- Home
- Entertainment
- Highest Paid Actress: నయనతార, సమంతని వెనక్కి నెట్టేసిన హీరోయిన్.. అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి ఎవరంటే
Highest Paid Actress: నయనతార, సమంతని వెనక్కి నెట్టేసిన హీరోయిన్.. అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి ఎవరంటే
సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి ఎవరు? 2026 నాటికి నయనతార, సమంత, త్రిషాలను వెనక్కి నెట్టి ఓ స్టార్ హీరోయిన్ టాప్ ప్లేస్‌కు చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.
15

Image Credit : Asianet News
అత్యధిక పారితోషికం తీసుకునే నటి
చాలా కాలం పాటు సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నయనతారనే ఉండేది. ఆమె ఒక్కో సినిమాకు రూ.9 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. నిర్మాతల మొదటి ఛాయిస్‌గా కూడా ఆమెనే ఉండేవారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
25
Image Credit : instagram
రష్మిక మందన్న పారితోషికం
కానీ, తాజా సమాచారం ప్రకారం, ఇప్పుడు ఆ స్థానాన్ని రష్మిక మందన్న దక్కించుకుందని ఇండస్ట్రీలో గట్టిగా టాక్ నడుస్తోంది. 'కాక్‌టెయిల్ 2' సినిమా కోసం ఆమె ఏకంగా రూ.15 కోట్లు తీసుకున్నట్లు వస్తున్న వార్త సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే, ఈ విషయంపై నటి గానీ, నిర్మాణ సంస్థ గానీ అధికారికంగా స్పందించలేదు.
35
Image Credit : instagram
రష్మిక పాపులారిటీ
'పుష్ప', 'యానిమల్' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ల తర్వాత రష్మిక పాపులారిటీ దేశవ్యాప్తంగా పెరిగింది. మొదట్లో కొన్ని కోట్లలో ఉన్న ఆమె రెమ్యునరేషన్, ఇప్పుడు రెండంకెల కోట్లకు చేరిందని సమాచారం. ఇది ఆమెకు పెరిగిన ఫ్యాన్ బేస్, పాన్-ఇండియా అప్పీల్‌ను స్పష్టంగా చూపిస్తోంది.
45
Image Credit : instagram
త్రిష పారితోషికం
ప్రస్తుతం త్రిష ఒక సినిమాకు సుమారు రూ.10 కోట్లు, సమంత రూ.7 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు తీసుకుంటున్నారట. ఇక సాయి పల్లవి రూ.6 కోట్లు, అనుష్క శెట్టి రూ.5 నుంచి రూ.6 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది.
55
Image Credit : instagram
అందుకే పారితోషికాలు పెరుగుతున్నాయి
ప్రస్తుత సినిమాల్లో హీరోయిన్లు కేవలం కథానాయికలుగానే కాకుండా, సినిమా వ్యాపార విజయాన్ని నిర్దేశించే శక్తిగా మారుతున్నారు. ఫలితంగా, వారి పారితోషికాలు కూడా పెరుగుతున్నాయి.
Latest Videos

