MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • సమంత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా ? సినిమాలు, వ్యాపారం ద్వారా రాజ్ కంటే ఎక్కువ సంపాదించిన హీరోయిన్

సమంత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా ? సినిమాలు, వ్యాపారం ద్వారా రాజ్ కంటే ఎక్కువ సంపాదించిన హీరోయిన్

Samantha Net Worth : సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి చేసుకున్నారు. దంపతులుగా జీవితం స్టార్ట్ చేయబోతున్నారు. హీరోయిన్ గా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ చూసిన సమంత..  సినిమాలు  వ్యాపారాలతో భారీగా ఆస్తులు పోగేసినట్టు తెలుస్తోంది.  సమంత ఆస్తుల విలువ ఎంత?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 01 2025, 02:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి
Image Credit : instagram/@samantharuthprabhuoffl

సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి

సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి వార్త టాలీవుడ్ ను ప్రస్తుతం ఊపేస్తుంది . తమిళనాడు కోయంబతూర్ లో డైరెక్టర్ రాజ్ ను సమంత రెండో పెళ్ళి చేసుకుంది. తాజాగా ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్ట్రా గ్రామ్ లో వెల్లడించింది. నాగచైతన్యతో విడాకుల తరువాత చాలా కాలం సింగిల్ గానే ఉన్న సమంత... తనతో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ను డైరెక్ట్ చేసిన రాజ్ తో ప్రేమలోపడింది. రాజ్ కు అప్పటికే పెళ్లై విడాకులు అవ్వడం.. ఈ ఇద్దరి స్నేహం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసినట్టు తెలుస్తోంది. ఈక్రమంలో సమంత స్టార్ డమ్.. ఆస్తులు, వ్యాపారాల కు సబంధిచిన వార్తలు వైరల్ అవుతున్నాయి.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
స్టార్ గా వెలుగు వెలిగిన సమంత
Image Credit : @samantharuthprabhuoffl

స్టార్ గా వెలుగు వెలిగిన సమంత

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది సమంత. హీరోయిన్ గా ఆమె భారీ స్థాయిలో ఆస్తులు సంపాదించినట్టు తెలుస్తోంది. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. సామ్ ఒక్క సినిమాకు 10 కోట్లకుపైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. 15 ఏళ్ల నుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంద సమంత. సినిమాలు తో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్, రకరకాల బిజినెస్ ల ద్వారా ఆమె కోట్లు సంపాదిస్తోంది. ఒక్క పుష్ప సినిమాలో ఊ అంటావా" పాట కోసం సమంత 5 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఏం మాయచేసావే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సామ్.. ఫస్ట్ సినిమా నుంచి నాగచైతన్యను ప్రేమించి.. 7 ఏళ్ల ప్రేమ తరువాత 2017లో పెళ్లి చేసుకున్నారు. 2021లో  వీరు విడిపోయారు.

Related Articles

Related image1
రాజ్ నిడిమోరు ఎవరు? సమంత తో బంధం ఎలా మొదలయ్యింది? రాజ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
Related image2
ఏడాదికి 22 సినిమాలు, 10 హిట్లు, రోజుకు 3 షిప్ట్ లలో.. రాత్రి 2 వరకూ పనిచేసిన తెలుగు స్టార్ హీరో ఎవరు?
36
నిర్మాతగా సమంత సంపాదన
Image Credit : instagram/samantha

నిర్మాతగా సమంత సంపాదన

అనారోగ్యం కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న సమంత.. మళ్ళీ కెరీర్‌లో దూసుకుపోతోంది. వరుస చిత్రాలకు సంతకాలు చేయడమే కాకుండా నిర్మాతగా కూడా మారింది. ఈమధ్యనే శుభం లాంటి సినిమాలతో సక్సస్ ఫుల్ నిర్మాతగా కోట్లు సంపాదిస్తోంది. ఇది కాకుండా, సమంత పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తోంది. ఆమెకు సామ్‌సంగ్, డ్రూల్స్, డ్రీమ్ 11, టామి హిల్ఫిగర్ వంటి బ్రాండ్లతో ఒప్పందాలు ఉన్నాయి. ఈ బ్రాండ్ల ద్వారా ఆమె సుమారు 10 కోట్ల వరకు సంపాదించిందని సమాచారం.

46
సమంత లగ్జరీ ఇళ్లు
Image Credit : Instagram/samantharuthprabhuoffl

సమంత లగ్జరీ ఇళ్లు

ఇక సమంత ఆస్తి మొత్తం 200 కోట్ల పైనే ఉంటుందని సమాచారం. ఈ స్టార్ హీరోయిన్ సినిమాలను మాత్రమే నమ్ముకోలేదు.. రియల్ ఎస్టేట్‌ తో పాటు రకరకాల రంగాలలో ఆమె పెట్టుబడులు పెట్టింది. ఆమె దగ్గర డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్.. 8 కోట్ల విలువైన మరో ఇంటితో పాటు సముద్ర తీర ప్రాంతంలో అద్భుతమైన సీఫేస్ ఇల్లు ఉందట. ఈ ఇంటి విలువ 15 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం. హైదరాబాద్, చెన్నై, ముంబాయిలో సమంతకు ఇళ్లు ఉన్నట్టు తెలుస్తోంది.

56
సమంత ఆస్తి, కార్ల కలెక్షన్
Image Credit : X/samantha

సమంత ఆస్తి, కార్ల కలెక్షన్

200 కోట్ల వరకూ ఆస్తి ఉన్న సమంత గ్యారేజ్ లో అద్భుతమైన కార్ల కలెక్షన్ ఉంది. BMW 7-సిరీస్, జాగ్వార్ XF, ఆడి Q7, మెర్సిడెస్ బెంజ్ G63 AMG కార్లు ఉన్నాయి. ఆమెకు లగ్జరీ కార్లంటే ఎంతో ఇష్టం కూడా. సమంత చాలా బ్రాండ్లలో పెట్టుబడులు పెట్టింది. క్లాత్, జ్యూవ్వెలర్రీ బిజినెస్ లో కూడా ఇన్వెస్ట్ చేసింది సామ్. అంతే కాదు సమాజ సేవలో కూడా ఆమె ముందు ఉంది. పిల్లల చదువు కోసం కూడా సపోర్ట్ చేస్తుంది. ఎన్నోఆర్ఫాన్స్ కు డొనేషన్లు ఇస్తోంది సమంత.

66
వ్యాపారంలో దూసుకెళ్తోన్న సమంత
Image Credit : X

వ్యాపారంలో దూసుకెళ్తోన్న సమంత

సమంత రూత్ ప్రభు సినిమాల్లోనే కాకుండా వ్యాపార రంగంలోనూ తన సత్తా చాటుతుంది. ఇప్పటికే సమంత ‘సాకీ’ (Saaki) పేరుతో ఫ్యాషన్ బ్రాండ్‌ను విజయవంతంగా నడుపుతోంది. రీసెంట్ గా పెర్ఫ్యూమ్ బిజినెస్‌లో కూడా అడుగుపెట్టింది. తాజాగా ‘ట్రూలీ స్మా’ ద్వారా ఫ్యాషన్ రంగంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించబోతోంది. ఈ విషయాన్ని ఈమధ్యనే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది సమంత. ఇక రాజ్ కంటే కూడా సమంతే ఎక్కువ ఆస్తిని కలిగి ఉండటంతో పాటు.. లగ్జరీ లైఫ్ ను కూడా లీడ్ చేస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సమంత రూత్ ప్రభు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తమిళ సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Timings: టైమ్ మారింది భయ్య.. ఇక బిగ్ బాస్ అభిమానులకు పండగే? అందరికి అందుబాటు సమయానికి సీజన్ 10
Recommended image2
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image3
Sivaji Remuneration: మరోసారి బిగ్‌ బాస్‌ కి యాంకర్‌గా శివాజీ.. ఊహించని రెమ్యూనరేషన్‌
Related Stories
Recommended image1
రాజ్ నిడిమోరు ఎవరు? సమంత తో బంధం ఎలా మొదలయ్యింది? రాజ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
Recommended image2
ఏడాదికి 22 సినిమాలు, 10 హిట్లు, రోజుకు 3 షిప్ట్ లలో.. రాత్రి 2 వరకూ పనిచేసిన తెలుగు స్టార్ హీరో ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved