- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: ప్రేమ్ ను ఆటో డ్రైవర్ గా చూసేసిన తులసి.. మా పరువు తీయ్యద్దు అంటూ నందు ఫైర్!
Intinti Gruhalakshmi: ప్రేమ్ ను ఆటో డ్రైవర్ గా చూసేసిన తులసి.. మా పరువు తీయ్యద్దు అంటూ నందు ఫైర్!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalaxmi) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ప్రేమ్ (Prem) తనకు ఆటో ఇప్పించినందుకు వాళ్ల ఇంటి ఓనర్ కు ధన్యవాదాలు తెలియ చేస్తాడు.

అంతేకాకుండా తన సొంత మనిషిలా చూసుకుంటున్నందుకు చాలా సంతోష పడతాడు. ఇక ప్రేమ్ (Prem) ఆటో బయటకు తీసుకొని వచ్చి ఉండగా అదే సమయానికి తులసి, అనసుయ (Anasuya) లు ప్రేమ్ ఆటో దగ్గరకు వచ్చి ఆటో ఎక్కుతారు. ఇక ప్రేమ్ మొహానికి ఖర్చీఫ్ కట్టుకొని కవర్ చేస్తారు. ఇక ఆటోలో వెళ్లే క్రమంలో వీళ్ళిద్దరూ ప్రేమ్ విషయంలో కొంత బాధను కూడా వ్యక్తం చేస్తారు.
ఇక ప్రేమ్ కు తులసి (Tulasi) ఆటో చార్జీ ఇస్తుండగా ప్రేమ్ కావాలని డబ్బులు కింద పడేసి వాళ్ళ తల్లి ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇక ప్రేమ్ వెళుతున్న క్రమంలో మొహానికి ఉన్న కర్చీఫ్ ని తీసేసాడు. దాంతో అనసుయ, తులసిలు ప్రేమ్ ను చూసి స్టన్ అవుతారు. ఇక ప్రేమ్ ఇంటికి వెళ్లి తన మొదటి సంపాదన శృతి (Sruthi) కి ఇచ్చి ఎంతో ఆనందపడతాడు.
అంతేకాకుండా ఆటో మొదటి బోనీ కూడా వాళ్ళ అమ్మ చేసినట్టు చెబుతాడు. ఇక ఇంటికి వచ్చిన తులసి (Tulasi) ప్రేమ్ ను ఆ పొజిషన్ లో చూసి ఎంతో బాధపడుతుంది. ఆ తర్వాత తులసి.. దివ్య ఆన్లైన్ క్లాసెస్ కు అటెండ్ అవ్వనందుకు విరుచుకు పడుతుంది. ఆ తర్వాత దివ్య (Divya) నువ్వు కట్టే డబ్బుతో నాకు చదువు కోవాలని లేదు అని తులసికి ముఖం మీద చెబుతుంది.
మరో వైపు నందు, లాస్య (Lasya) లు కారు చెడిపోగా ఆటో కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ఈ లోపు ప్రేమ్ ఆటో వేసుకొని అక్కడకు వస్తాడు. దాంతో లాస్య కాబోయే రాక్ స్టార్ ఆటో నడుపుతున్నాడు అని ప్రేమ్ ను దెప్పి పొడుస్తుంది. ఆ తర్వాత నందు (Nandu) కూడా ముందా ఆటోను పక్కన పడేయ్యి కావాలంటే సహాయం చేస్తా.. నా పరువు పోతుంది అని అంటాడు.
ఇక తర్వాతి భాగంలో తులసి (Tulasi) కి తన కొడుకు మీద ఉన్న ప్రేమను వాళ్ల మావయ్యకు చెబుతుంది. ఇక ఆ మాటలు విన్న దివ్య (Divya) తన తల్లిని అర్థం చేసుకొని కాళ్ళు పట్టుకుంటుంది.