MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • లక్షల సంపాదన, కార్లు, బంగ్లాలు ఉన్న ఆది రెడ్డి చెల్లికి ఎందుకు పెళ్లి చేయడం లేదు? కారణం ఇదేనట!

లక్షల సంపాదన, కార్లు, బంగ్లాలు ఉన్న ఆది రెడ్డి చెల్లికి ఎందుకు పెళ్లి చేయడం లేదు? కారణం ఇదేనట!

బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి చెల్లి పెళ్లి విషయంలో అనూహ్య కామెంట్స్ చేశాడు. తన దగ్గర ఎన్ని లక్షలు డబ్బులు ఉన్నా ఆమెకు పెళ్లి చేయను అన్నాడు. అందుకు చెప్పిన కారణాలు ఏంటో చూద్దాం..  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 09 2024, 08:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఆదిరెడ్డి జీవితాన్ని బిగ్ బాస్ షో మార్చేసింది. ఒకప్పుడు ఆదిరెడ్డి బెంగుళూరులో చిన్న జాబ్ చేసుకుంటూ ఆర్థిక కష్టాలతో ఇబ్బందులు పడేవాడు. అతడు బిగ్ బాస్ షో గురించి మాట్లాడే తీరు చూసి, వీడియోలు చేయమని సలహా ఇచ్చారు మిత్రులు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అలా బిగ్ బాస్ రివ్యూవర్ గా మారిన ఆదిరెడ్డి ఫుల్ ఫేమస్ అయ్యాడు. అతని యూట్యూబ్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ రావడం స్టార్ట్ అయ్యింది. అలా వచ్చిన ఫేమ్ తో ఏకంగా బిగ్ బాస్ షోలో ఛాన్స్ దక్కించుకున్నాడు. 

 

38
Adi Reddy

Adi Reddy

బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న ఆదిరెడ్డి ఫైనల్ కి వెళ్ళాడు. 4వ స్థానంలో నిలిచాడు. ఆదిరెడ్డి కామనర్ కోటాలో హౌస్లో అడుగుపెట్టడం విశేషం. సెలెబ్రెటీలకు పోటీ ఇస్తూ ఆదిరెడ్డి టాప్ 5 లో చోటు దక్కించుకోవడం గొప్పపరిణామం. బిగ్ బాస్ షో అనంతరం ఆదిరెడ్డి మరింత పాపులర్ అయ్యాడు. 

48
Adi Reddy

Adi Reddy


బిగ్ బాస్ రివ్యూవర్ గా ఆదిరెడ్డి సంపాదన నెలకు లక్షల్లోకి చేరింది. ఒకప్పుడు ఆదిరెడ్డి వాళ్ళ అమ్మ ఒంటిపై కనీస నగలు ఉండేవి కావట. ఏదైనా ఫంక్షన్ కి వెళ్లాల్సి వస్తే బంధువుల నగలు పెట్టుకొని వెళ్లేదట. తల్లి ఆర్థిక బాధలు పడలేక ఆత్మహత్య చేసుకుందట.

58
Adi Reddy

Adi Reddy

ఇప్పుడు మా అమ్మ ఉంటే ఆమె ఒంటి నిండా నగలు చేయిన్చేవాడిని. ఆ స్థోమత నాకు ఉందని బిగ్ బాస్ హౌస్లో ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు. ఆ మధ్య తనకు నెలకు రూ. 39 లక్షల ఆదాయం వస్తున్నట్లు లెక్కలతో సహా చూపించాడు. కొత్తగా ఓ భారీ ఇల్లు నిర్మిస్తున్నాడు. 

 

68

ఇంత సంపాదిస్తున్న ఆదిరెడ్డి చెల్లికి మాత్రం పెళ్లి చేయడం లేదు. తాజా ఇంటర్వ్యూలో ఆదిరెడ్డికి ఈ ప్రశ్న ఎదురైంది. తన వద్ద డబ్బు ఉంది. కానీ చెల్లికి పెళ్లి చేయను అన్నాడు. అందుకు కారణం చెబుతూ... నా చెల్లి నాగ లక్ష్మికి కంటి చూపు లేదు. 

78
Aadi Reddy-Geetu

Aadi Reddy-Geetu


ఆమెకు ఆపరేషన్ చేయించినా చూపు రాదు. కనుగుడ్లు బాగున్నాయి కానీ, నరాలు సరిగా లేవు. నాగ లక్ష్మికి ఐదు శాతం మాత్రమే ఒక కంటితో చూడగలదు. అయితే ఒక ఇంట్లో కాసేపు నడిస్తే... ఏది ఎక్కడ ఉందో అర్థం చేసుకుంటుంది. నా చెల్లి బాగోగులు నా భార్యనే చూసుకుంటుంది. అలాంటి నాగ లక్ష్మి వేరే ఇంటికి కోడలిగా వెళితే మరింత కష్టం అవుతుంది. 


 

88
Adi Reddy

Adi Reddy

తనకున్న అంగవైకల్యంతో అత్తారింటిలో ఆమె నెట్టుకురాలేదు. అందుకే పెళ్లి చేయడం లేదని, ఓపెన్ అయ్యాడు. కాగా నాగలక్ష్మి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ నడపడం విశేషం. అందుకు కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Sivaji Remuneration: మరోసారి బిగ్‌ బాస్‌ కి యాంకర్‌గా శివాజీ.. ఊహించని రెమ్యూనరేషన్‌
Recommended image2
Bigg Boss Telugu Winners :కళ్యాణ్ పడాల నుంచి శివబాలాజీ వరకు బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Recommended image3
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved