MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • TV
  • లేటెస్ట్ కంటెస్టెంట్ తల్లిపై దాడి, పల్లవి ప్రశాంత్ అరెస్ట్... ఇండస్ట్రీని షేక్ చేసిన వివాదాలు!

లేటెస్ట్ కంటెస్టెంట్ తల్లిపై దాడి, పల్లవి ప్రశాంత్ అరెస్ట్... ఇండస్ట్రీని షేక్ చేసిన వివాదాలు!

బిగ్ బాస్ షో వివాదాలకు కేంద్ర బిందువు. ఈ షో బ్యాన్ చేయాలని సాంప్రదాయవాదులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఏడాది వివిధ భాషల్లో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షోలలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.  

3 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 24 2023, 12:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Bigg boss

Bigg boss

ఎక్కడో బ్రిటన్ లో బిగ్ బ్రదర్  పేరుతో మొదలైన రియాలిటీ షో స్ఫూర్తిగా ఇండియాలో బిగ్ బాస్ షోకి బీజం పడింది. హిందీలో సక్సెస్ కావడంతో ప్రాంతీయ భాషలకు కూడా వ్యాపించింది. అమ్మాయిలు, అబ్బాయిలు నాలుగు గోడల మధ్య కలిసి జీవించడం,  టాస్క్స్ , కాన్సెప్ట్స్ భారతీయ సంస్కృతికి విరుద్ధం. జెనరేషన్స్ పై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం కలదని కొందరి వాదన. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
Bigg Boss

Bigg Boss


బిగ్ బాస్ రియాలిటీ షో ఆడియన్స్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది పక్కన పెడితే... కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ మధ్య గొడవలు.  కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులను, సపోర్ట్ చేస్తున్న వారిని దూషించడాలు వంటి దుష్పరిణామాలకు దారి తీస్తుంది. ఇక 2023లో బిగ్ బాస్ షో కేంద్రంగా అనేక వివాదాలు, ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అవేమిటో చూద్దాం.. 
 

310
Bigg Boss

Bigg Boss

బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు. డిసెంబర్ 17న ఫినాలే ముగిసింది. అన్నపూర్ణ స్టూడియో ఎదుట భారీగా చేరుకున్న ఫ్యాన్స్ పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీ నాశనం చేశారు. లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది. మీరు వెనుక గేట్ నుండి వెళ్లిపోండని ప్రశాంత్ కి పోలీసులు సూచించారు. పోలీసుల మాట వినకుండా ప్రశాంత్ కారులో ర్యాలీ చేశాడు. సీరియస్ అయిన పోలీసులు పల్లవి ప్రశాంత్ పై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. 


 

410

పల్లవి ప్రశాంత్ కి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించాడు. అనంతరం బెయిల్ పై విడుదలయ్యాడు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ రన్నర్ అమర్ దీప్ కారుపై దాడి చేశారు. అద్దాలు పగలగొట్టి భయభ్రాంతులకు గురి చేశాడు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదు. 

510
Bigg Boss

Bigg Boss

తమిళ బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ నటి విచిత్ర షో వేదికగా టాలీవుడ్ స్టార్ హీరోపై సిరీయస్ ఆరోపణలు చేసింది. 2001లో కేరళలో షూటింగ్ జరుగుతుండగా తెలుగు స్టార్ హీరో నన్ను రాత్రి గదికి రమ్మన్నాడు. నేను మాట వినలేదని తాగొచ్చి హోటల్ డోర్ బాదాడు. ఆ మూవీ సెట్స్ లో ఒకరు నా పై చేయి చేసుకున్నారు. కంప్లైంట్ చేసినా ఫలితం లేదని ఆమె వాపోయారు. ఆ హీరో బాలకృష్ణనే, భలేవాడివి బాసూ సినిమా షూటింగ్ లో ఇది జరిగిందని ప్రచారం అయ్యింది..
 

610
Bigg Boss

Bigg Boss

ఇదే సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్ కూల్ సురేష్ బిగ్ బాస్ హౌస్ నుండి పారిపోయే ప్రయత్నం చేశాడు. గోడ ఎక్కుతున్న సురేష్ ని చూసిన మరొక కంటెస్టెంట్ వచ్చి దింపాడు. హౌస్లో ఉండటం ఇష్టం లేకపోతే... రిక్వెస్టు చేసి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలా పారిపోయిన వారు ఎవరూ లేరు..

710
Bigg Boss

Bigg Boss

నటి వనిత విజయ్ కుమార్ కూతురు జోవిక బిగ్ బాస్ తమిళ్ 7 కంటెస్టెంట్. జోవిక మేల్ కంటెస్టెంట్ ప్రదీప్ ఆంటోని మీద తీవ్ర ఆరోపణలు చేసింది. అతడు ఎప్పుడూ వాష్ రూమ్స్ దగ్గరే ఉంటున్నాడు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లకు రక్షణ లేదని కంప్లైంట్ చేసింది. 
 

810
Bigg Boss

Bigg Boss

హోస్ట్ కమల హాసన్ రెడ్ కార్డు ఇచ్చి ప్రదీప్ ఆంటోనిని బయటకు పంపేశాడు. దీంతో జోవికపై ప్రదీప్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. జోవికను వెనకేసుకు వస్తుందని తల్లి వనిత మీద దాడి జరిగింది. ఒక వ్యక్తి ఆమె ముఖం మీద పిడిగుద్దులు కురిపించాడు. 
 

910
Bigg Boss

Bigg Boss

బిగ్ బాస్ షోలో పులిగోరు ధరించి కనిపించిన వర్తుర్ సంతోష్ జైలుపాలయ్యాడు. కన్నడ సీజన్ 10లో పాల్గొన్న సంతోష్ పులిగోరు ధరించడం వివాదాస్పదం అయ్యింది. బిగ్ బాస్ హౌస్ కి వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ విధించగా అనంతరం బెయిల్ పై బయటకు వచ్చాడు.

1010

బిగ్ బాస్ హౌస్లో లేడీ కంటెస్టెంట్ కి ప్రెగ్నెన్సీ టెస్ట్ జరిగిందన్న న్యూస్ సంచలనం రేపింది.బిగ్ బాస్ హిందీ సీజన్ 17లో కపుల్ అంకిత లోఖండే, విక్కీ జైన్ కంటెస్ట్ చేశారు. తనకు ఒంట్లో నలతగా ఉందని చెబితే... మెడికల్ రూమ్ కి తీసుకెళ్లి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారని ఆమె భర్తతో చెప్పింది. పాజిటివ్ వస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందింది. బిగ్ బాస్ హౌస్లో ప్రెగ్నన్సీ టెస్ట్ జరగడం ఇదే మొదటిసారి... ఇలా ఈ ఏడాది బిగ్ బాస్ షో వేదికగా అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి...

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved