- Home
- Entertainment
- Intinti gruhalakshmi: నందుని, లాస్యాని ఒక ఆట ఆడుకున్న తులసి.. ఆనందంలో కుటుంబ సభ్యులు!
Intinti gruhalakshmi: నందుని, లాస్యాని ఒక ఆట ఆడుకున్న తులసి.. ఆనందంలో కుటుంబ సభ్యులు!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు జులై 30వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.... జడ్జ్ లక్కీకి, హనీ కి బహుమతుల్ని ఇస్తాడు. అందరూ చప్పట్లతో వాళ్లని అభినందిస్తారు. తులసి ,లక్కీ దగ్గరికి వెళ్లి "చాలా బాగా చేశావు"అని అభినందిస్తుంది. అంతటిగా కార్యక్రమం పూర్తవుతుంది హనీ ఇంటికి వచ్చి రాత్రంతా ఆ బహుమతి తోనే ఆడుకుంటూ ఉంటాది. ఆ ఆనందమైన సమయంలో హనీ వాళ్ళ తాతయ్య హనీ కి ఫోటో తీస్తాడు. సామ్రాట్ మాత్రం తులసి గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు. హనీ వాళ్ళ తాతయ్య హనీ ని పడుకోడానికి లోపల పంపిస్తాడు.
సామ్రాట్ తనలో తానే మురిసిపోవడం చూసి సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ఏమైంది? అని అడగగా "చాలా రోజుల తర్వాత, హనీ ని నవ్వడం చూశాను బాబాయ్", "దీనంతటికీ కారణం తులసి ఏ, తులసి హనీ జీవితం లోకి వచ్చిన తర్వాత తెలియకుండానే చాలా మార్పులు చూసాను బాబాయ్, ఇప్పుడు హనీ నవ్వుతున్న నవ్వులో ఒక జీవం ఉంటుంది"అని సామ్రాట్ అనగా సామ్రాట్ వాళ్ళ బాబాయ్ మాత్రం "హనీ జీవితంలో వచ్చిన మార్పు కన్నా, నీ జీవితంలో వచ్చిన మార్పు నాకు బాగా నచ్చింది.
ప్రతిఒక్కల్ని డబ్బు మనుషుల్లా చూసే నువ్వు మొట్టమొదటిసారి ఒక మనిషిలో నిజాయితీని చూసావు" అని అంటాడు. "ఇప్పుడిప్పుడే మారుతున్నాను బాబాయ్ "అని అనగా, మరి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా అని వాళ్ళ బాబాయ్ అంటాడు. ఈ వయసులో పెళ్లి ఏంటి అని చెప్పి నవ్వుకుంటూ వెళ్లిపోతాడు సామ్రాట్. ఆ తర్వాత సీన్లో తులసి, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇంట్లో కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు మీకు నచ్చిన వంటలు చెప్పండి అని తులసి అడగగా, కుటుంబ సభ్యులందరూ ఎవరికీ నచ్చిన వంట పదార్థాలు వాళ్ళు చెప్పారు, తులసి అవన్నీ తెలుసుకొని వంట గదిలోకి వెళ్తూ ఉంటాది.
నిజంగా ఇవన్నీ చేస్తావా అమ్మ? అని తులసి వాళ్ళ కూతురు అడగగా, లేదు అందరికీ కలిపి ఇడ్లీ పెడతాను అని అంటుంది తులసి. అందరూ నవ్వుకుంటూ గొడవపడతారు. ఆ ఆనంద సమయంలో నందు, లాస్య తులసి వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్ళిద్దరిని చూసి అందరూ వాళ్ళ మొఖాలను మాడ్చేస్తారు. "ఇప్పుడు ఏ గొడవ చేయడానికి వచ్చారు" అని నందు వాళ్ళ అమ్మ నాన్న, నందుని లాస్య అని అడుగగా బిజినెస్ ప్లాన్ మీద వచ్చాము అని నందు అంటాడు. ఆ బిజినెస్ ప్లాన్ సామ్రాట్ అంకుల్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా? అని తులసి వాళ్ళ కూతురు అడగగా, "వీళ్లిద్దరూ సామ్రాట్ దగ్గర పని చేసేవాళ్ళు" అని అంటుంది తులసి.
నందు వాళ్ళ అమ్మ, లాస్య ని నందుని పనోళ్ళు అని ఎక్కిరిస్తుంది. కొంచెం మర్యాదగా మాట్లాడండి అని వాళ్ళని తిడుతుంది లాస్య. "సామ్రాట్ గారూ ప్రాజెక్టు కోసం ఇక్కడికి రమ్మంన్నారు కనుక వచ్చాము, లేకపోతే మాకు ఇక్కడికి వచ్చే ఉద్దేశం లేదు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు వెళ్ళిపోతాము, నీకే నష్టం" అని లాస్య అనగా, వెళ్లిపోండి అని తులసి అంటుంది, ఇంట్లో వాళ్ళందరూ లాస్య నీ చూసి నవ్వుతారు. ఇలాగ కొన్ని వాదనలు అయిన తర్వాత లాస్య ,నందు "ఇందాక మేము మాట్లాడిన మాటలు మర్చిపోండి మేము కేవలం ప్రాజెక్టు గురించి వచ్చాము" అని నెమ్మదిగా అనగా తులసి వాళ్ళని లోపలికి రమ్మని ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతారు.
ఈలోగా తులసి వాళ్ళ అత్త, ఇందాక జరిగిన విషయాన్ని ఆలోచించుకుంటూ తెగ నవ్వుకుంటూ ఉంటాది. దాన్ని చూసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. అందరూ కలిసి తులసిని పొగుడుతు నందుని లాస్యాని తిట్టుకుని "దీన్నే కర్మ అంటారు", ఒకప్పుడు ఎవరినైతే చదువులేదు అని తిట్టారో, ఇప్పుడు వాళ్ళ ముందే వినయంగా కూర్చుని మాట్లాడుతున్నారు ,అని ఆనందంగా నవ్వుకుంటూ ఉంటారు అందరూ.
ఈలోగా నందు లాస్యాలు ఆ ప్లాన్ ని తులసికి వివరిస్తారు ప్లాన్ అంతా విన్న తర్వాత తులసి ఆ ప్లాన్ నాకు నచ్చలేదు అని చెప్తుంది. దానికి నందు "మీరు పాత గొడవలు మనసులో పెట్టుకొని దీని వద్దనకండి" అని అనగా, తులసి నేను ప్లాన్ గురించి మాట్లాడితే మధ్యలో గొడవలు ఎందుకు వచ్చాయి? ప్లాన్ నచ్చలేదు అని చెప్పే స్వతంత్రం కూడా నాకు లేదా? అని నందుని తిడుతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం వరకు వేచి చూడాల్సిందే!!