రాజ్ నిడిమోరు ఎవరు? సమంత తో బంధం ఎలా మొదలయ్యింది? రాజ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
సమంత, రాజ్ నిడిమోరు పెళ్లిపై వార్తలు వైరల్ అవుతున్నాయి. రాజ్ భార్య పోస్ట్ తో సోషల్ మీడియాలో రచ్చ మొదలయ్యింది. ఇంతకీ అసలెవరీ రాజ్ నిడిమోరు. సమంతను ఎక్కడ కలిశాడు. ఆయన ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

సమంత, రాజ్ పెళ్లి వార్తలు
సమంత, రాజ్ నిడిమోరు పెళ్లిపై సోషల్ మీడియా కోడై కూస్తోంది. డిసెంబర్ 1న రాజ్, సమంత వివాహ బంధం మొదలవ్వబోతోందన్న న్యూస్ టాలీవుడ్ ను కుదిపేస్తోంది. అఫీషియల్ గా ఈ విషయం ఎవరూ చెప్పకపోయినా.. రాజ్ భార్య పెట్టిన పోస్ట్ తో సోషల్ మీడియాలో ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయి. ఈ విషయంలో సమంత, రాజ్ ఎవరు స్పందించలేదు. నాగచైతన్యతో విడాకుల తరువాత సింగిల్ గానే ఉంటోంది సమంత. కానీ గత కొంత కాలంగా డైరెక్టర్ రాజ్ తో కలిసి తిరుగుతూ.. క్లోజ్ గా మూవ్ అవుతూ.. రకరకాల పోస్ట్ లు పెడుతోంది. దాంతో వీరి బంధంపై ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.
సమంత, రాజ్ బంధం ఎప్పుడు మొదలయ్యింది?
నాగచైతన్యతో విడాకుల తరువాత సినిమాలకు ఏడాది గ్యాప్ ఇచ్చింది సమంత. ఈ క్రమంలో ఆమె ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటించినప్పుడు.. ఆసిరీస్ దర్శకులలో ఒకరైన రాజ్ నిడిమోరుతో స్నేహం మొదలయ్యింది. అది కాస్తా ప్రేమగా మారినట్టు సమాచారం. రాజ్ నిడిమోరు దర్శకత్వంలో సమంత ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ లాంటి వెబ్ సిరీస్ లలో నటించింది. వీరిద్దరూ చాలా సందర్భాల్లో జంటగా కనిపించడం, బాగా క్లోజ్ గా మూవ్ అవుతుండటం, రాజ్ తో ఉన్న ఫోటోలని సమంత కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో.. ఇండస్ట్రీలో వీరి బంధంపై రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. వీరు తమ రిలేషన్ ని అఫీషియల్ చేయాలనుకుంటున్నారన్న టాక్ కూడా బలంగా వినిపించింది.
రాజ్ నిడమోరు ఎవరు?
రాజ్ నిడమోరు తెలుగు వ్యక్తి. ఆయన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో పుట్టారు. ఇక్కడే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. ఇక్కడ చదవు అయిపోగానే జాబ్ కోసం వెంటనే అమెరికా వెళ్లిపోయాడు రాజ్. అమెరికాలో జాబ్ చేస్తున్నప్పుడే రాజ్ కు సినిమాలపై ఇష్టం పెరిగింది. తన ఆలోచనలకు దగ్గరగా ఉన్న డీకేతో పరిచయం ఏర్పడి.. స్నేహం బలపడింది. వీరిద్దరు కలిసి ముందుగా ఒక షార్ట్ ఫిలిం చేశారు. అది సక్సెస్ అవ్వడంతో డీకేతో కలిసి రాజ్ సే ఫ్లేవర్స్ అనే ఇంగ్లీష్ సినిమాను కూడా రూపొందించాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇండియాలో సినిమా ప్రయాణం మొదలెట్టారు. బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యారు.
డైరెక్టర్స్ ద్వయంగా రాజ్ అండ్ డీకే
డైరెక్టర్స్ ద్వయం ఫేమస్ అయ్యారు రాజ్ డీకే. వీరికి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ బాగా పేరు తీసుకువచ్చింది. అంతే కాదు ఇద్దరూ కలిసే కొన్ని సినిమాలు కూడా నిర్మించారు. గో గోవా గాన్ మూవీతో స్టార్ డమ్ సంపాదించిన వీరు, షోర్ ఇన్ ది సిటీ తో అంతర్జాతీయం గా పాపులర్ అయ్యారు.ఆ తరువాత కూడా మిత్రుడితో కలిసి కొన్ని చిత్రాలు చేసాక వెబ్ సిరీస్ లో అడుగుపెట్టి పెద్ద విజయాలు అందుకున్నారు. రాజ్ నిడమోరు ఫేవరెట్ దర్శకుడెవరో తెలుసా మన రామ్ గోపాల్ వర్మ.
రాజ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
రాజ్ దర్శకుడిగా నిర్మాతగా భారీగానే ఆస్తులు పోగేసినట్టు సమాచారం. కొన్నిసంస్థల రిపోర్ట్స్ ప్రకారం రాజ్ నిడిమోరుకి 90 కోట్ల వరకూ ఆస్తులు ఉన్నట్టు సమాచారం. అంతే కాదు మిత్రుడు డీకేతో కలిసి D2R అనే ఫిలిం ప్రొడక్షన్ కంపెనీని కూడా స్టార్ట్ చేశాడు రాజ్. ఈ బ్యానర్ లో ఫ్యామిలీ మాన్, గన్స్ అండ్ గులబ్స్, సిటాడెల్ లాంటి అద్భుతమైన వెబ్ సిరీస్ లతో పాటు కొన్ని సినిమాలు కూడా నిర్మించాడు. ఫ్యామిలీ మాన్ సిరీస్ కు సీజన్ కి 60 కోట్ల వరకు వీరికి అమెజాన్ పే చేసిందని టాక్. ఇవే కాకుండా వారి సొంత బ్యానర్ కు NETFLIX తో ఒప్పందాలు కూడా ఉన్నట్టు టాక్. ఇవి కాకుండా రాజ్ ఫ్రీలాన్సింగ్ వర్క్స్ కూడా చేస్తాడట. కొన్నిసినిమాలకు కథ స్క్రీన్ ప్లే అందించినందకు కోట్లలో ఛార్జ్ చేస్తుంటాడట రాజ్. తెలుగులో రాజ్ డీఫర్ దోపిడీ, సినిమా బండి లాంటి మూవీస్ ను కూడా నిర్మించారు.

