MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: సామ్రాట్ ముందు ఉద్యోగి గుట్టు బయటపెట్టిన తులసి.. కొత్త జనరల్ మేనేజర్ గా తులసి!

Intinti Gruhalakshmi: సామ్రాట్ ముందు ఉద్యోగి గుట్టు బయటపెట్టిన తులసి.. కొత్త జనరల్ మేనేజర్ గా తులసి!

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 23వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం... 

4 Min read
Author : Navya G
Published : Sep 23 2022, 11:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... ఏదో ఫోన్ వస్తుందని సామ్రాట్ మేనేజర్ రావు, బయటకు వెళ్తాడు. అప్పుడు లాస్య, నేను నందు ఆలోచించుకొని మీ ఇంటి దగ్గర ఒక ఇల్లు తీసుకోవాలి అనుకుంటున్నాము సార్, లక్కీ, హని దగ్గరగా ఉంటారు కదా అప్పుడు అని అనగా సామ్రాట్, ఈ ఆలోచన బానే ఉన్నది కానీ ఆఫీస్ కి దూరం అవుతుందేమో అని అంటాడు. ఏం పర్లేదు సామ్రాట్ గారు మేము చూసుకుంటామని లాస్య అంటుంది. అదే సమయంలో తులసికి ఏదో ఫోన్ వచ్చిందని బయటకు వెళ్తుంది.
 

28

అప్పుడు రావు ఎవరితోనో మాట్లాడుతూ, సామ్రాట్ గారికి నేనంటే నమ్మకం ఆస్తి పేపర్లు ఇచ్చిన కళ్ళు మూసుకొని సంతకం పెట్టమన్నా పెడతారు.ఎలాగైనా మీ పని అయ్యేలా నేను చూస్తాను అని అంటారు. ఈ మాటలన్నీ తులసి వింటుంది. అంతా వినేసావ, ఏం చెప్పుకుంటావో చెప్పుకో నేనేం భయపడను ఈ విషయం సామ్రాట్ గారికి తెలిస్తే తర్వాత నీ ప్రాణానికే ప్రమాదం నాకున్న సర్కిల్ నీకు తెలియదు అని అనగా, నీ మాటల్లో భయం కూడా కనిపించట్లేదు తప్పు చేస్తున్నట్టు అని తులసి అంటుంది. మొదటిసారి దొంగతనం చేసేవాడికి భయం కానీ ప్రతిరోజు చేసే వాడికి భయం ఎందుకు? ఏం చేసుకుంటావో చేసుకోపో అని వెళ్ళిపోతాడు రావు. దాని తర్వాత ఆ ఫైల్స్ నే సామ్రాట్  కి ఇస్తున్నప్పుడు తులసి ఆపుతుంది  ఇది మీకు సంబంధించిన ఫైల్ కాదు తులసి గారు ఆగండి అని సామ్రాట్ అనగా,ఆగండి సామ్రాట్ గారు అని రావు ఫోన్ తీసుకొని అందులోని రికార్డింగ్ ఓపెన్ చేసి అదంతా వినిపిస్తుంది తులసి. 

38

అప్పుడు సామ్రాట్ కోపంతో ఎంత నమ్మను రా నిన్ను. నాకే నమ్మకద్రోహం చేస్తావా అని తిట్టి పోలీసులకు ఫోన్ చేయండి అని అంటాడు. అప్పుడు రావు భయపడతాడు అప్పుడు తులసి, ఇందాక చెప్పావు కదా సామ్రాట్ గారికి నిజం చెప్తే నన్ను చంపేస్తానని నిజం చెప్పాను, చంపే అని అనగా, మేడం ప్లీజ్ మేడం నన్ను క్షమించండి మేడం. పోలీసులు వద్దు అని చెప్పండి మేడం మా కూతురు పెళ్లి ఆగిపోద్ది అని అంటాడు. అప్పుడు లాస్య, రామయ్య దగ్గర్నుంచి కాపాడమని సీతమ్మని వేడుకుంటున్నట్టు వీళ్ళు చూడు ఎలా నటిస్తున్నారని నందుతో అంటుంది. అప్పుడు తులసి, వీడు చేసిన పాపానికి కూతుర్ని బలి చేయడం ఎందుకు పాపం పెళ్లి జరగలేదని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు వీడిని వదిలేయండి అని అనగా,తులసి గారు చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాను జీవితంలో నాకు ఇంకెప్పుడూ కనబడదు వెళ్లిపోని వాడిని పంపించేస్తాడు సామ్రాట్.అప్పుడు నందు లాస్యలు, మరి ఇప్పటికిప్పుడు మేనేజర్ వెళ్ళిపోతే మరి ఆ స్థానంలో ఇంక ఎవరు  ఉంటారు.
 

48

ఇప్పుడు మీ పనులకు మేనేజర్ అవసరం కదా అని అనగా దాని గురించి ఆలోచిద్దాము మంచి నమ్మకమున్న వాళ్ళు పెట్టుకుందామని అంటాడు సామ్రాట్.అప్పుడు లాస్య, మీ చుట్టూరా నమ్మకం గా ఉన్నోళ్లు చాలామంది ఉంటారు కదా అని అంటుంది.మనసులో,నందు అయితే బాగుంటుంది ఖచ్చితంగా నందు కే ఆ పొజిషన్ వస్తుంది అని అనుకుంటుంది.అప్పుడు సామ్రాట్ వాల్ల బాబాయి, ఇప్పుడు అప్పుడే నిర్ణయం తీసుకోవడం ఎందుకు, కొంచెం సమయం తీసుకుని చెప్పు అనగా లాస్య, సామ్రాట్ గారు వెంటనే నిర్ణయాలు తీసుకున్న సరే అందులో తప్పు ఉండదు. మంచి నిర్ణయం తీసుకుంటారు అని అంటుంది. సామ్రాట్ కొంచెంసేపు ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను అది ఇక్కడ కాదు అందరి ముందు చెప్తాను అని అందరి దగ్గరికి వెళ్లి, అందరూ ఆటను ఆపండి నేను చెప్పే విషయం వింటే మీరు ఇంకా సంబరపడిపోతారు అని అంటాడు. 

58

విషయం ఏంటి అని వాళ్ళు ఆసక్తిగా అడగగా నేను జనరల్ మేనేజర్ పోస్ట్ ని ఒకల్ని ఎంచుకున్నాను వాళ్ళు చాలా నమ్మకమైన వాళ్ళు. నందగోపాల్ గారు మీరు పక్కకు వచ్చి నిలబడండి అని అనగా లాస్య నందుని చేస్తారు అని ఆశపడుతుంది కానీ సామ్రాట్ తులసి పేరు చెప్తాడు. లాస్య,నందులు ఆశ్చర్యపోతారు. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్, మంచి నిర్ణయం తీసుకున్నావు రా అని అనగా తులసి,మీరు కూడా ఊరుకోండి బాబాయ్  ఆయన జోకులు వేస్తున్నారు మీకు అర్థం కావడం లేదు. చదువురాని నా చేత అంత పెద్ద పని చేయించడం ఎందుకు అని అంటుంది.అప్పుడు లాస్య, నిజం చెప్పావు తులసి, నీ అర్హత ఏంటో తెలుసుకున్నావు అది నీకు సరిపడే ఉద్యోగం కాదు అని అంటుంది. అప్పుడు సామ్రాట్, మీ గురించి మీరు తక్కువ చేసుకోవడం మంచిది కాదు తులసి గారు. మీ గురించి నాకు తెలుసు మీరు ఏమైనా పని నేర్చుకుంటే చేయగలరు అని అంటాడు.

68


 అప్పుడు అభి మాత్రం,అయినా మా అమ్మని ఎందుకు ఉద్యోగానికి వెళ్ళమంటున్నారు? మా అమ్మకి ఏ అర్హత ఉందని? మీ చుట్టూ నమ్మకమైన వాళ్ళు కావాలంటే ఇంకా ఎవరూ లేరా మా డాడ్ ఉన్నారు కదా! అమ్మ కన్నా చాలా తెలివైన వారు అన్ని పనులు జాగ్రత్తగా చూసుకుంటారు ఆయనకు లేని అర్హత మా అమ్మకు ఉన్నదా కనీసం ఒక బట్టల కొట్టు బిజినెస్ ని కూడా సరిగ్గా చూసుకోలేక పోయింది. అలాంటిది కోట్లు కోట్లు టర్నోవర్ అయ్యే బిజినెస్ లో భాగం అంటే మాటలా! అదేదో నందగోపాల్ గారికి ఇవ్వచ్చు కదా అని అనగా తులసి చాలా బాధపడుతుంది. అప్పుడు సామ్రాట్, మీరు అలాగే ఎందుకు అనుకుంటున్నారు. మీకు అవకాశం రావడం చాలా గొప్ప విషయం ఇప్పుడు అన్ని అర్హతలు ఉన్నా నా పాత మేనేజర్ తప్పు చేశాడు. 

78

ఇప్పుడు నాకు కావలసిన వ్యక్తి అర్హతలు ఉన్న వ్యక్తి కాదు నమ్మకం ఉన్న వ్యక్తి. ఇంక నందగోపాల్ దగ్గరికి వస్తే నందగోపాల్ గురించి నాకు ఎక్కువ తెలుసుకొనే అవకాశం రాలేదు. అలాగని అతను చెప్పిన ప్రతి విషయంలోనే నాకు పూర్తి సంతృప్తి లేదు. తులసి గారి విషయంలో నాకు పూర్తి నమ్మకం ఉన్నది ఆవిడ ఎటువంటి పొరపాటు చేయదు.మీకు అవకాశం ఇస్తున్నాను తులసి గారు ఇంక మీ ఇష్టం అని సామ్రాట్ అనగా, పరంధామయ్య సామ్రాట్ తో, మీరు భయపడొద్దు బాబు తులసి ఒప్పుకుంటుంది నేను చెప్తున్నాను కదా అని అంటాడు. అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా నాకు ఇష్టమే, మేము ఒప్పుకుంటున్నాము అని అంటారు.అప్పుడు తులసి సరే మీరందరూ ఒప్పుకుంటున్నారు కనుక నేను ఒప్పుకుంటాను అని అంటుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ చాలా ఆనందపడతార. కానీ నందు, లాస్య, అభి ముకాలు మాడిపోతాయి. అప్పుడు హనీ వెళ్లి నాకు పాయసం చేయండి అని అడుగుతుంది.


 

88

 ఇంట్లో వాళ్ళందరూ ఆనందంతో ఉంటారు. కానీ నందు లాస్యలు ఇంటి బయటకు వచ్చేస్తారు.అప్పుడు లాస్య నందుతో, చూసావా తులసి దశావతారం లాగా ఎన్ని వేషాలు వేస్తుందో ఇప్పుడు కొత్తగా మేనేజర్ వేషం కూడా మొదలుపెట్టింది అని అంటుంది. అప్పుడు నందు, నేను ఇప్పుడే జాబ్ కి రిజైన్ చేస్తున్నాను, ఆవిడ దగ్గర మేడం మేడం తిరగలేను అని అంటాడు. అప్పుడు లాస్య,మనకి ఉద్యోగాలు కావాలంటే మనం ఇలా ఉండక తప్పదు నందు అని అంటుంది. అప్పుడు నందు, నీకు అర్థం కావడం లాస్య నేను తులసి మాజీ భర్తని విషయం దాల్చినందుకు ఆయన నర నరాల లోనూ కోపముంది.ప్రదర్శించుకోవడానికి మంచి సమయం చూపిస్తున్నారు. నేను ఇంక అక్కడ ఉండలేను అని అంటాడు.దానికి లాస్య, ఇప్పుడు మన చేతుల్లో ఏమీ లేదు నందు మనం ఉద్యోగాలు ఉండాలంటే మనం ఓర్చుకోవాల్సిందే, ఇక్కడ కాకపోతే మనం గడ్డి పీకే ఉద్యోగం కూడా చేయలేము కనుక తలదించి మనం పని చేయాల్సిందే అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరంజీవి కి పచ్చి అబద్దం చెప్పిన అల్లు అరవింద్, నెక్ట్స్ ఏం జరిగిందో తెలుసా?
Recommended image2
సాయి పల్లవి 4000 కోట్ల సినిమాలోకి.. హాలీవుడ్ డైరెక్టర్ ఎంట్రీ?
Recommended image3
Vijay: ఎన్నికల ప్రచారానికి గంట ప్రయాణం..విజయ్ ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved