Intinti Gruhalakshmi: ప్రమాదం నుంచి బయటపడిన శృతి.. నందుకి బుద్ధి చెప్పిన తులసి?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు డిసెంబర్ 31వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.
ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారేంటి, భరించాల్సిన అవసరం మీకేంటి అని అనడంతో అసలు నీ అండ చూసుకునే తులసి ఇలా రెచ్చిపోతుంది అని అంటాడు నందు. నిజం మాట్లాడటం రెచ్చిపోవడం కాదు లేనిపోని నిందలు వేసి మీరే తులసి గారిని బాధ పెడుతున్నారు అని అంటాడు సామ్రాట్. సామ్రాట్ గారు గొడవ పెద్ద చేయకండి మీరు ఊరికే ఉండండి అని నందుని కూడా మీరు కూడా సైలెంట్ గా ఉండండి అనడంతో నా వారసుడికి ఏదైనా జరగరానిది జరిగితే నాలాంటి రాక్షసుడే ఉండడు అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు నందు. ఇప్పుడు శృతి కడుపులోని బిడ్డకు ఏం కాకూడదు అని తులసి టెన్షన్ పడుతూ మొక్కుకుంటూ ఉంటుంది.
ఇంతలోనే అంకిత బయటికి రావడంతో అంకిత శృతి బాగానే ఉందా అనడంతో అప్పుడు లాస్య మొదటిసారి తాత కాబోతున్నాడు అందుకే నందుకి చాలా ఎక్సైటింగ్ గా ఉంది అంటుంది. అప్పుడు తులసి అడగడానికి భయంగానే ఉంది శృతి బాగానే ఉందా అని అడుగుతుంది తులసి. ఇంతకుముందు టెస్టులు అని చేసాము రిపోర్ట్స్ రావాలి అనడంతో నీకు రిపోర్ట్స్ లో ఏమొస్తుందనిపిస్తుంది అని అడుగుతుంది తులసి. మరొకవైపు అనసూయ దంపతులు తులసి కి ఫోన్ చేస్తారు. ఇప్పుడు పరందామయ్య తులసి నేను విన్నది నిజమేనా శృతి కింద పడిందా హాస్పిటల్లో ఉందా అనడంతో అవును మామయ్య అని అంటుంది. ప్రమాదం ఏం లేదు కదా అనగా లేదని అనుకుంటున్నాం మామయ్య అని అంటుంది.
అప్పుడు లాస్య చూసావు కదా నందు నీ మాట మీద నమ్మకం లేక మాజీ కోడలికి ఫోన్ చేసి మీ అమ్మ వాళ్లు అడిగి తెలుసుకుంటున్నారు అని అనడంతో ఎందుకు అలా లేనిపోనివి మాట్లాడుతున్నావు అని అంటాడు అభి. శృతికి ఎలా ఉందో తెలుసుకోవడానికి మమ్మీకి ఫోన్ చేశారు అనడంతో అదే ఫోన్ కాల్ నందు చేయొచ్చు కదా కొడుకే కదా అని అంటుంది లాస్య. అప్పుడు చూసావా నందు నేను ఏం మాట్లాడినా అందరూ నన్నే టార్గెట్ చేస్తున్నారు అనడంతో ముందే చిరాకులో ఉన్నాను చిన్న పిల్లల ఆర్గ్యుమెంట్స్ చేయకు అని సీరియస్ అవుతాడు. అప్పుడు అందరూ శృతికి ఏం జరుగుతుందా అని టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలోనే డాక్టర్ అక్కడికి వస్తుంది. శృతికి ప్రమాదం ఏమి లేదు క్షేమంగానే ఉంది అనడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు.
అప్పుడు తులసి శృతి ఐసీయూ లోకి వెళ్ళినప్పుడు నుంచి నాకు ఒక క్షణం ఒక్కొక్క యుగంలా గడిచింది అని అంటుంది. అప్పుడు తులసి బాధపడుతూ మాట్లాడగా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు నందుఅంకిత శృతిని చూడొచ్చు కదా అని లోపలికి వెళ్తుండగా ఒక్క నిమిషం నంది గోపాల్ గారు అంటుంది తులసి. ఇందాక పూనకాలు వచ్చిన వాడిలా నామీద అంతలా వచ్చారు ఇప్పుడేంటి పిల్లిలా తోక ముడుచుకొని పారిపోతున్నారు అని అనగా పారిపోవడం ఏంటి అని అంటాడు నందు. మా ఊర్లో దీన్ని పారిపోవడమే అంటారు సార్ అని అంటుంది తులసి. ఇందాక మీరు అన్న ప్రతి ఒక్క మాట భరించాను ఇప్పుడు ప్రతి ఒక్క మాటకి సమాధానం ఇస్తాను అనడంతో నాకు అంత ఓపిక లేదు అనడంతో విని తీరాల్సిందే అని అంటుంది తులసి.
ప్రతిదీ మీకు అనుకూలంగా అంటే జరగదు సార్ మాకు ఇస్టా ఇష్టాలు ఉంటాయి ఓపిక పట్టంది అని అంటుంది తులసి. అప్పుడు తులసి నందు కి బుద్ధి చెబుతూ ఒక్కొక్క మాటకు సమాధానం చెబుతూ ఉంటుంది. అప్పుడు తులసి మాటలకు నందు రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు ప్రేమ్ హాస్పిటల్ నుంచి శృతి డిశ్చార్జ్ అవ్వగానే నేరుగా నీ దగ్గరికి తీసుకొని వచ్చేస్తాను అనడంతో లాస్య, నందు ఇద్దరు షాక్ అవుతారు. అదెలా కుదురుతుంది అంటే మా అమ్మకు గౌరవం లేని ప్రదేశంలో మేము ఉండము అని అంటాడు ప్రేమ. నీకు గడువు ఇచ్చాను ఆ గడువు పూర్తయ్యలోపు మార్పు రాకపోతే నేను చేసేది ఏమీ లేదు అని అంటుంది తులసి. అప్పుడు లోపలికి వెళ్లి తులసి శృతిని చూసి అందరూ సంతోష పడుతూ ఉంటారు.
తర్వాత తులసి సామ్రాట్ ఇద్దరూ కారులో వెళ్తుండగా అప్పుడు తులసి జరిగిన విషయాలు తలుచుకొని సామ్రాట్ గారు ఒక్కసారి కారు పక్కకు ఆపుతారా అని అంటుంది. అప్పుడు తులసి నీళ్లు తీసుకొని ముఖం కడుక్కుంటుంది. అప్పుడు నందు అన్న మాటలు తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నేను నందగోపాల్ గారి విషయంలో ఒక గడువు పెట్టుకున్నాను ఆ గడువు పూర్తవ్వగానే చేయాల్సింది చేస్తాను అని అంటుంది తులసి. సామ్రాట్ జోకులు వేసి తులసి నవ్వుస్తూ ఉంటారు. అప్పుడు వారిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ టీ తాగుతూ ఉంటారు. అప్పుడు సామ్రాట్ రాబోయే కొత్త ప్రాజెక్టులు మీరే ఇన్చార్జ్ అనడంతో నా మీద చాలా ఆశలు నమ్మకం పెట్టుకుంటున్నారు అనగా అవును నాకు నా మీద కంటే మీ మీదనే ఎక్కువగా నమ్మకముంది అని అంటాడు సామ్రాట్.
మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని అంటుంది తులసి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి అక్కడి నుంచి బయలుదేరుతారు. మరొకవైపు శృతిని తీసుకుని అందరు ఇంటికి వస్తారు. అప్పుడు అనసూయ శృతిని ప్రేమగా పలకరిస్తూ ఉంటుంది. అంకిత నువ్వు ఎప్పుడెప్పుడు ఏం తీసుకోవాలి ఏం తినాలి అన్నది తులసి ఆంటీ ఈ పేపర్ మీద రాసి ఇచ్చింది అని పేపర్ ఇస్తుంది. అప్పుడు నందు నాకు తెలియక అడుగుతాను అంకిత నువ్వు కూడా ఒక డాక్టర్ వే కదా ప్రెగ్నెన్సీ లేడీస్ ఎప్పుడు ఏం తినాలి ఏం చేయాలి అన్నది నీకు తెలియదా అని అంటాడు. ఇప్పుడు అనసూయ మంచి మాటలు ఎవరు చెప్పినా మంచివే అని అంటుంది. తులసి ముగ్గరి పిల్లల్ని కనింది. అందుకే జాగ్రత్తలు చెబుతోంది అనడంతో మీరు కూడా పిల్లలే కన్నారు పెద్ద చేశారు కదా అత్తయ్య ఆ జాగ్రత్తలు మీరు చెప్పలేరా అని అంటుంది.