MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Balakrishna: చిరంజీవి, బాలకృష్ణతో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోయిన్ ఎవరు? కారణం ఏంటి?

Balakrishna: చిరంజీవి, బాలకృష్ణతో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోయిన్ ఎవరు? కారణం ఏంటి?

సౌత్ ఫిల్మ్ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ఓ హీరోయిన్ వెంకటేష్, నాగార్జు, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు చేసింది. కానీ మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణతో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు కారణం ఏంటో తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 18 2026, 06:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చిరంజీవి, బాలకృష్ణతో నటించలేకపోయిన హీరోయిన్
Image Credit : Asianet News

చిరంజీవి, బాలకృష్ణతో నటించలేకపోయిన హీరోయిన్

టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా వెలుగు వెలిగారు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ. ఈ ఇద్దరు హీరోల సరసన ఎంతో మంది హీరోయిన్లు నటించి మెప్పించారు. అంతే కాదు చిరంజీవి తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లను పనిచయం చేశాడు, బాలకృష్ణ కూడా తన కెరీర్ లో చాలామంది హీరోయిన్లను స్టార్లు గా మార్చాడు. చిరంజీవి, బాలయ్య సరసన రమ్యకృష్ణ, మీన, సౌందర్య, రంభ, రాశి లాంటి స్టార్ హీరోయిన్లు నటించారు. వీరిద్దరితో నటించిన హీరోయిన్లు ప్రస్తుతం యంగ్ హీరోలకు తల్లి పాత్రల్లో నటిస్తున్నారు. అయితే టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో నటించిన ఓ హీరోయిన్ చిరంజీవి, బాలకృష్ణతో మాత్రం నటించలేకపోయింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు ఖుష్బూ సుందర్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చిరంజీవి అక్కగా నటించిన ఖుష్బూ..
Image Credit : instagram / kushboo

చిరంజీవి అక్కగా నటించిన ఖుష్బూ..

సీనియర్ నటి ఖుష్బూ సుందర్ (Kushboo Sundar) కొన్ని వందల సినిమాల్లో నటించారు. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, తెలుగులో హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించింది. లీడ్ యాక్ట్రెస్ గానే కాకుండా పలు కీలక పాత్రలు కూడా పోషించారు. టాలీవుడ్ లో హీరోయిన్ గా మెప్పించిన ఖుష్బూ చిరంజీవి, బాలకృష్ణతో మాత్రం ఒక్క హీరోయిన్ గా ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అందుకు కారణం ఏంటో కూడా ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు.

Related Articles

Related image1
Renu Desai: రేణు దేశాయ్ రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా? అసలు విషయం వెల్లడించిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య
Related image2
Vijay Divorce: విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. త్రిషతో సంబంధంపై సంగీత సంచలన ఆరోపణలు
34
బాలకృష్ణతో ఒక్క మూవీ కూడా చేయలేకపోయిన హీరోయిన్
Image Credit : our own

బాలకృష్ణతో ఒక్క మూవీ కూడా చేయలేకపోయిన హీరోయిన్

చిరంజీవితో హీరోయిన్ గా నటించలేదు కానీ.. ఖుష్బూ సుందర్ చిరంజీవికి సోదరి పాత్రలో నటించింది. ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహించిన స్టాలిన్ సినిమాలో చిరుకు అక్కగా ‘జాన్సీ’ పాత్రలో అలరించింది. ఆతరువాత ఓ రియలెస్టేట్ యాడ్ లో చిరంజీవి భార్యగా కొద్దిసేపు కనిపించింది ఖుష్బూ. అటు బాలకృష్ణతో అయితే ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు.

44
క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ సుందర్
Image Credit : instagram

క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ సుందర్

రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఖుష్బూ సుందర్ మాట్లాడుతూ.. నేను తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. వెంకటేష్ గారి మనవూరి పాండవులు సినిమాతో మంచి పేరు వచ్చింద. ఆతరువాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాను. కానీ చిరంజీవి, బాలకృష్ణతో సినిమాలు చేయలేకపోయాను. ఇక్కడ సినిమాలు చేస్తున్నటైమ్ లోనే తమిళంలో బాగా ఆఫర్లు వచ్చాయి. చెన్నైలో లాక్ అయిపోయాను. బాలకృష్ణతో సినిమా చేయడానికి అవకాశం వచ్చింది. కానీ తమిళంలో ఫుల్ బిజీగా ఉండటంతో తెలుగులో సినిమాలు చేయలేకపోయాను అంతే కానీ.. వారితో సినిమాలు చేయకపోవడానికి వేరే కారణం ఏమీ లేదు'' అని ఖుష్బూ అన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి బాలకృష్ణ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Kriti Sanon Fashion: ధర ఏకంగా రూ.6 లక్షలు.. కృతి సనన్ ధరించే డ్రెస్సులు గురించి తెలిస్తే దిమ్మతిరుగుద్ది
Recommended image2
Bandla Ganesh: రాంచరణ్ పెద్ది కోసం పవన్ కళ్యాణ్ త్యాగం.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్
Recommended image3
Maa Inti Bangaram Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ.. సమంత కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Renu Desai: రేణు దేశాయ్ రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా? అసలు విషయం వెల్లడించిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య
Recommended image2
Vijay Divorce: విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. త్రిషతో సంబంధంపై సంగీత సంచలన ఆరోపణలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved