MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Motivational Song: కష్టాలన్నీ మీకే ఉన్నాయని ఫీలౌతున్నారా? ఈ పాట వింటే ఎంత కష్టాన్నైనా ఎదురించగలరు..!

Motivational Song: కష్టాలన్నీ మీకే ఉన్నాయని ఫీలౌతున్నారా? ఈ పాట వింటే ఎంత కష్టాన్నైనా ఎదురించగలరు..!

 Motivational Song: జీవితంలో కష్టాలు రావడం చాలా సహజం. అయితే చాలా మంది అన్ని కష్టాలు మాకే ఎందుకు వస్తున్నాయని ఫీలౌతూ ఉంటారు. నిజానికి కష్టం వచ్చినప్పుడు మన వాళ్లు ఎవరు? పరాయి వాళ్లు ఎవరు అనే విషయం తెలుస్తుంది. అలాంటి అర్థాన్ని ఇచ్చే అద్భుతమైన పాట ఇది 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 13 2026, 11:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Motivational song
Image Credit : gemini ai

Motivational song

జీవితం మనం అనుకున్నట్లుగా సాఫీగా సాగిపోతున్నప్పుడు అందరూ మనవారే. కానీ, ఒక్కసారిగా జీవితం తలకిందులై, ఉన్నదంతా కోల్పోయి రోడ్డున పడితే..? అప్పుడే మొదలౌతుంది అసలైన మనిషి పోరాటం. అచ్చం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న యువకుడి మనో ధైర్యాన్ని, జీవితం పట్ల అతనికి ఉన్న పాజిటివ్ దృక్పథాన్ని అద్దం పట్టే పాటే.. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలోని చల్ చలో చలో..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రామ జోగయ్య శాస్త్రి కలం నుంచి జారిన అద్భుతం..
Image Credit : our own

రామ జోగయ్య శాస్త్రి కలం నుంచి జారిన అద్భుతం..

దేవి శ్రీ ప్రసాద్ స్వరకల్పనలో, రామ జోగయ్య శాస్త్రం కలం నుంచి జాలువారిన అద్భుతమైన పాట ఇది. కేవలం ఇది ఒక సినిమా పాట మాత్రమే కాదు.. ఓటమిలో ఉన్న ప్రతి ఒక్కరినీ తట్టిలేపే ఒక జీవిత పాఠం. కన్నీళ్లు ఎందుకు ఉప్పగా ఉంటాయి? కష్టాలు ఎందుకు బరువుగా ఉంటాయి? అనే ప్రశ్నలకు ఈ పాట ఇచ్చే సమాధానం ప్రతి ఒక్కరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఓటమిని కూడా ఒక అవకాశంగా మార్చుకొని, మడతలు పడని చొక్కాలా కాకుండా.. మట్టిలో కలిపిన విత్తనంలా ఎదగమని చెప్పే అర్థవంతమైన పాట ఇది. ఈ పాటలోని లిరిక్స్ ఓసారి చూస్తే....

Related Articles

Related image1
Emotional: ఈ పాట వింటే.. బండరాయి లాంటి మనిషి కంట కూడా నీరు రావాల్సిందే..!
Related image2
Hi Nanna: నాని సూపర్ హిట్ సినిమా ‘హాయ్ నాన్న’ ఆ సినిమా కి కాపీనా? మక్కీ టూ మక్కీ దింపేశారుగా..!
34
 పాట: చల్ చలో చలో
Image Credit : instagram

పాట: చల్ చలో చలో

రచన: దేవి శ్రీ ప్రసాద్ / రామజోగయ్య శాస్త్రి

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

గానం: రఘు దీక్షిత్

లిరిక్స్:

రాజ్యం గెలిచినోడే రాజవుతాడు.. రాజ్యం విడిచినోడే రామచంద్రుడు..

యుద్ధం గెలిచేటోడు వీరుడు శూరుడు.. యుద్ధం విడిచేటోడే దేవుడు!!

చల్ చలో చలో.. లైఫ్ సే మిలో.. ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో!

చల్ చలో చలో.. చలించు దారిలో.. ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో!

కన్నీళ్లెందుకు ఉప్పగుంటాయి? తియ్యగుంటే కడదాకా వదలవు గనుక..

కష్టాలెందుకు బరువుగుంటాయి? తేలికైతే బ్రతుకంతా మోస్తావు దించవు గనుక!

బెదురే లేని నీకు కాక.. ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక?

చూద్దాం అంటూ నీ తడాఖా.. వచ్చింది ఇబ్బంది నువ్వున్న ఇంటి గడప దాకా!

పడ్డవాడే.. కష్టపడ్డవాడే పైకి లేచే ప్రతోడూ..

ఒక్కడైనా కానరాడే.. జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు!!

మడత నలగని షర్టు లాగా అల్మారాలో పడి ఉంటే అర్థం లేదు..

గీత తగలని కాగితంలా వట్టి చెదలు పట్టి పోతే ఫలితం లేనే లేదు!

పుడుతూనే గుక్క పెట్టినగాక.. కష్టమన్న మాటేం కొత్తం కాదు..

కొమ్మల్లో పడి చిక్కుకోక.. ఆకాశం ఎత్తుల్లో ఏ గాలిపటం ఎగరలేదు!

ప్లస్ కాదు మైనస్ కాదు అనుభవాలే ఏదైనా..

ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపోరా నీదైన గెలుపు దారిలోనా!!

44
పాట గొప్పతనం:
Image Credit : Sarigama Cinemas/YT

పాట గొప్పతనం:

వైఫల్యం నుండి విజయం వైపు: కష్టాలు , వైఫల్యాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, వాటిని జీవితంలో ఒక 'కొత్త అధ్యాయం'  గా స్వీకరించాలని ఈ పాట బోధిస్తుంది.

అనుభవమే అసలైన పాఠం: జీవితంలో ఎదురయ్యే ఏ పరిస్థితైనా ప్లస్ లేదా మైనస్ కాదని, అది కేవలం ఒక 'అనుభవం' మాత్రమేనని, దాని నుండి నేర్చుకుంటూ ముందుకు సాగాలని చెబుతుంది.

పోరాటమే జీవితం: పడ్డవాడే ఎప్పటికైనా పైకి లేస్తాడని, పోరాడకుండా ఈ ప్రపంచంలో ఎవరూ విజయం సాధించలేరనే నిగ్గుతేల్చిన సత్యాన్ని ఈ పాట అద్భుతంగా వివరిస్తుంది.

తత్వశాస్త్రం (Philosophy): కన్నీళ్లు ఉప్పగా, కష్టాలు బరువుగా ఎందుకు ఉంటాయో చెప్పే పంక్తులు మనిషికి జీవితం పట్ల ఒక గొప్ప అవగాహనను, ధైర్యాన్ని కలిగిస్తాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: ఏఎన్నార్ తొలి సంపాదన ఎంతో తెలుసా? దాంతో ఏం చేశారు? అక్కినేని వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు?
Recommended image2
Maremma Movie Review: మారెమ్మ మూవీ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Bigg Boss Telugu 10: నేను వాడిని కచ్చితంగా కెలుకుతా, పవర్ తో వర్షిణిని బాత్రూమ్ లో ఇరికించిన షాలిని
Related Stories
Recommended image1
Emotional: ఈ పాట వింటే.. బండరాయి లాంటి మనిషి కంట కూడా నీరు రావాల్సిందే..!
Recommended image2
Hi Nanna: నాని సూపర్ హిట్ సినిమా ‘హాయ్ నాన్న’ ఆ సినిమా కి కాపీనా? మక్కీ టూ మక్కీ దింపేశారుగా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved