MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • అందరి ముందు సుమ పరువు తీసిన బ్రహ్మాజీ... ఆ వివాదం తెరపైకి తెచ్చి వరుస పంచ్లు!

అందరి ముందు సుమ పరువు తీసిన బ్రహ్మాజీ... ఆ వివాదం తెరపైకి తెచ్చి వరుస పంచ్లు!

సుమ ఇటీవల ఓ వివాదంలో ఇరుక్కున్నారు. అందుకు ఓ వర్గం హర్ట్ కాగా క్షమాపణలు చెప్పింది. ఇదే విషయం తెరపైకి తెస్తూ నటుడు బ్రహ్మాజీ వరుస పంచులు వేశారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 05 2023, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Suma Adda

Suma Adda


సుమ అడ్డా షోకి గెస్ట్స్ గా వచ్చారు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ టీం. ఈ మూవీ డిసెంబర్ 8న విడుదల కానుంది. ప్రొమోషన్స్ లో భాగం దర్శకుడు వక్కంతం వంశీ, హీరో నితిన్, నటుడు బ్రహ్మాజీ, హైపర్ ఆది వచ్చారు. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28
Suma Adda

Suma Adda

సుమ షోలో హైపర్ ఆది పంచులు హైలెట్ అయ్యాయి. సుమ, వక్కంతం వంశీ హీరో హీరోయిన్ గా నటించిన కళ్యాణ ప్రాప్తిరస్తు మూవీ గుర్తు చేశాడు. సినిమాలో సుమ హీరో తానని వక్కంతం వంశీ ఫీల్ అయ్యారు. కానీ తర్వాత తెలిసింది అది రాజీవ్ కనకాల అని, పంచ్ వేయడంతో అందరూ గట్టిగా నవ్వేశారు. 
 

38
Suma Adda

Suma Adda

బ్రహ్మజీ కళ్ళ క్రింద వచ్చిన క్యారీ బ్యాగ్ లు కవర్ చేయడానికి కళ్ళ జోడు పెట్టాడని నితిన్ పంచ్ వేశాడు. ఇక హైపర్ ఆది.. సుమ గారు మీరు బ్రహ్మాజీ గారిని తక్కువ అంచనా వేయవద్దు. ఆయన కూడా సుమ అడ్డా మాదిరి ఇంద్రానగర్ గడ్డ పేరుతో ఒక షో చేయబోతున్నారు... అని అన్నాడు. 
 

48
Suma Adda

Suma Adda

గడ్డ అయితే పర్లేదు సెగెడ్డ కాకుండా చూసుకోండని సుమ పంచ్ వేసింది. తర్వాత బ్రహ్మాజీ రెచ్చిపోయాడు. మీరు ఇంకా తింటుంటే ఉంటారా? అని సుమ అడగ్గా... ఇది స్నాక్స్ అండి భోజనం కాదు అన్నాడు. అలాగే భోజనాలు ఎప్పుడూ అంటూ పదే పదే సుమపై పంచులు వేసి వేధించాడు. 
 

58
Suma Adda

Suma Adda

దీని వెనుక నేపథ్యంల్ ఏమిటంటే... ఇటీవల ప్రమోషనల్ ఈవెంట్ కి హాజరైన సుమ మీడియా మీద పంచ్ వేశారు. ఎంతకీ మీడియా వాళ్ళు వేదిక వద్దకు రాకపోవడంతో... మీడియా వాళ్ళు స్నాక్స్ భోజనాల వలే తినేస్తున్నారు. వారు తినడం ముగించుకుని త్వరగా రావాలి అన్నారు. 
 

68
Suma Adda

Suma Adda

దీనిపై మీడియా వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తామేదో స్నాక్స్ కోసమే వస్తున్నట్లు మాట్లాడటం సరికాదని సుమను అప్పుడే నిలదీశారు. దీంతో ఈవెంట్ ముగిశాక సుమ ఓ వీడియో విడుదల చేశారు. తన వ్యాఖ్యలు మీడియా మిత్రులను బాధపెట్టాయని తెలిసింది. అందుకు క్షమాపణలు అన్నారు.

78
Suma Adda

Suma Adda

దాంతో ఆ వివాదం ముగిసింది. అయితే తాజాగా ఈ ఘటనను బ్రహ్మాజీ సుమ అడ్డా షోలో తెరపైకి తెచ్చాడు. సుమ మీద పంచులు వేశాడు. అయితే ఇక్కడ బ్రహ్మాజీ మీడియాకు కూడా చురకలు వేసినట్లు అనిపిస్తుంది. కావాలనే ఈ మేటర్ సుమ అడ్డా షోలో కామెడీగా రాసుకున్నారని తెలుస్తుంది.

88
Suma Adda

Suma Adda

ఇక ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా విషయానికి వస్తే... నితిన్ కి జంటగా శ్రీలీల నటిస్తుంది. రచయిత వక్కంతం వంశీ నాపేరు సూర్య అనంతరం దర్శకుడిగా మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Folk Song: యూట్యూబ్‍లో 110 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్..ఈ పాట వింటే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కాల్సిందే
Recommended image2
Kalyan Padala: తెరపైకి కళ్యాణ్‌ పడాల.. తన లవ్‌ స్టోరీనే బహిర్గతం చేయబోతున్న బిగ్‌ బాస్‌ విన్నర్‌
Recommended image3
Trisha Krishnan: విజయ్ ప్రత్యర్థులతో చేతులు కలిపిన త్రిష..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved