MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: దివ్యని కిడ్నాప్ చేసిన యువకులు.. టెన్షన్ పడుతున్న తులసి ప్రేమ్?

Intinti Gruhalakshmi: దివ్యని కిడ్నాప్ చేసిన యువకులు.. టెన్షన్ పడుతున్న తులసి ప్రేమ్?

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారంl అవుతున్న ఈ సీరియల్ ఈరోజు జనవరి 21వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Jan 21 2023, 10:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్లో దివ్య రేయ్ మా ఇంటికి పిలుచుకొని వెళ్తున్నారా అనగా ఇంతలోనే పక్కన ఉన్న యువకుడు చీకటి కదా నీకు కనపడనట్లుంది మీ ఇంటికి వెళ్తున్నాము అనడంతో సరే అని అంటుంది దివ్య. మరొకవైపు ఇంట్లో తులసి పార్టీ ఎక్కడైనా అదైనా చెప్పిందా నీకు అనడంతో ముందే జాగ్రత్తతో లొకేషన్ షేర్ చేయించుకున్నాను అనడంతో సరే ఆ లొకేషన్ నాకు షేర్ చెయ్యి ఇప్పుడే నేను వెళ్లి తీసుకొస్తాను అంటాడు ప్రేమ్. అప్పుడు దివ్య ను వెతకడం కోసం నందు తులసి ప్రేమ్ లు బయలుదేరుతారు. మరోవైపు దివ్య రేయ్ ఏంట్రా రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనడంతో ఇప్పుడే ఇంటికి వెళ్లి ఏం చేస్తావ్ దివ్య సరదాగా బయటికి వచ్చావు ముగ్గురు కలిసి ఎంజాయ్ చేద్దాము అనడంతో ఏయ్ మీరేంటో వంకరటింకరగా మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావడం లేదు అంటుంది దివ్య.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

 అప్పుడు దివ్య మీద చేయి వేయగా చెయ్యి తీసి నువ్వు చీట్ కారు ఆపుతారా లేకుంటే గట్టిగా అరిచి గోల పెట్టాలా అని అంటుంది. అప్పుడు దివ్య హెల్ప్ అని గట్టిగా అరవడంతో దివ్య నోరు నొక్కేస్తాడు. అప్పుడు కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఇదంతా తప్పు దివ్య ని వదిలేద్దాం అనగా పిరికి నా కొడకా నువ్వు ముందు కార్ డ్రైవ్ నేను దీన్ని నేను చూసుకుంటాను అని అంటాడు. ఇంతలోనే తులసి ప్రేమ్ కలసి ఆ పార్టీ జరిగిన ప్రదేశానికి వెళ్తారు. ఇందాక పార్టీ జరిగిందా అనడంతో జరిగింది సార్ ఇందాకే అయిపోయింది ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు అనడంతో తులసి ప్రేమ్ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు ప్రేమ్ దివ్య ఫోటో చూపించగా ఈ అమ్మాయి నేను గుర్తు పడతాను మేడం ఇందాక ఈ అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు కార్ లో ఎక్కించుకొని ఇటుగా వెళ్లారు అనడంతో తులసి, ప్రేమ్ షాక్ అవుతారు.
 

36

 ఇంతలోనే నందు అక్కడికి రావడంతో జరిగినంత చెప్పగా నందు కూడా షాక్ అవుతాడు. అప్పుడు దివ్యకి ఏమైనా అవుతుందేమో అనుకుంటూ తులసి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు నందు ఒక వైపు తులసి, ప్రేమ్ ఒకవైపు దివ్యని వెతకడానికి వెళ్తారు. మరోవైపు దివ్య కారులో హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉండగా నిన్ను ఇంటి దగ్గర దింపేయాలి అంతే కదా రేయ్ దివ్య వాళ్ళ ఇంటి దగ్గరికి పోనీ అని సైగ చేస్తాడు. అప్పుడు దివ్య కు మాయమాటలు చెప్పి దివ్యని నమ్మిస్తూ ఉంటాడు. మరొకవైపు ప్రేమ్ దివ్య కోసం వెతుకుతూ ఉంటాడు.  మరోవైపు అనసూయ ఏడుస్తూ ఉండగా పరంధామయ్య ఓదారుస్తూ ఉంటాడు. ఇంతమంది కాల్ చేసిన రెస్పాండ్ అవ్వలేదు అందుకే భయంగా ఉంది అనడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు.
 

46

అప్పుడు అడ్రస్ దొరకాలి కదా శృతి అనడంతో నువ్వు మాట్లాడకు నీ ముఖం చూస్తేనే అసహ్యంగా ఉంది అంటుంది అనసూయ. నేనేం చేశాను అందరూ నా మీద పడి ఆడిపోసుకుంటున్నారు అనగా నీ సలహా ఇవ్వబట్టే కదా దివ్య అబద్ధం చెప్పి పార్టీకి వెళ్ళింది అంటుంది శృతి. అప్పుడు పరంధామయ్య మామీద అరవడం కాదమ్మా దివ్యకు ఏదైనా జరగకూడని జరగాలి అప్పుడు తులసి నేను వదిలిపెట్టదు అనడంతో లాస్య టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోనే లాస్య నందుకు ఫోన్ చేసి దివ్య నీ దగ్గరే ఉంది కదా అదే విషయం మామయ్య అత్తయ్యకు చెప్పు అనడంతో అప్పుడు నందు దివ్య నువ్వు చెప్పిన అడ్రస్ లేదు ఎవరో ఇద్దరు యువకులు దివ్యని కారులో ఎక్కించుకొని వెళ్లారు అనడంతో అందరూ షాక్ అవుతారు.
 

56

అప్పుడు సరే అని నందు ఫోన్ కట్ చేయడంతో అనసూయ ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగింది అని ఏడుస్తూ ఉంటుంది. మరొకవైపు మందు తన ఫ్రెండు పోలీస్ అతనికి ఫోన్ చేసి హెల్ప్ కావాలి అని జరిగింది మొత్తం వివరిస్తాడు. ఆ తర్వాత ప్రేమ్ రోడ్లమీద వెతుకుతూ ఉంటాడు. మరోవైపు దివ్య ని కిడ్నాప్ చేసిన చేసిన ఆ యువకులు ఒక గదిలో బంధించి దివ్యతో తప్పుగా మాట్లాడుతుండగా దివ్య ప్లీజ్ కార్తీక్ నన్నేం చేయకు అని బ్రతిమలాడుతూ ఉంటుంది. చిన్న విషయమే పెద్దగా అరిచి గోల చేయకు కొద్దిసేపు దివ్య అంటూ నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉండగా దివ్య ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు పక్కనే ఉన్న ఇంకొక యువకుడు నిన్ను వదిలేస్తాను దివ్య ఏమనుకోకు నన్ను తప్పుగా అనుకోకు అనడంతో ఇంకొక యువకుడు ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు వదిలేయడానికే మనం ఇదంతా చేసింది అని సీరియస్ అవుతాడు.
 

66

అప్పుడు దివ్య ప్లీజ్ కార్తీక్ నీకు దండం పెడతాను నీ కాళ్లు పట్టుకుంటాను అని బ్రతిమలాడుతూ ఉంటుంది. మరొకవైపు ప్రేమ్ తులసి రోడ్డు మీద దివ్య కోసం వెతుకుతూ టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటారు. శృతి వాళ్ళు ఫోన్ చేయడంతో ఇంకా దివ్య గురించి ఏమీ తెలియలేదు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలో తులసి జిపిఎస్ అనే యాప్ గురించి చెప్పడంతో ప్రేమ్ ఆ జిపిఎస్ యాప్ ద్వారా దివ్య ఉన్న ప్లేస్ కనుక్కొని అక్కడికి వెళ్తారు. మరొకవైపు ఆ యువకులు మందు తాగుతూ దివ్యని ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటారు. దివ్య తప్పించుకోవాలని ప్రయత్నించగా అతడు గట్టిగా పట్టుకుంటాడు. ఇప్పుడు పక్కనే ఉన్న యువకుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము అనడంతో అతనిపై సీరియస్ అవుతాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
DVSK Movie Review: దాన వీర శూర కర్ణ మూవీ రివ్యూ, కృష్ణకు చుక్కలు చూపించిన ఎన్టీఆర్ సినిమా
Recommended image2
Yash New House: బెంగళూరులో యశ్ ఇంద్రభవనం.. లోపల ఎలా ఉందో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Recommended image3
Rashmika Mandanna: తన సక్సెస్ సీక్రెట్ చెప్పిన రష్మిక మందన్నా.. వాళ్లలా చేసి ఉంటే అడ్రస్‌ ఉండేది కాదా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved