- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: నిజం తెలుసుకొని లాస్య చంప పగలగొట్టిన తులసి.. భార్యపై అనుమానం పెంచుకున్న నందు?
Intinti Gruhalakshmi: నిజం తెలుసుకొని లాస్య చంప పగలగొట్టిన తులసి.. భార్యపై అనుమానం పెంచుకున్న నందు?
Intinti Gruhalakshmi: స్టార్ మాలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకుంటుంది. ఆస్తి కోసం సవతి కొడుకు జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్న ఒక సవతి తల్లి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 3 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో మీకు ఫస్ట్ నైట్ జరుగుతుందన్న ఆనందంలో ఆలోచించుకుంటూ మెట్లు ఎక్కుతున్నాను, అంతలోనే కాలు స్లిప్ అయిపోయింది అంటూ గోల చేస్తుంది రాజ్యలక్ష్మి. హాస్పిటల్ కి వెళ్దామా అంటాడు విక్రమ్. వద్దు మీరు గదిలోకి వెళ్ళండి అంటుంది రాజ్యలక్ష్మి. అవును మీరు వెళ్ళండి మేమందరం రాత్రి మీ అమ్మగారి పక్కనే ఉంటాము అంటారు తులసి వాళ్ళు.
అమ్మకి ఇలా ఉంటే నేను వెళ్ళలేను. నేను దివ్య ఇద్దరం అమ్మ పక్కనే ఉంటాము అంటాడు విక్రమ్. ఆమెని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెడతారు అందరూ. కంగారు పడకండి అని చెప్పి మెడిసిన్ తీసుకువస్తుంది దివ్య. చూసుకోవటానికి ఫ్రీగా ఉంది కదా మీరు వెళ్ళండి చూడు దివ్య ఎంత బాధ పడుతుందో అని విక్రమ్ తో చెప్తుంది రాజ్యలక్ష్మి.
తనేమీ బాధపడదు.. ఎందుకంటే నువ్వు నాకెంతో, తనకి కూడా అంతే. ఆ మాట తనే చెప్పింది అంటాడు విక్రమ్. గెలిచాను చూసావా అన్నట్లుగా లాస్యకి సైగ చేస్తుంది రాజలక్ష్మి. ఇక చేసేదేమీ లేదని అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత రాజ్యలక్ష్మి కి ఫోన్ చేసి వాళ్ళిద్దర్నీ గదిలోకి పంపించేస్తుంటే నువ్వు చేతులెత్తేసావేమో, శోభనం జరిగిపోతుందేమో అని కంగారు పడ్డాను. కానీ చివరి నిమిషంలో భలే ట్విస్ట్ ఇచ్చావు అంటూ మెచ్చుకుంటుంది లాస్య. ఇది నా సామ్రాజ్యం, ఇక్కడ అందరి తలరాతలు నేనే రాసేది. ఈ రాజ్యంతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అందరూ తెలుసుకోవాలి.
ఇదే విషయం దివ్య తల్లిదండ్రులకు కూడా తెలియాలి అంటుంది రాజ్యలక్ష్మి. మళ్లీ ముహూర్తం ఎప్పుడు పెట్టిస్తావు అంటుంది లాస్య. నీకెందుకు అంత తొందర అంటుంది రాజ్యలక్ష్మి. మళ్లీ ఎలాంటి ప్లాన్ వేస్తావో అని ఆత్రంగా ఉంది అంటుంది లాస్య. మీ డబ్బు తులసి ద్వారా మళ్ళీ మీ దగ్గరికి చేరింది కదా ఆ డబ్బుని మళ్లీ నాకు అందేలాగా చేయండి నాకు చాలా అవసరం ఉంది అంటుంది లాస్య. ఆ డబ్బు వాళ్ల చేతికి ఎందుకు వెళ్ళింది అంటుంది రాజ్యలక్ష్మి. నేను మీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఎలా చూసిందో.. తులసి చూసిందంట, ఇంటికి వచ్చి పెద్ద గొడవ చేసింది.
దివ్య ని మీకు బలి పశువుని చేసినందుకు తీసుకుంటున్న డబ్బులు అని నేను వాళ్లతో చెప్పలేదు. అయినా ఈ విషయం వాళ్లకు ఎప్పటికీ తెలియదు కూడా, అవసరానికి మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను అని అబద్ధం చెప్పాను అని మాట్లాడుతూ వెనక్కి తిరిగేసరికి అక్కడ తులసి ఉండటం చూసి నిర్గంత పోతుంది. అప్పటికే ఆ మాటలు అన్ని విన్న తులసి కోపంతో రగిలిపోతూ లాస్య చంప పగలగొడుతుంది. నన్ను ఎందుకు కొట్టావు ఈ ఇంట్లో రోజురోజుకీ నాకు రక్షణ లేకుండా పోతుంది అంటూ గట్టిగా అరుస్తుంది లాస్య. ఆ కేకలకి పరంధామయ్య దంపతులు, నందు అక్కడికి వస్తారు.
చూడు నందు నన్ను ఎలా కొట్టిందో అంటూ మొగుడికి కంప్లైంట్ ఇస్తుంది లాస్య. ఎవరూ లేనప్పుడు కాదు అందరూ ఉంటుండగానే కొడతాను అంటూ మళ్ళీ చెంప చెల్లుమనిపిస్తుంది తులసి పక్కన నువ్వున్నా కూడా నాకు ఈ ఇంట్లో రక్షణ లేదంటే, నా బాధని ఎవరితో చెప్పుకోమంటాను అంటూ కన్నీరు పెట్టుకుంటుంది లాస్య. నేను ఉండగానే నా భార్య ని కొట్టావు అంటే నీకు ఎంత ధైర్యం అసలు తను ఏం తప్పు చేసింది అంటాడు నందు. చెప్పాలనుకుంటుంది కానీ అసలకే కూతురికి ఏదో అయిపోతుంది అని భయపడుతున్నారు. ఇప్పుడు నిజం తెలిసింది అంటే ఆయన మరింత కంగారు పడతారు అనుకొని నిజం చెప్పటానికి సందేహిస్తుంది తులసి.
దాంతో మరింత కోప్పడిన నందు లాస్యకి క్షమాపణలు చెప్పమంటాడు. అది సరిపోదు కాళ్లు పట్టుకొని క్షమాపణ అడగాలి అంటుంది లాస్య. చచ్చినా ఆ పని చేయను ఏం చేసుకుంటావో చేసుకో అంటూ మొండికేస్తుంది తులసి. ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది లాస్య. నువ్వు నా దృష్టిలో దిగజారి పోయావు, నువ్వు కూడా అందరిలాంటి మామూలు ఆడదానివే అంటూ నందు కూడా అక్కడ నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు ఈ ఫస్ట్ నైట్ జరగదని నీకు ముందే ఎలా తెలుసు అని ప్రియని నిలదీస్తుంది దివ్య. నిజం చెప్తే బావగారికి అన్యాయం చేసినట్లు అవుతుంది, ఇంట్లో గొడవలు మొదలవుతాయి అనుకొని మౌనంగా ఉంటుంది ప్రియ.
నువ్వు ఏదో క్యాజువల్ గా అన్నావు అనుకున్నాను కానీ నువ్వన్నట్లుగానే జరిగింది అంటుంది దివ్య. నేనేదో క్యాజువల్ గా అన్నాను అంటుంది ప్రియ. కానీ ఈ ఇంట్లో ఏదో తప్పు జరుగుతుంది, అది నీకు తెలుసు అంటుంది దివ్య. తరువాయి భాగంలో రాజ్యలక్ష్మి మేనేజర్ లాస్యకి ఫోన్ చేస్తాడు. అది చూసిన నందు వాడు ఎందుకు నీకు ఫోన్ చేస్తున్నాడు అంటూ స్పీకర్ పెట్టి మాట్లాడిస్తాడు. విషయం తెలుసుకుని నిజం చెప్పమంటూ ఆమె మీద చెయ్యి ఎత్తుతాడు నందు.