- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: నందు ముందు తానేంటో నిరూపించుకున్న తులసి.. అభిని అవమానించిన అంకిత!
Intinti Gruhalakshmi: నందు ముందు తానేంటో నిరూపించుకున్న తులసి.. అభిని అవమానించిన అంకిత!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు మే 14 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే తులసి (Tulasi) ని ప్రవళిక జానకి (Janaki) అనే ఆవిడ దగ్గరికి తీసుకొని వెళుతుంది. ఆమెది ఎంతో పెద్ద వయసు అయినప్పటికీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కార్ లో ట్రిప్ కి వెళ్లడానికి స్టార్ట్ అవుతుంది. అది గమనించిన తులసి ఎంతో ఆశ్చర్యపోతుంది.
ఆ క్రమంలోనే జానకి (Janaki) అనే ఆమె జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొందో వివరిస్తుంది. అంతేకాకుండా ఆమె కాశ్మీర్ ట్రిప్ కు వెళ్లడం ఆమె డ్రీమ్ అని పేర్కొంటుంది. అంతేకాకుండా 80 ఏళ్ల జానకమ్మ కి ఉన్న సంకల్పం నీకెందుకు ఉండకూడదు అని తులసి (Tulasi) ను అంటుంది. అదే క్రమంలో ప్రవళిక ఇక నేను వెళుతున్నాను అని అంటుంది.
ఇక నేను నిన్ను కలవక పోవచ్చు అని ప్రవళిక (Pravalika) అంటుంది. దానితో ఇద్దరు ఎమోషనల్ గా ఒకరికి ఒకరు హాగ్ చేసుకుంటారు. మరోవైపు శృతి వాళ్ళ అమ్మగారి కూతురిని ఎత్తుకొని.. వాళ్ళ అమ్మగారితో మెడికల్ షాప్ కి వెళుతుంది. ఈలోపు అక్కడకు ప్రేమ్ (Prem) కూడా వస్తాడు. కానీ శృతి తనను చూడకుండా కవర్ చేసుకుంటుంది.
మరోవైపు అభి (Abhi) అంకితకు ఒక సారీ కొనుక్కొని వస్తాడు. అంతే కాకుండా సెలక్షన్ కూడా నాదే అని అంటాడు. దాంతో అంకిత (Ankitha) సెలక్షన్ నీదే కానీ డబ్బు ఎవరిదీ అని దెప్పిపొడుస్తుంది. అంతే కాకుండా అభి కి అర్ధమయ్యేలా అంకిత అనేక రకాల మాటలు చెప్పి బుద్ది చెప్పడానికి ట్రై చేస్తుంది.
ఆ తరువాత తులసి (Tulasi) బియ్యం బస్తా ను ఇంటిలోపలకి తీసుకొని వెళ్లలేక పోతుంది. అది గమనించిన లాస్య దంపతులు మగతోడు అవసరం లేనందుకు దెప్పి పొడుస్తారు. దానితో అనసూయ (Anasuya) నువ్వు మా కొడుకు అనిపించుకోడానికి మాకు సిగ్గుగా ఉంది అని దెప్పి పొడుస్తారు.
ఇక తరువాయి భాగం లో దివ్య (Divya) కాలేజ్ ఫీ కట్టడానికి ఇదే లాస్ట్ డేట్ అని నందుకి తెలుస్తుంది. దాంతో నందు (Nandu) నేను కాలేజీ ఫీజు కడతాను అని కాలేజీ ప్రిన్సిపాల్ కి చెబుతాడు. ఇక లాస్య తులసిని నా కూతురు కాలేజీ కట్టలేనని ఒప్పుకోమను అప్పుడు ఫీజ్ కడదాం అన్నట్లు మాట్లాడుతుంది.