- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: అంకితకు రూ.50 కోట్ల ఆస్తిని ఇచ్చిన తల్లితండ్రులు.. కన్నింగ్ ప్లాన్ వేసిన లాస్య!
Intinti Gruhalakshmi: అంకితకు రూ.50 కోట్ల ఆస్తిని ఇచ్చిన తల్లితండ్రులు.. కన్నింగ్ ప్లాన్ వేసిన లాస్య!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 24 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే దివ్య, తులసి (Tulasi) సంగీత పాఠశాల బోర్డు తగిలిస్తారు. ఇక సంగీతం నేర్చుకోవాలని ఆలోచన ఉన్న పిల్లలను ఇటు పంపరా అని అనసూయ నందు (Nandu) తో చెబుతుంది. ఊరికే కాదులే కమిషన్ ఇస్తామని ఎగతాళి చేస్తోంది. ఆ తరువాత తులసి అభికి ఫోన్ చేస్తుంది.
ఇక అభి (Abhi) మాట్లాడటం ఇష్టంలేక నేను వాష్ రూమ్ లో ఉన్నాను అన్నట్లు అంకిత తో తన తల్లికి అబద్ధం చెప్పి ఇస్తాడు. ఇక ఈ లోపు అంకిత (Ankitha) వాళ్ళ మమ్మీ వచ్చి రేపు మీ డాడీ యు ఎస్ నుంచి వస్తున్నారు. రేపు గుడిలో ఏదో గుడ్ న్యూస్ చెబుతారంట అని అంటుంది. దాంతో అంకిత ఎంతో ఆనంద పడుతుంది.
ఆ తర్వాత దివ్య (Divya) సంగీతం నేర్పుతున్న తులసి (Tulasi) కి ఫోన్ చేసి ప్రిన్సిపాల్ గారు నన్ను అందరిముందు ఫీజు అడుగుతున్నారు అని చెబుతుంది. ఇక తులసి రేపు కచ్చితంగా కట్టేస్తాను అని అంటుంది. ఇక తులసి బాధను అర్థం చేసుకున్న లాస్య ఫ్రెండ్ ఫీజు కట్టడానికి ఇరవై వేలు ఇస్తుంది. దాంతో తులసి ఆమెను ఎంతో మెచ్చుకుంటుంది.
మరోవైపు అంకిత (Ankitha) ఫ్యామిలీ తన తండ్రితో గుళ్లో కలుసుకుంటారు. ఈ క్రమంలో లాస్య (Lasya) తన కొడుకుతో అదే గుడికి వస్తుంది. ఇక అంకిత తండ్రి మనం కోర్టులో గెలిచాం.. 50 కోట్ల ఆస్తి మన కూతురి సొంతం కాబోతుంది అని అంటాడు. అది విన్న లాస్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది.
ఇక కోర్టు ఆర్డర్ ను దేవుడు పాదాల దగ్గర పూజ చేయించి అంకిత తండ్రి అంకిత (Ankitha) చేతిలో పెడతాడు. గాయత్రి (Gayathri) ఈ డబ్బు ను జాగ్రత్తగా కాపాడుకోమని అంకిత కు చెబుతుంది. ఇక వీరి మాటలు దూరం నుంచి లాస్య వింటుంది. ఇక గాయత్రి తులసిని మనసులో పెట్టుకుని డబ్బు విషయంలో జాగ్రత్త చెబుతుంది.
ఇక తరువాయి భాగంలో తులసి (Tulasi) స్కూటీ పంచర్ పడుతుంది. అది గమనించిన ప్రేమ్ (Prem) నేను పంచర్ వేయించుకొని వస్తాను అమ్మ అని అంటాడు. నీకు వేరే పనేం లేదా అని ప్రేమ్ ను పరాయి వాడిని చేసినట్లు తులసి మాట్లాడుతుంది. నిజంగానే నాకు వేరే పని లేదని ప్రేమ్ ఆ స్కూటీని పంచర్ వేయించడానికి తీసుకుని వెళతాడు.