- Home
- Entertainment
- TV
- Sri Satya:అతని కోసం చదువు మధ్యలో ఆపేశా, అమ్మని అవుతా కానీ.. పెళ్లి వద్దు..బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్
Sri Satya:అతని కోసం చదువు మధ్యలో ఆపేశా, అమ్మని అవుతా కానీ.. పెళ్లి వద్దు..బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్
Sri Satya: బుల్లితెర ప్రేక్షకులకు శ్రీసత్య పరిచయమే. బిగ్ బాస్, బీబీ జోడి లతో మరింత పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ.. రీసెంట్ గా ఓ పాడ్ కాస్ట్ లో తన లైఫ్ కి సంబంధించిన ఆస్తికర విషయాలను పంచుకుంది.

Sri satya
శ్రీ సత్య అనగానే వెంటనే అందరికీ గుర్తు వచ్చేస్తుంది. మన తెలుగు అమ్మాయి..మిస్ విజయవాడ టైటిల్ గెలుచుకొని, మిస్ ఆంధ్రా పోటీల్లో పాల్గొని ఆ తర్వాత సీరియల్స్ లోకి అడుగుపెట్టింది. చాలా ఇంట్రావర్ట్ గా ఉండే తాను అసలు ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి కారణం ఏంటి అనే విషయాలను ఆర్జే కాజల్ తో జరిగిన ఓ పాడ్ కాస్ట్ లో వివరించింది.
హీరో రామ్ కోసం...
‘ నా ఫేవరేట్ హీరో ( రామ్ పోతినేని) 17 సంవత్సరాలకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అందుకే నేను కూడా ఇంటర్ తర్వాత ఇక చదువు ఆపేసి.. సినిమాల్లోకి వెళ్లిపోతాను అని ఇంట్లో చెప్పాను. ఆ మాట చెప్పినప్పుడు మా అమ్మ తిట్టింది.. నాతో మాట్లాడటం కూడా మానేసింది. కానీ, నాన్న నన్ను ఎంకరేజ్ చేశారు. టీవీలో మిస్ విజయవాడ పోటీలు అని స్క్రోలింగ్ వస్తే.. దానిని చూసి ప్రయత్నిస్తావా అని నాన్న అడిగారు. సరే అని వెళ్లాను. మొత్తం 300 మంది వచ్చారు. అంత మందిని చూసి నేను కచ్చితంగా సెలక్ట్ కాను అని అనుకున్నాను. ఆడిషన్ ఇచ్చేసి వెనక్కి వచ్చేశా. అప్పుడు నేను హాస్టల్ లో ఉండేదాన్ని. నేను హాస్టల్ గేటు ముందుకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి సెలక్ట్ అయ్యాను అని కాల్ వచ్చింది. వెంటనే నాన్నకి ఫోన్ చేసి అక్కడి వెళ్లాను. మొత్తం 11 మందిని వారు సెలక్ట్ చేస్తే.. చివరికి నేను విన్నర్ గా నిలిచాను. ఆ ప్రోగ్రామ్ కి గెస్ట్ శివాజీ గారు. నేను చెప్పిన సమాధానం నచ్చి నన్ను విజేతను చేశారు’ అని సత్య చెప్పింది.
అమ్మ కావాలంటే పెళ్లి ఎందుకు..?
ఇక సత్య.. ఎప్పుడూ నటి అంజలి కుమార్తె ధాన్వి( చందమామ) తో కలిసి సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. పాపతో అంత క్లోజ్ నెస్ ఎలా ఏర్పడింది..? నీకు పిల్లల అంటే ఇష్టమా లేక కేవలం ధాన్వీ అంటే ఇష్టమా అని కాజల్ అడగగా.. ‘ నాకు బేసిక్ గా చిన్న పిల్లలు అంటే ఇష్టం.. మన చుట్టూ ఇంత మంది పిల్లలు ఉండగా.. స్పెషల్ గా మనకంటూ పిల్లలు ఉండాల్సిన అవసరం లేదు కదా’ అని సత్య బదులిచ్చింది. అంటే.. నీకు అమ్మ అవ్వాలనే కోరిక లేదా అని కాజల్ అడగగా.. ‘ నాకు అమ్మ అవ్వాలని ఉంది. కానీ పెళ్లి చేసుకోను. అమ్మ అవ్వాలి అంటే మనమే కనాల్సిన అవసరం లేదు కదా.. నేను మంచి పొజిషన్ లో ఉంటే ఎవరైనా ఆడపిల్లను తెచ్చి దత్తత తీసుకుంటాను. మగ పిల్లాడు మాత్రం వద్దు. వాడిని హ్యాండిల్ చేయలేం’ అని సత్య చెప్పింది.
ఇక.. ధాన్వి గురించి మాట్లాడుతూ.. ‘ నా మీద ఇప్పటి వరకు అంత ప్రేమ ఎవరూ చూపించలేదు. అది చూపించిన ప్రేమకు నేను కరిగిపోతాను. అది చూసి నేను కూడా అంతకు మించి ప్రేమించడం మొదలుపెట్టాను. మా అక్కకి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా అక్క కూతురు అంటే నాకు చాలా ఇష్టం. దానిని నేనే పెంచాను.’ అని సత్య చెప్పింది.
శ్రీ సత్య.. రీసెంట్ గా శివ మాల, భైరవ మాల ధరించారు. ఇదే విషయం గురించి ఆర్జే కాజల్ ప్రశ్నించింది. ‘ ఓ యాక్సిడెంట్ లో నా ప్రాణాలు పోవాల్సింది. జస్ట్ మిస్ అయ్యింది. అప్పటికే చాలా సార్లు శివ మాల వేసుకోవాలి అనుకున్నాను కానీ, వేసుకోలేదు. ఆ క్షణం తర్వాత.. వెంటనే శివ మాల వేసుకోవాలని అనుకున్నాను. వేసుకున్నాను. ఆ తర్వాత భైరవ మాల కూడా వేసుకున్నాను. అందరూ ఆడపిల్ల భైరవ మాల వేసుకుంటావా అని అన్నారు. కానీ.. నేను నిష్టతో వేసుకున్నాను’ అని సత్య చెప్పింది. ప్రస్తుతం సత్య బీబీ జోడి 2లో పార్టిసిపేట్ చేస్తోంది. అర్జున్ కళ్యాణ్ కి జోడీగా డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది.

