- Home
- Entertainment
- పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఇద్దరూ వస్తే నువ్వు వద్దు అన్నారు..ఆ సంఘటన జరిగాక కూడా బతికున్నానంటే కారణం..
పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఇద్దరూ వస్తే నువ్వు వద్దు అన్నారు..ఆ సంఘటన జరిగాక కూడా బతికున్నానంటే కారణం..
చూడడానికి జూనియర్ చిరంజీవి లాగా ఉండే నటుడు రాజ్ కుమార్. తెలుగు టివి సీరియల్స్ తో 90 వ దశకం నుంచి రాణిస్తున్నాడు. అయితే ప్రస్తుతం రాజ్ కుమార్ కి సరైన అవకాశాలు లేవు.

చూడడానికి జూనియర్ చిరంజీవి లాగా ఉండే నటుడు రాజ్ కుమార్. తెలుగు టివి సీరియల్స్ తో 90 వ దశకం నుంచి రాణిస్తున్నాడు. అయితే ప్రస్తుతం రాజ్ కుమార్ కి సరైన అవకాశాలు లేవు. ప్రతిభ ఉన్నప్పటికీ అదృష్టం లేకపోవడం వల్ల రాజ్ కుమార్ నెక్స్ట్ లెవల్ కి చేరుకోలేకపోయారు.
pawan kalyan
రాజ్ కుమార్ కొన్ని చిత్రాల్లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ సినిమాల్లో అతడికి సరైన గుర్తింపు లభించలేదు. చివరికి సొంత ప్రొడక్షన్ లో సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నాడు. నిర్మాతగా పదేళ్ల క్రితం తాను కష్టపడి సంపాదించిన కోట్లాది రూపాయలు కోల్పోయానని రాజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
నా సొంత ప్రొడక్షన్ లో పదేళ్ల క్రితం బారిస్టర్ శంకర్ నారాయణ్ అనే చిత్రంలో నటించాను.ఆ మూవీలో రెండు గెటప్పులో కనిపిస్తాను. సినిమా చాలా బాగా వచ్చింది. నేను స్టార్ కాదు కాబట్టి జనాల్లోకి ఈ చిత్రాన్ని బాగా తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో పబ్లిసిటీ కోసమే 18 లక్షల వరకు ఖర్చు పెట్టా. దీనితో బయ్యర్లు కూడా ఈ చిత్రంపై ఆసక్తి చూపారు.
నేను చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉండడం, నాకు మంచి గౌరవం ఉండడంతో డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు ఇచ్చి సపోర్ట్ చేశారు. మనవాడే అనే ఉద్దేశంతో సాయం చేశారు. ఈ చిత్రాన్ని 2013 అక్టోబర్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కానీ బయ్యర్లు.. ఆ నెలలో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఇద్దరి చిత్రాలు వస్తున్నాయి. కాబట్టి నీ చిత్రం అప్పుడు వద్దు. సెప్టెంబర్ లోనే రిలీజ్ చేయి.. థియేటర్లు ఎక్కువ దొరుకుతాయి అని చెప్పారు. మంచిదేకదా అని సెప్టెంబర్ 21న బారిస్టర్ శంకర్ నారాయణ్ చిత్రాన్ని రిలీజ్ చేశాం.
సినిమాకి మంచి టాక్ కూడా వచ్చింది. చేస్తున్న పబ్లిసిటీ, వస్తున్న టాక్ కారణంగా నెమ్మదిగా థియేటర్స్ లోకి జనాలు పెరుగుతున్నారు. సెకండ్ వీక్ నుంచి ఇంకా బావుంటుంది అనుకున్నాం. కానీ అప్పుడే నెత్తిన పిడుగు పడ్డట్లు అయింది. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రం పైరసీ లీక్ అయింది. రిలీజ్ కి ముందే లీక్ కావడంతో సడెన్ గా సెప్టెంబర్ 27న ఆ చిత్రాన్ని రిలీజ్ చేసేశారు. దీనితో నా చిత్రానికి ఒక్క థియేటర్ కూడా లేకుండా పోయింది. ఆ సమయంలో నా పరిస్థితి వర్ణనాతీతం. నాకు ఆవగింజ అంత అదృష్టం కూడా లేదు అనుకున్నా.
ఒక్కసారిగా నా చిత్రాన్ని థియేటర్స్ నుంచి తీసేయడంతో 3 కోట్ల నష్టం వచ్చింది. నేను ఇన్నేళ్ల పాటు కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా పోయింది. ఒక్కసారి నాకు నా భార్య పిల్లలు గుర్తుకు వచ్చారు. ఎంతో ఆవేదన చెందా అని రాజ్ కుమార్ అన్నారు. నేను కోల్పోయింది నా సొంత డబ్బు కాబట్టి కనీసం బతికి అయినా ఉన్నా. అదే డబ్బు అప్పు తెచ్చి ఉంటే నా పరిస్థితి ఇంకెలా ఉండేదో ఊహించుకోండి అని రాజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
అత్తారింటికి దారేది చిత్రం పైరసీ లీక్ కావడం వల్ల చిత్రాన్ని సడెన్ గా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ చిత్రం రిలీజ్ అయ్యాక ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే.