుర్కొంది బిగ్‌బాస్‌. ఇప్పుడు భోలే షావలి విసయంలో కూడా అలాంటి అభిప్రాయమే వినిపిస్తుంది. ఇది పూర్తిగా అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌ అంటున్నారు. 

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో పాటలతో అలరించే గాయకుడిని పంపించడం పెద్ద మిస్టేక్‌ అంటున్నారు. హౌజ్‌లో ఉండాల్సిన వారిని పంపించి ఏం చేస్తారని అంటున్నారు. దీనిపై హాట్‌ హాట్‌ గా చర్చజరుగుతుంది. అయితే భోలే.. పాట విషయంలో అలరిస్తున్నా, గేమ్‌ల విషయంలో అంతగా సత్తా చాటడం లేదని, ఆ విషయంలో తేలిపోతున్నాడని, పెద్దగా ఎఫర్ట్స్ పెట్టకుండానే టాస్క్ ల నుంచి తప్పుకుంటున్నాడనే విమర్శలున్నాయి. పలు మార్లు కెప్టెన్సీ టాస్క్ లో ఆయన గివప్‌ ఇవ్వడం కూడా అందుకు కారణం అంటున్నారు. 

మొత్తానికి భోలే షావలి.. అందరి మనుసులను గెలుచుకుంటానని, కప్‌ ముఖ్యం కాదని, ఎంటర్‌టైనర్‌ చేయడం, ఆడియెన్స్ కి దగ్గర కావడం తన లక్ష్యం అని తెలిపారు. ఆ విషయంలో పూర్తిగా కాకపోయినా కొంత వరకు సక్సెస్‌ అయ్యాడని చెప్పొచ్చు. ఇక భోలేకి తన అభిమానులు, ఇంటి నుంచి ఘన స్వాగతం దక్కింది. చాలా గ్రాండ్‌గా ఆయనకు వెల్‌కమ్‌ పలికారు. గజమాలతో ఆయనకు స్వాగతం పలకడం విశేషం. 

ఇదిలా ఉంటే భోలే షావలి ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మినీ లాంచ్‌ కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఐదుగురు కంటెస్టెంట్లలో ఒకరిగా వచ్చాడు భోలే. హౌజ్‌లో ఆయన ఐదు వారాలున్నారు. పదో వారంలో ఎలిమినేట్‌ అయ్యాడు. మరి ఈ ఐదు వారాలకు ఆయనకు ఎంత పారితోషికం దక్కింది, బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ఎంత ఇచ్చారనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆయన పారితోషికం లీక్‌ అయ్యింది.

Read More: ప్రియాంక, శివ లవ్‌ స్టోరీ వెనుక రహస్యం.. ఎలా స్టార్ట్ అయ్యిందో తెలుసా? నిజంగానే క్రేజీ

భోలే సింగర్‌, లిరిక్‌ రైటర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనే విషయం తెలిసిందే. ఒకప్పుడు బాగానే సినిమాలు చేశాడు. బిజీగా ఉన్నాడు. జానపద పాటలతో మరింతగా పాపులర్‌ అయ్యారు. అయితే క్రమంగా ఆయనకు సినిమా అవకాశాలు తగ్గాయి. దీంతో ఫోక్‌ సాంగ్స్, రీల్‌ సాంగ్స్ చేస్తూ రాణిస్తున్నారు. బిగ్‌ బాస్‌ ద్వారా తానేంటో చూపించి మళ్లీ బిజీ కావాలని ఆశపడ్డారు. ఆ విషయంలో కొంత సక్సెస్‌ అయ్యాడు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని భోలేకి వారానికి 2.5లక్షలు పారితోషికం ఇస్తున్నారట. ఇలా ఐదు వారాలకు గానూ ఆయనకు 12లక్షలు దక్కిందని తెలుస్తుంది. కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఆయనకు పదివారాలకు పారితోషికం ఇచ్చారట. ముందు కమిట్‌ మెంట్‌ ప్రకారం షో ప్రారంభమైనప్పట్నుంచి ఆయనకు పారితోషికం ఇచ్చారట. ఈ విషయం ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ లెక్కన ఆయనకు సుమారు 25లక్షల పారితోషికం అందుకున్నట్టు తెలుస్తుంది. దీంతో చాలా మంది ప్రముఖ కంటెస్టెంట్లకి సమానంగా ఆయనకు పారితోషికం దక్కిందని చెప్పొచ్చు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

Read More: Bigg Boss Telugu 7 : నామినేషన్స్ షురూ.. రతికాకు బిగ్ బాస్ వార్నింగ్.. పల్లవి ప్రశాంత్, అర్జున్ మధ్య వాగ్వాదం

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios