అఖండ 2 జ్యూక్ బాక్స్ విన్నారా ? బాలయ్య సినిమా నుంచి సంగీత ప్రవాహం మొదలైంది..
Akhanda 2 Jukebox : నందమూరి నట సింహం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా అఖండ 2. ఈసినిమా నుంచి సంగీత ప్రవాహం మొదలయ్యింది. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ సాంగ్స్ తో కూడిన జ్యూక్ బాక్స్ ను అఖండ 2 టీమ్ రిలీజ్ చేశారు.

అభిమానుల ఎదురుచూపులు..
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా అఖండ2. అభిమానులు వెయ్యి కళ్ళతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుంచి సాలిడ్ అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ నుంచి ఆడియో జ్యూక్‌బాక్స్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. “దైవిక సంగీత ప్రవాహం మొదలైంది” అంటూ సోషల్ మీడియాలో అప్‌డేట్‌ను షేర్ చేయడంతో అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్సాహం పెరిగిపోయింది.
దుమ్మురేపబోతున్న తమన్..
తమన్ సంగీత సారధ్యంలో అఖండ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే.. అఖండ ఫస్ట్ పార్ట్ మూవీకి.. రికార్డుల తో పాటు థియేటర్లో సౌండ్ బాక్స్ లు బ్రేక్ అయ్యేలా మ్యూజిక్ అందించాడు తమన్. మరీ ముఖ్యంగా బాలయ్య ఎలివేషన్ సీన్స్ కు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు. ఇక ఈ కాంబినేషన్‌లో అఖండ2 కూడా వస్తుండటం.. అభిమానులు ఇప్పటి నుంచే పూనకాలతో ఊగిపోతున్నారు. ఈ క్రమంలో జ్యూక్ బాక్స్ రిలీజ్ అవ్వడ.. సందమూరి అభిమానులను మరింత సంతోషపెడుతోంది.
అఖండ 2 జ్యూక్‌బాక్స్ రిలీజ్
తమన్ ఈసారి సీక్వెల్ కోసం తమన్ అంతకు మించి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. బాలయ్య కనిపించగానే ఆడియన్స్ కు గూస్ బామ్స్ వచ్చేలా తమన్ గట్టిగానే ప్లాన్ చేశాడట. . తాజాగా విడుదలైన జ్యూక్‌బాక్స్‌లోని పాటలు, థీమ్ మ్యూజిక్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అంతే కాదు ఈ సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పాటలు అఖండ 2పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెంచుతున్నాయి.
బాలయ్య సినిమా రిలీజ్ డేట్
14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. అఖండ 2 లో బాలకృష్ణ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆది పినిశెట్టి కీలక పాత్రలో కనిపించనున్నాడు. ‘అఖండ 2 తాండవం’ అనే ట్యాగ్‌లైన్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక అఖండ2 సినిమాను డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయడం కోసం మూవీ టీమ్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్, ఇప్పుడు జ్యూక్‌బాక్స్.. ఇలా వరుసగా అప్ డేట్స్ ను ప్లాన్ చేశారు అఖండ 2 టీమ్.
నందమూరి అభిమానుల నమ్మకం
బోయపాటి–బాలయ్య కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా అని నందమూరి అభిమానులు నమ్మకంతో ఉన్నారు. అఖండ సినిమా సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందుతున్న సీక్వెల్ కావడంతో, కథ, యాక్షన్ ఎలిమెంట్స్, సంగీతం పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ లోపు.. ఆడియో జ్యూక్‌బాక్స్ జనాలలోకి వెళ్తే.. అఖండ2 కి భారీగా ప్రమోషన్ అయ్యే అవకాశం ఉంది.

