- Home
- Entertainment
- Intinti gruhalakshmi: నందును సహాయం కోరిన తులసికి ఘోర అవమానం? సామ్రాట్ కు అబద్దాలు చెప్పిన లాస్య!
Intinti gruhalakshmi: నందును సహాయం కోరిన తులసికి ఘోర అవమానం? సామ్రాట్ కు అబద్దాలు చెప్పిన లాస్య!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 3వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..సామ్రాట్ జరిగిన విషయమంతా గుర్తు చేసుకుంటాడు. అదే సమయంలో తులసి కూడా గతాన్ని గుర్తు చేసుకుంటుంది. అప్పుడు సామ్రాట్ తులసి గారికి ఫోన్ చేద్దామా అసలు ఏం జరిగిందో కనుక్కుందామని అంటాడు.అదే సమయంలో తులసి, పోనీ నేనే మాట్లాడదామని మెసేజ్ పెడుతుంది. అప్పుడు సామ్రాట్ కి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ లో తులసి తన వ్యాపార భాగస్వామి వదులుకుంటున్నట్టు మెసేజ్ పెడుతుంది అది చూసిన సామ్రాట్ ఆశ్చర్యపోతాడు.
వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్లి చూశావా బాబాయ్ తులసి ఇప్పుడు వ్యాపార భాగస్వామ్యం వద్దనుకుంటుంది అని అనగా వాళ్ళ బాబాయ్, నువ్వెళ్ళు అడుగురా మనసు మార్చుకుంటుందేమో అని అంటాడు. అప్పుడు తనకేనా ఆత్మ అభిమానం ఉండేది అయినా నాకు అబద్ధం ఎందుకు చెప్పింది, నా దగ్గర నిజంగా దస్తాది అని అనుకోలేదు అని అనగా వాళ్ళ బాబాయ్, చెప్పడానికి తనకంటూ పర్సనల్ విషయాలు ఉంటాయి కదా అయినా తులసి ఒక్కతే తప్పు చేసిందా? నందు కూడా చెప్పలేదు అది నందు తప్పు కూడా అవుతుంది కదా అని వాళ్ళ బాబాయ్ అంటాడు.
అప్పుడు సామ్రాట్, తులసి వేరు బాబాయ్ నేను నందుని దగ్గరగా తీసుకోలేదు కానీ ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నా తులసి గారి ప్రాజెక్ట్ ని ఒప్పుకొని ప్రమోషన్లు కూడా మొదలు పెట్టాను. ఇప్పుడు ఇది వద్దు అనుకుంటే ఎలా అని అంటాడు. ఆ తర్వాత సీన్లో శృతి తన గదిలో బట్టలు వెతుకుతూ ఉండగా తను సూట్ కేసులో బట్టలు మాయమవడం గమనిస్తుంది. నా బట్టలు ఏవి అని దివ్య నీ అడగగా ఇందాక ప్రేమ్ అన్నయ్య నీ బట్టలు తీసుకొని వెళ్లడం చూసాను అని అంటుంది దివ్య. బైటకి వచ్చి చూసేసరికి ప్రేమ్ శృతి బట్టలన్నీ నేలమీద వేసేస్తాడు.
అప్పుడు శృతి వచ్చి ప్రేమ్ ఏం చేస్తున్నావు? ఉతికిన బట్టలని మట్టిలో వేసేస్తున్నావు అని అనగా ప్రేమ్, ఈమధ్య సోషల్ మీడియాలో ఒక ఆర్టికల్ చూసాను బద్దకంగా ఉన్నోళ్లు పనిచేస్తే బద్దకం తగ్గుతుందట అందుకే ఇవన్నీ నీ చేత ఉతికిద్దామని నీళ్లు పోస్తాను ఇప్పుడు అని అంటాడు. ఇప్పుడు నీళ్లు పోయొద్దు ప్రేమ్ ప్లీజ్, నాకు ఉతికే ఓపిక లేదు అని అంటుంది శృతి. కానీ ప్రేమ్ అసలు పట్టించుకోకుండా వాటి మీద నీళ్లు వేసేసి నాకు పాలలో ఉప్పు కలిపినందుకు ఇప్పుడు తిక్క కుదిరిందా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్ లో నందు లాస్యతో ఆనందంగా, మొన్న సామ్రాట్ గారికి నిజం చెప్పినందుకు బాధపడ్డాను కానీ ఇది మన మంచికైంది.
ఇప్పుడు తులసి సామ్రాట్ తో లేకపోతే అక్కడ రాజ్యమంత మనదే,మన ప్రాజెక్టును ఒప్పుకుంటారు అని సంబరపడిపోతుంటారు. అంతలో తులసి అక్కడికి వస్తుంది మీరేంటండి ఇక్కడికి వచ్చారు మీలాంటి మహానుభావులు మా ఇంటికి రావడం ఏంటి అని వాళ్ళు ఏటకారించగ, మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను, సామ్రాట్ గారు నేనే అతనికి నిజం చెప్పలేదు అని అనుకుంటున్నారు. కనుక మీరు ఇప్పుడు వెళ్లి సామ్రాట్ గారికి మీరే నా చేత నిజం చేపించలేదు అని చెప్పండి అని అనగా వాళ్ళు గట్టిగా నవ్వి మీలాంటి గొప్పవారికి మేము సహాయం చేయడమేంటి? మా స్థాయికి అర్హత లేదు అని ఎగతాలు చేస్తారు. తులసి బాధపడుతుంది.నువ్వు ఈ విషయం గురించి ఎత్తితే నేను ఇంకో విషయం గురించి బయట పెట్టాల్సి వస్తుంది.
హనీకి నేను కార్ యాక్సిడెంట్ చేశాను కానీ నువ్వు సామ్రాట్ కి చెప్పలేదు. ఈ విషయం చెప్తే ఏం జరుగుతుందని నీకు తెలుసు కదా అని బెదిరిస్తాడు నందు.అప్పుడు తులసి, మీకెందుకు నామీద అంత పగ, నా బతుకు నేను బతుకుతున్నాను అన్నా సరే నన్ను ఎందుకు అడ్డుతెస్తున్నారు నేను మీ జీవితంలో ఎలాంటి హాని చేయలేదు కదా! నీకు స్వేచ్ఛనిచ్చాను అయినా నాకు మీరు స్వేచ్ఛని ఇవ్వలేకపోతున్నారు మీరు ఇంక ఈ జీవితంలో మారరు చీ అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నందు లాస్యలు ఆనందపడతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!