- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: భర్తకు మొత్తం నిజం చెప్పేసిన లాస్య.. నువ్వు చీటర్ నా వెంటపడద్దు అంటూ నందు వార్నింగ్!
Intinti Gruhalakshmi: భర్తకు మొత్తం నిజం చెప్పేసిన లాస్య.. నువ్వు చీటర్ నా వెంటపడద్దు అంటూ నందు వార్నింగ్!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టు కుంటుంది. ఇక ఈరోజు జులై 4 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... లాస్య భాగ్య కలిసి తులసి చెప్పిన బంగ్లా దగ్గరకు వెళ్తారు.. అయితే ఆ బంగ్లా పూర్తిగా పాడుబడినది. దీంతో అందులో దెయ్యాలు ఉంటాయి అని భయపడుతూ ఉంటారు.. అయిన కూడా రంజిత్ ని పట్టుకోవాలనే ఉద్దేశ్యంతో లోపలికి బయపడుతూనే వెళ్తారు. ఇక ఆలా వచ్చిన ఇద్దరినీ తులసి, దివ్య, అంకిత ముగ్గురు కలిసి బయపెడుతారు.
నిను వీడని నీడని నేను అనే పాట పాడుతూ చుక్కలు చూపిస్తారు. అతర్వాత చాలాసేపు దెయ్యాల్లా భాగ్య, లాస్యను బయపెడుతారు. ఇద్దరు భయపడుతూ వెళ్ళిపోదాం దెయ్యాలు ఉన్నాయని.. ఇక్కడ ఈ రంజిత్ గాడు ఉండడం ఏంటి అని తిట్టుకుంటూ ఉంటారు.. ఫస్ట్ ప్రాణాలు కాపాడుకుందాం బయటకు పోదాం పదా అని తిట్టుకుంటూ వెళ్తుంటే అప్పుడే తులసి వాళ్ళు ఎంట్రీ ఇచ్చి షాక్ ఇస్తారు..
హమ్మయ్యా దెయ్యాలు కాదు తులసి అక్క వాళ్లే అని భాగ్య అంటే.. దెయ్యాల కంటే భయంకరమైన వాళ్ళు అని లాస్య అంటుంది. అతర్వాత భాగ్య మాట్లాడుతూ ఈ ఇల్లు అమ్మకానికి ఉందని పేపర్ లో చూసి వచ్చాము.. మీరు అందుకే వచ్చారా అని తులసిని అడిగితే.. కాదుగా మీరు ఏం చేస్తున్నారో చూద్దాం అని మీ వెనకే ఎప్పటి నుంచి వస్తున్నాం అంటే లాస్య వణికిపోతుంది.
ఇంతకీ కనిపించడా అని అడిగితే.. ఎవరు అంటే.. మీ చెంచాగాడు రంజిత్ అని తులసి చెప్తుంది. రంజిత్ ఎవరు అని భాగ్య అడిగితే లాస్య దగ్గర అతని నెంబర్ కూడా ఉంటుంది అని తులసి అంటే లాస్య వణుకుతూనే భాగ్య పదా వెళదాం అంటుంది. అప్పుడు తులసి మాట్లాడుతూ.. మీ రంజిత్ గాడు మా దగ్గరే ఉన్నాడు.. మీకంటే ముందే మా మనుషులు అతన్ని ఎత్తుకొచ్చారు అని చెబుతుంది.
అంతే లాస్య, భాగ్య ఇద్దరు షాక్ అవుతారు.. వెంటనే తులసి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు సాక్ష్యాలతో సహా పట్టుబడిపోయావ్.. నా డబ్బు తీసుకోని మీ నందుతో బిజినెస్ పెట్టించావ్ అని అంటుంది. హ తులసి అక్క.. లాస్యకు గుడి కట్టే ఆలోచనలో బావ ఉన్నాడు అని భాగ్య చెబుతుంది. నువ్వు చేసిన విషయం చెప్తే గుడి కాదు మీ వివాహ బంధానికి సమాధి కడుతాడు.. నేను నోరు తెరవకూడదు అంటే నా డబ్బు నా అకౌంట్లో ఉండాలని తులసి అంటుంది.
నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు.. నా డబ్బు నా అకౌంట్ లో ఉండాలి అని వార్నింగ్ ఇస్తుంది. ఇక తర్వాత సీన్ లో శృతి ప్రేమ్ కోసం ఎదురు చూస్తుంటుంది. ప్రేమ్ రాగానే సింగింగ్ కాంపిటిషన్ గురించి అతనికి శృతి చెప్తుంది. కానీ ప్రేమ్ మాత్రం బాధగానే ఉంటాడు.. నా మీద నాకే నమ్మకం లేకుండా పోయిందని బాధ పడుతాడు. వాళ్ళ ఆఫీసర్ చేసిన అవమానం గురించి గుర్తుతెచ్చుకుంటే శృతి దైర్యం చెప్తుంది.
మరో సీన్ లో దొరికిపోయిన లాస్య ఇంటికి వచ్చి నందుతో జరిగిన విషయం చెప్తుంది.. నేను చేసింది మంచో చెడో.. నీకోసమే నేను తులసికి దొంగ డాక్యుమెంట్స్ పెట్టించి లోన్ వచ్చేలా చేసి ఆ డబ్బునే నీకు ఇచ్చాను అని మొత్తం నిజాన్ని చెప్తుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి భాగంలో తులసి డబ్బు తులసి అకౌంట్ లో వేసి లాస్యను చీటర్ అంటాడు.. అంతేకాదు ఆమెను తన వెనుక పడద్దు అని వార్నింగ్ కూడా ఇస్తాడు.. మరి ముందు ముందు ఏం జరగనుందో చూడాలి..