MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: గృహలక్ష్మిపై నిందలు.. ఇల్లు వదిలి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్న తులసి?

Intinti Gruhalakshmi: గృహలక్ష్మిపై నిందలు.. ఇల్లు వదిలి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్న తులసి?

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు అక్టోబర్ 28వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Oct 28 2022, 10:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. తులసి ఇంట్లో వాళ్లతో, ఆ వీడియో చివర్లో సామ్రాట్ గారు పడిపోతారు అది ఆ వీడియోలో ఉంటుంది అది కూడా చూడండి అని అనగా, తను పడిపోవడం కాదు నువ్వు అతని కౌగిలిలో పడిపోయావు కదా ఆ విషయం గురించి మాట్లాడదామా ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యుండి ఏమి చేస్తున్నావు నీకు అసలు సిగ్గుగా అనిపించడం లేదా అసలు వాళ్ళ తల్లిగా నువ్వు అర్హత కోల్పోయావు అని నందు అంటాడు. దానికి తులసి మిస్టర్ నందగోపాల్ అని గట్టిగా అరుస్తుంది. ఎందుకు అరుస్తున్నావ్ తులసి? నందు చెప్పింది నిజమే కదా నువ్వు ఇంత దిగజారి పోతావు అనుకోలేదు.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

 నువ్వు ఇంత లా మారిపోతావ్ అనుకోలేదు. నందు ఏం తప్పు మాట్లాడాడు అని నువ్వు ఎలా అరుస్తున్నావు అని అంటుంది అనసూయ. దానికి తులసి, మీరు కూడా నన్ను ఇలా అనుమానిస్తున్నారా అత్తయ్య. నేను మీ ఇంటికి కోడలుగా వచ్చిన ఈ పాతికేళ్లలో ఒక్కసారి అయినా తప్పుగా ప్రవర్తించానా? ఎప్పుడైనా నేను తప్పు చేసే మనిషి లాగా అనిపించాను అని అనగా, అప్పుడు తులసి వేరే ఇప్పుడు తులసి వేరు ఇప్పుడు నువ్వు పూర్తిగా మారిపోయావు నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది అని అంటుంది. అప్పుడు ప్రేమ్, అందరూ ఇన్ని మాటలు అమ్మతో అంటున్నారు.
 

38

 ఎవరికి సిగ్గుగా అనిపించడం లేదా అని అనగా, తప్పేముందిరా నిజమే కదా అని అభి అంటాడు. అరే మన అమ్మను తప్పుపడుతున్నావా అమ్మా అలా చేస్తుంది అని నీకు ఎలా అనిపించింది అని ప్రేమ్ అంటాడు.అప్పుడు అభి కొట్లాటకు దిగుతాడు. అప్పుడు ప్రేమ్, అభి కొట్టుకుంటూ ఉండగా లాస్య నందుతో, వాళ్ళిద్దర్నీ హద్దుల్లో ఉండమని చెప్పు నందు గొడవను ఆపు అని అనగా, వాళ్ళ తల్లే హద్దుల్లో లేదు వాళ్ళే హద్దుల్లో ఉంటారు చీకట్లో చేయి దాటిపోయింది ఇప్పుడు వచ్చి ఏం తప్పు చేయలేనట్టు మాట్లాడుతుంది అని నందు అంటాడు.
 

48

అప్పుడు తులసి, నేను మీకు సంజాయిషీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నిజంగా తప్పు చేసేది అయితే తల దించుకొని ఉంటుంది నేను తల ఎత్తుకొని గర్వంగా ఉన్నాను నేను మళ్ళీ చెప్తున్నాను సామ్రాట్ గారికి నాకు మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే ఎవరు ఏమనుకున్నా సరే ఇంకా మీ ఇష్టం. మీరు ఏమి అనుకుంటారో అది అనుకోండి అని అంటుంది తులసి. ఆ తర్వాత సీన్ లో సామ్రాట్ తన ఇంట్లో కూర్చుని కంగారుగా ఉంటాడు. ఏమైందిరా అని వాళ్ళ బాబాయ్ అడగగా, మామూలుగానే ఇంట్లో వాళ్ళు తులసిని నానా తిప్పలు పెడతారు.
 

58

 ఇప్పుడు బట్టలు మారాయి రావడం ఒక రాత్రి లేట్ అయింది ఇంక అవకాశం దొరికింది కదా అని చెప్పి ప్రతి ఒక్కరు తులసి గారి మీద పడిపోయి ఉంటారు. ఇదే కాదు అనేసరికి ఆ డాన్స్ వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఇప్పుడు వాళ్లు తులసి గారిని ఎన్ని మాటలు అంటూ ఉంటారు అని అనగా, తులసి మొండిది రా తనని తాను కాపాడుకోగలదు అని వాళ్ళ బాబాయ్ అంటాడు. ఎంత మొండి వాళ్ళయినా పులి ఎదురుగుండా వెళ్లి తలపెట్టరు కదా నేనేం చేయలేని పరిస్థితి వచ్చింది అని సామ్రాట్ అంటాడు.
 

68

 అయితే వెళ్లి తులసికి ఫోన్ చెయ్యు ఎలా ఉన్నదో కనుక్కో అని అనగా  ఆ గొడవలు ఇంకా రెచ్చగొట్టినట్టు అవుతుంది బాబాయ్ అని సామ్రాట్ అంటాడు. ఆ తర్వాత సీన్ లో తులసి కోపంగా, మీరు ఎన్ని మాటలు అన్నా సరే నేను ఇంకా ఓర్చుకుంటున్నాను తప్పు నాది అసలు నేను ఇన్ని మాటలు ఎలా పడాల్సి వస్తుందో నేను ఎందుకని మీ చేత మాట అనిపించుకోవాలి అని అంటుంది. తప్పు చేసినోళ్లు ఇలాగే ఉంటారు తులసి నువ్వు తప్పు చేశావు నువ్వు నీ హద్దులు దాటావు స్పష్టంగా తెలుస్తుంది అని అనసూయ అనగా, ఇంక చాలా ఆపండి అత్తయ్య గత పాతికేళ్లలో మీతో ఈ మాట అనిపించుకుంటాను అని నేను అనుకోలేదు.
 

78

ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఇక్కడే ఉంటున్నాను అంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను మీ అందరికీ దూరంగా వెళ్లిపోతాను అని అనగా, ఎంత తెలివిగా ఆలోచిస్తున్నా తులసి. ఇప్పుడు ఇక్కడ నుంచి సామ్రాట్ దగ్గరికి వెళ్ళిపోతావు వెళ్ళడానికి ఒక కారణం కూడా వెతుక్కున్నావు కదా నీలాంటి తెలివైన దాన్ని ఎక్కడా చూడలేదు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు? మమ్మల్ని ఎప్పుడు పిలుస్తున్నారు అని లాస్య అంటుంది. ఇంక నేను ఓర్చుకోలేకపోతున్నాను నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని ఏడుస్తూ తులసి అంటుంది.
 

88

 అప్పుడు దివ్య,  తాతయ్య లేని సమయంలో మీరు అందరూ కలిసి అమ్మని ఒక దాన్ని చూసి బెదిరిస్తున్నారు అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon Glimpse: ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ ఊచకోత.. 4 నిమిషాలు అల్లాడించిన తారక్..
Recommended image2
Darshan Thoogudeepa: ప్రపంచమంతా ఎదురొచ్చినా నిన్ను వదలను.. దర్శన్‌పై ఆయన భార్య ఎమోషనల్ పోస్ట్
Recommended image3
Nara Lokesh as Hero: హీరోగా నారా లోకేష్‌ మిస్‌ చేసుకున్న మూవీ ఏంటో తెలుసా? దెబ్బకి కుర్ర హీరో జాతకమే మారిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved