Intinti Gruhalakshmi: నందుకి ధైర్యం చెప్పిన తులసి.. ఆస్తిపై కన్నేసిన నందు, లాస్య?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు జనవరి 31వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో దివ్య నా గురించి దిగులు పడకు, ఎక్కువగా ఆలోచించకు ప్రశాంతంగా ఉండు మామ్ అని అంటుంది. మళ్లీ నీ ఒడిలో తల పెట్టుకుని పడుకునే అవకాశం ఎప్పుడు వస్తుందో ఏమో, నీ పక్కనే ఒక దిండు పెట్టుకొని పడుకో అది నేనే అనుకో అనడంతో తులసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ తర్వాత దివ్య తన అన్నయ్య వదినలను హత్తుకుని ఎమోషనల్ అవుతుంది. అప్పుడు ప్రేమ్ దివ్య కి ధైర్యం చెబుతూ నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించకు నువ్వు నీ లక్ష్యం గురించి మాత్రమే ఆలోచించు. అమ్మ మీరందరూ రావద్దు నేను అన్నయ్య వెళ్లి దివ్యని ఫ్లైట్ ఎక్కించి వస్తాము అని అంటాడు ప్రేమ్. ఆ తర్వాత దివ్య అందరికీ సెండాఫ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తులసి పడుకోగా పదేపదే దివ్య మాట్లాడిన మాటలే గుర్తుకు రావడంతో బాధపడుతూ ఉంటుంది.
అప్పుడు మొబైల్ ఫోన్లో దివ్య ఫోటో చూస్తూ మీ అమ్మని ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళిపోయావు అక్కడ ఒంటరిగా ఎలా ఉంటావో ఏం చేస్తావో అసలు భయం లేదు. నేను ఎలా ఉండాలో అన్న దిగులు తప్ప, ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది పదేపదే నువ్వు గుర్తుకు వస్తున్నావు అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది తులసి. అప్పుడు తులసి పడుకోవడంతో ఇంతలో నందు బయట ఏదో తవ్వుతూ ఉండగా దొంగ అయితే ఇలా ఎందుకు తగ్గుతాడు అనుకుంటూ అక్కడికి వెళుతుంది. అక్కడ నందుని చూసి ఒక్కసారిగా ఆశ్చర్య పోతుంది తులసి. అప్పుడు తులసి నందుని ఆపడానికి ప్రయత్నించగా నందు మాత్రం తులసీని పక్కకు నెట్టేయడంతో గట్టిగా ఆపండి అని తులసి రావడంతో నందు ఆ గడ్డపార అక్కడ పక్కన పడేసి వెళ్లి సోఫాలో కూర్చుని కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
ఎందుకు ఇలా చేస్తున్నారు అనడంతో నా మీద నాకే అసహ్యం వేస్తోంది చేతగాని తనంతో ఏం చేయలేకపోతున్నాను అనగా అందుకని మిమ్మల్ని మీరే బాధ పెట్టుకుంటారా చేతులు చూపించండి అనడంతో నందు చేతులను చూసి బాధపడుతూ ఉంటుంది తులసి. ఎందుకు ఇంత పిచ్చితనం ఎవరిని సాధించాలని అని అనడంతో నేనెవరిని సాధించగలను అంటాడు నందు. లేదు నాకు ఇంట్లో ఎవరు విలువ ఇవ్వడం లేదు అనడంతో వెంటనే తులసి ఇంట్లో విలువ ఇవ్వడం అంటే ఏంటి నీకు ఇంట్లో ఎవరు ఏది తక్కువ చేశారు అని అంటుంది. అదే నిజమైతే మీరు గోయి తవ్వుతున్నప్పుడు నేను ఎందుకు వచ్చి ఆపుతాను నాకెందుకు అవసరం అని అంటుంది. బయట అంగవైకల్యం ఉన్నవాళ్లే ఎవరు ఏమనుకున్నా పర్లేదు అని బతకగలుగుతున్నారు అలాంటిది మీ సమస్య ఏంటో మీరు పరిష్కరించుకోండి అంతేగాని ఇలా చేయడం కరెక్ట్ కాదు అని తెలిసి ఉంటుంది.
కష్టాలు ఉన్నాయని ఇంట్లో వాళ్ళందరినీ నిందిస్తూ కూర్చోవడం అన్నది పిరికి వాళ్ళ లక్షణం. ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ దేవుడికి తెలుసు. ఆరాటపడి ఆవేశపడి లాభం లేదు అని అంటుంది. మీ కోపం వల్ల ఇంట్లో వాళ్ళందరి బాధపెడుతున్నారు అది తెలుసుకోండి అని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మొదటి రోజు ఉదయం అందరూ రేపనల్లో వాళ్ళు ఉండగా ఇంతలో పరందామయ్య అక్కడికి మాయదారి పందికొక్కు ఎక్కడి నుంచి వచ్చిందో తిడుతూ ఉంటాడు. ఏమైంది మామయ్య అనడంతో పెరట్లో ఒక పందికొక్కు వచ్చి గొయ్యి తవ్వింది అనగా తులసి నవ్వుకుంటూ ఉండడంతో నందు ఏం మాట్లాడాలో తెలియక తలదించుకుంటాడు. అప్పుడు అందరూ పందికొక్కు గురించి టాపిక్ మాట్లాడుతూ ఉండగా నన్ను ఇన్సల్టింగ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు.
అప్పుడు తులసి మాత్రం నవ్వుకుంటూ ఉంటుంది. కొరియర్ రావడంతో తులసి ఆ పేపర్లు తీసుకొని వస్తుంది. ఇంతలో లాస్య వచ్చి ఆ పేపర్లు తీసుకుని చదివి అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పి కబ్జా అయిన భూమి మీ చేతికి వచ్చింది అనడంతో అందరూ సంతోష పడుతూ ఉంటారు. అప్పుడు నందు ఈ ఆస్తి నా కోసమే కలిసి వచ్చింది ఏమో మా నాన్న నాకు బిజినెస్ లో సహాయం చేస్తారు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు తులసి మనకు మంచి రోజులు వస్తున్నాయేమో మామయ్య అనడంతో అంతకంటే ఏం కావాలమ్మా అని అంటాడు. అప్పుడు అందరూ కలిసి పార్టీ చేసుకుందాం అని నవ్వుకుంటూ ఉంటారు.
ఆ తర్వాత లాస్యతన గదిలోకి వెళ్లి ఆస్తి నందుకి ఇస్తాడా ఇవ్వడా అనుకుంటూ బొమ్మ, బొరుసు ఆట ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ కాయిన్ ను విసిరేయగా నందు క్యాచ్ పట్టుకుంటాడు. ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు నందు వెళ్లి మీ నాన్నను ఆస్తిని నీ పేరు మీద రాయమని అడుగు అనడంతో నాన్ననే గుడ్ న్యూస్ చెప్తాడు అని వెయిట్ చేస్తున్నాను లాస్య అనగా లాస్య వెటకారంగా మాట్లాడిస్తూ ఉంటుంది. సిగ్గు ఇవన్నీ పక్కన పెట్టి వెళ్లి మీ నాన్నని అడుగు నందు అని అంటుంది. తులసి,పరంధామయ్య ఇద్దరూ ప్రాపర్టీ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ విషయం గురించి మీరే ఆలోచించాలి మామయ్య అనడంతో నాకు అంత ఆలోచన శక్తి ఉంటే ఇంకేం తెలుసు నువ్వు ఏదంటే అదే ఆనందు అలా మాట్లాడకు మావయ్య ఆ ప్రాపర్టీని మీ దగ్గరే ఉంచుకోండి అని అంటుంది తులసి.