- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: ఆనంద నిలయం నుంచి వచ్చేసిన తులసి కుటుంబం.. విషయం తెలుసుకున్న ప్రేమ్ కన్నీరుమున్నీరు!
Intinti Gruhalakshmi: ఆనంద నిలయం నుంచి వచ్చేసిన తులసి కుటుంబం.. విషయం తెలుసుకున్న ప్రేమ్ కన్నీరుమున్నీరు!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కాగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇంట్లో ఒక మూలన దివ్య (Divya) కూర్చుని ఫ్యామిలీ ఫోటో చూసుకుంటూ ఏడుస్తుంది. ఈ లోపు అక్కడికి తులసి (Tulasi) వస్తుంది. దాంతో దివ్య రేపటి నుంచి మన జీవితం నిప్పుల మీద నడకలా ఉంటుంది. ఎన్నో కష్టాలు మనస్పర్ధలు రావచ్చు ఈ ఫోటోలో మరిన్ని తీసివేతలు రాకుండా చూస్తా అని నాకు మాటివ్వు అని వాళ్ళ అమ్మను అడుగుతుంది.
ఆ తర్వాత ఫ్యామిలీ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోని తినకుండా ఆలోచిస్తూ ఉంటారు. అంతే కాకుండా మాకు తినాలని లేదు అని అంటారు. ఇక దివ్య (Divya) మా అందరి బాధ ఇల్లు వదిలి వెళ్ళ వలసి వస్తుందని అని అంటుంది. పరందామయ్యా (Parandamaiah) నువ్వు ఈ ఇంటి గృహ లక్ష్మి అమ్మ అని మెచ్చుకుంటాడు.
ఇక తులసి (Tulasi) ఫ్యామిలీ అందరికి కలిపి నోట్లో గోరుముద్ద లు పెడుతుంది. ఆ సమయంలో ఫ్యామిలీ మొత్తానికి ఆనంద పడాలో బాధపడాలో అర్ధం కాదు. మరోవైపు రాములమ్మ (Ramulamma) ప్రేమ్ దంపతులకు వాళ్ళు ఇల్లు వదిలి వెళ్లే విషయం చెబుతుంది. దానితో ప్రేమ్ నేను అమ్మదగ్గరకు వెళ్ళాలి అని అంటాడు. ఇక శృతి అమ్మ కష్టం తీర్చే లేనప్పుడు పక్కన ఉంటే ఏంటి దూరంగా ఉంటే ఏంటి.. అని ఆపుతుంది.
ఇక మరోవైపు పరందామయ్య (Parandamaiah) దంపతులు ఇల్లు వదిలి వెళున్నందుకు ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇక అది గమనించిన తులసి ఇల్లు ఎప్పటికైనా ఎలా అయినా నేనే కొంటాను అని వాళ్ళ అత్త మామలకు మాట ఇస్తుంది. అంతేకాకుండా శశికళ (Sashi kala) కూడా ఈ విషయం చెబుతాను అని అంటుంది.
అనసూయ (Anasuya) తో సహా ఫ్యామిలీ మొత్తం ఇంటిని వదిలి బయలుదేరుతూ బాధపడుతూ ఉంటారు. దాంతో తులసి ఇలాంటి ఆనందాలు రాలిపోయిన పువ్వులు లాంటివి మనం తెలుసుకుంటే ఇలాంటి ఆనందాలు బోలెడు వస్తాయని తులసి (Tulasi) ధైర్యం చెబుతుంది.
ఇక తులసి (Tulasi) ఫ్యామిలీ అద్దె ఇంట్లో ఉండగా అక్కడకు నందు (Nandhu) వచ్చి నిన్ను గుడ్డిగా నమ్మినందుకు మా అమ్మ నాన్నలని ఈ పిచుక గూట్లో పడేసావు అని అంటాడు. దాంతో తులసి నన్ను అడిగే హక్కు నీకు లేదు అని అంటుంది. ఈలోపు అక్కడకు ప్రేమ్ కూడా వస్తాడు.