పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ తో రాజమౌళి ఎందుకు సినిమాలు చేయలేదో తెలుసా?
తెలుగులో చిన్న హీరోలు, పెద్ద హీరోలందరితో సినిమాలు చేసిన రాజమౌళి.. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తో మాత్రం సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా..? ఇక వీరి కాంబోలో సినిమాలు రావడం కష్టమేనా..?

రాజమౌళితో సినిమా అంటే పండగే
రాజమౌళితో సినిమా అంటే ఏహీరోకి అయినా పండగే... ఎందుకంటే జక్కన్న సినిమా చేసిన తరువాత ఆ హీరో రేంజ్ ఎక్కడికో వెళ్తిపోతుంది మరి. ప్రస్తుతం పాన్ఇండియా సినిమాల ఊపులో ఉన్న రాజమౌళి.. టాలీవుడ్ లో దాదాపు టప్ స్టార్స్ అందరితో సినిమాలు చేశాడు. కానీ తెలుగులో టైర్ 1 హీరోలుగా ఉన్న పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ తో మాత్రమే జక్కన్న సినిమాలు రాలేదు. చిన్న హీరోలు అయిన నానీ, నితిన్, సునిల్ తో కూడా మూవీస్ చేసిన రాజమౌళి.. అంత పెద్ద స్టార్స్ అల్లు అర్జున్, పవన్ తో ఎందుకు సినిమాలు చేయలేకపోయాడు.
పవన్ - రాజమౌళి కాంబోలో మిస్సైన సినిమా?
రాజమౌళి సినిమా చేయని స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నారు. చిరంజీవి కూడా చరణ్ మగధీర సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించి.. రాజమౌళి సినిమాలో నటించాను అనిపించుకున్నారు. అయితే పవర స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని రాజమౌళి ప్రయత్నించాడట. పవన్ కళ్యాణ్ కోసం రాజమౌళి ఓ కథను కూడా రాసుకున్నాడట. ఈ కథను పవన్ కు వినిపించాడట కూడా రాజమౌళి. వీరిద్దరి మధ్య సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్న టైమ్ లోనే.. పవన్ కళ్యాణ్ రాజకీయాలపై దృష్టి పెట్టాల్సి వచ్చిందట. రాజమౌళితో సినిమా అంటే చాలా టైమ్ కేటాయించాల్సి వస్తుంది. అటు పాలిటిక్స్ ను.. ఇటు జక్కన్న సినిమాను మెయింటేన్ చేయడం కష్టం కాబట్టి.. ఈసినిమా సెట్స్ వరకూ వెళ్లలేదని తెలుస్తోంది. కానీ విరి కాంబోలో సినిమా వచ్చి ఉంటే.. అది వేరే లెవల్లో ఉండేది. పవర్ స్టార్ అభిమానులకు ఈ కాంబినేషన్ ఓ లోటుగానే ఉండిపోయింది.
అల్లు అర్జున్ కు కథ చెప్పిన జక్కన్న
ఇక రాజమౌళి కాంబినేషన్ లో అభిమానులు ఎక్స్ పెక్ట్ చేసిన మరో హీరో అల్లు అర్జున్. జక్కన్న , బన్నీ కాంబోలో ఇంత వరకూ సినిమా ఎందుకు రాలేదు అని అందరికి ఉన్న అనుమానమే. కానీ వీరి కాంబోలో సినిమా రావాల్సి ఉంది. అది కూడా అనుకోని కారణాల వల్ల ఆగిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఇండస్ట్రీలో వినిపించిన వార్తల ప్రకారం.. అల్లు అర్జున్, అజిత్ తో కలిపి ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా చేయాలని రాజమౌళి అనుకున్నాడట. కానీ ఎందుకో ఆ సినిమా ఆగిపోయిందని సమాచారం. అంతే కాదు అల్లు అర్జున్ కోసం రాజమౌళి ఓ కథను కూడా వినిపించాడని.. కానీ అది నచ్చక బన్నీ రిజెక్ట్ చేసినట్టు టాలీవుడ్ టాక్. ఆతరువాత వీరి కాంబోకు ఎక్కడా స్కోప్ దొరకలేదు
రాజమౌళితో ఇద్దరు హీరోల సినిమాలకు ఛాన్స్ ఉందా?
రాజమౌళితో పవన్, బన్నీ సినిమాలకు ఛాన్స్ ఉందా అంటే.. పవన్ తో ఇక కష్టమనే చెపాలి. ఆయన పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయ్యారు. ప్రస్తుతం పనిపాలనలో బిజీగా ఉన్నారు. నెక్ట్స్ రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా.. రాజమౌలి ప్రాజెక్ట్ లకు కేటాయించేంత టైమ్ ఆయన దగ్గర ఉండదు. సో ఇక పవర్ స్టార్ సినిమాలు చేసినా.. జక్కన్నతో మాత్రం కష్టం. ఇక అల్లు అర్జున్ ఇప్పటికే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. అట్లీ మూవీతో పాన్ వరల్డ్ ను టచ్ చేయాలని ప్రయత్నం గట్టిగా చేస్తున్నాడు. సో ఫ్యూచర్ లో బన్నీతో రాజమౌళి సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ కాంబో ఎప్పుడు కలుస్తుందా అని అభిమానులు ఎదురు చూడాల్సిందే.
వారణాసి పై భారీ అంచనాలు.
ప్రస్తుతం మహేష్ బాబు తో పార్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు రాజమౌళి. వారణాసి టైటిల్ ను రీసెంట్ గా అనౌన్స్ చేశారు. అడ్వెంచర్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాను దాదాపుగా 1500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఈసారి హాలీవుడ్ ను జక్కన్న గట్టిగా టార్గెట్ చేసినట్టు సమాచారం. 2027 సమ్మర్ లో వారణాసి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు టీమ్.

