- Home
- Entertainment
- చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?
చిరంజీవి నటించిన ఒక చిత్రం ఫ్లాప్ అయింది. కానీ దానిని హిట్ అని చెప్పుకున్నారు అని టాలీవుడ్ సీనియర్ నటుడు కామెంట్స్ చేశారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

90వ దశకంలో చిరంజీవి క్రేజ్
మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ 90 వ దశకం ఆరంభంలో పీక్ కి చేరింది. ఆ టైం లో చిరంజీవి సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ హిట్ లేదా ఇండస్ట్రీ హిట్ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. ఆ సమయంలో చిరంజీవి నటించిన ఒక సినిమాకి, సీనియర్ నటుడు గిరిబాబు తెరకెక్కించిన సినిమాకి మధ్య వివాదం నడించింది. చిరంజీవి సినిమా వల్ల తాను నష్టపోవడమే కాక, తన కొడుకు భవిష్యత్తు కూడా నాశనం అయింది అని గిరిబాబు ఓ ఇంటర్వ్యూలో అన్నారు.
చిరంజీవి కౌబాయ్ చిత్రం
అసలు గిరిబాబుని నష్టపోయేలా చేసిన చిరంజీవి సినిమా ఏంటి, గిరిబాబు నష్టపోవడానికి అసలు కారణం ఏంటి అనేది వివరాల్లో తెలుసుకుందాం. 1990లో గిరిబాబు తన తనయుడు బోస్ బాబుని హీరోగా పెట్టి ఇంద్రజిత్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి దర్శకుడు కూడా గిరిబాబే. ఇది కౌబాయ్ చిత్రం. అదే సమయంలో చిరంజీవి హీరోగా కైకాల సత్యనారాయణ నిర్మించిన కొదమసింహం చిత్రం ప్రారంభం అయింది. చిరంజీవి సినిమా కంటే ముందుగా మేమే రిలీజ్ డేట్ ప్రకటించాం.
గిరిబాబు తనయుడి సినిమాపై కుట్ర
డిస్ట్రిబ్యూటర్లు అందరూ మా సినిమా కొనడానికి చర్చలు జరుపుతున్నారు. ఆ సమయంలో కొదమసింహం చిత్ర యూనిట్ లో కొందరు కుట్ర చేసి బయ్యర్ల ద్వారా మా సినిమాని ముందే చూశారు. వెంటనే దీనికంటే ముందే కొదమసింహం రిలీజ్ చేయాలని కుట్ర చేశారు. శరవేగంగా ఎడిటింగ్ పూర్తి చేసి కొదమసింహం రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మేము రిలీజ్ చేయాలనుకున్న డేట్ నే వాళ్ళు కూడా ప్రకటించారు. దీనితో బయ్యర్లు అందరూ మా సినిమాని వదిలిపెట్టి వాళ్ళ సినిమా కొనడానికి వెళ్లారు. ఇదేంటి అని అడిగితే.. అది చిరంజీవి సినిమా. పైగా కౌబాయ్ జోనర్. మీ అబ్బాయి కొత్తవాడు ఎలా ధైర్యం చేసి కొనాలి అని అన్నారు.
చిరంజీవి సినిమా ఫ్లాప్
అక్కడే దెబ్బ పడింది. దీనితో మా సినిమాని వాయిదా వేసుకోక తప్పలేదు అని గిరిబాబు అన్నారు. దీనితో కొదమసింహం రిలీజ్ అయింది. ఆ సినిమా ఫ్లాప్ అయింది. వాళ్ళు హిట్ అని చెప్పుకున్నారు. వాస్తవానికి అది ఫ్లాప్ సినిమా. ఆ సంగతి నాకు తెలుసు అని గిరిబాబు అన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి మా సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహకాలు చేశాం. ఆ టైంలో బయ్యర్లు అడ్డం తిరిగారు. చిరంజీవి కౌబాయ్ చిత్రమే హిట్ కాలేదు. ఇక మీ అబ్బాయి సినిమాని ఏ ధైర్యంతో కొనాలి అని అన్నారు. సగం రేటుకు మాత్రమే కొనేందుకు అంగీకరించారు.
సగం నష్టమే
ఆ చిత్రానికి బడ్జెట్ అప్పట్లోనే 40 లక్షలు ఖర్చయింది. బయ్యర్లు మాత్రం 20 లక్షలకే కొన్నారు. బయ్యర్లు మాత్రం లాభపడ్డారు. నాకు తీవ్ర నష్టం తప్పలేదు. పైగా సినిమా ఫ్లాప్ అని కొందరు ముద్ర వేయడంతో మా అబ్బాయి భవిష్యత్తు కూడా దెబ్బతినింది అని గిరిబాబు తెలిపారు.

