- Home
- Entertainment
- `ఖుషి` మూవీ `సఖి`కి కాపీనే.. ఇదిగో ప్రూప్.. ట్రోల్స్ వెనకాల ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ ?
`ఖుషి` మూవీ `సఖి`కి కాపీనే.. ఇదిగో ప్రూప్.. ట్రోల్స్ వెనకాల ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ ?
విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన `ఖుషి` సినిమాపై ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. ఈ సినిమా `సఖి`కి కాపీ అంటున్నారు. ప్రూప్‌లు చూపిస్తూ మరీ రచ్చ చేస్తున్నారు. దీని వెనకాల పెద్ద స్టార్ హీరో ఫ్యాన్స్ ఉన్నట్టు సమాచారం.

విజయ్ దేవరకొండ, సమంతలు కలిసి నటించిన `ఖుషి` సినిమా బ్లాక్ బస్టర్ రిపోర్ట్ తో దూసుకుపోతుంది. సినిమాకి అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. రివ్యూస్ కూడా పాజిటివ్‌గా ఉన్నాయి. కలెక్షన్లు దుమ్ములేపుంది. మొదటి వీకెండ్(మూడు రోజుల్లో) ఈ సినిమా 70కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లోనే ఈ చిత్రం రూ.15కోట్ల వరకు కలెక్ట్ చేయడం విశేషం. తెలుగు రాష్టాల్లో మంచి స్పందన లభిస్తుంది. మిగిలిన పోటీదారు సినిమాలు లేకపోవడంతో `ఖుషి`కి కలిసొచ్చింది. వంద కోట్ల దిశగా రన్ అవుతుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రంపై ట్రోలర్స్ రచ్చ చేస్తున్నారు. ఈ సినిమాకి మణిరత్నం `సఖి`కి కాపీ అంటున్నారు. సీన్ బై సీన్ చూపిస్తూ రచ్చ చేస్తున్నారు. `సఖి` సినిమాలోని సీన్లని, `ఖుషి`లోని సీన్లని మిక్స్ చేస్తూ సేమ్ టూ సేమ్ అంటున్నారు. మక్కీకి మక్కి కాపీ కొట్టారని రచ్చ చేస్తున్నారు. హీరోయిన్ ని హీరో ఫాలో అయ్యే సీన్లు, ఇరుకుటుంబాలు మాట్లాడుకునే సీన్లు, పెద్దలను ఎదురించి హీరోయిన్ ఇంటి నుంచి వెళ్లిపోవడం, రిజిస్టర్ ఆఫీస్‌లో పెళ్లి చేసుకోవడం, హీరోహీరోయిన్లు రొమాన్స్, గొడవ పడటం, చివరకు రాహుల్ రామకృష్ణ సీన్ కూడా కాపీనే అని ప్రూప్ చూపిస్తున్నారు.
ఇటీవల ఒకప్పటి సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. కానీ ఈ డైరెక్టర్ ఏకంగా ఆ సినిమాని మళ్లీ తీసి రిలీజ్ చేశాడంటూ సెటైర్లు పేలుస్తున్నారు. నెట్టింట రచ్చ చేస్తున్నారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి `ఖుషి` ట్రైలర్ విడుదలైనప్పట్నుంచి ఇది `సఖి`ని తలపిస్తుందనే కామెంట్లు వచ్చాయి. దర్శకుడు శివ నిర్వాణ కూడా స్పందించారు. మణిరత్నం ప్రభావం తనపై ఉందన్నారు.
అదే సమయంలో లవ్ స్టోరీస్ కొంత సేమ్ ఉంటాయని,కానీ ఎలా చెబుతున్నాం, ఏం చెబుతున్నామనేది ముఖ్యమని, ఇందులో ఎవరూ టచ్ చేయని పాయింట్ ని టచ్ చేసినట్టు తెలిపారు. ట్రైలర్‌లో చూపించింది మెయిన్ కాదు, దానికి మించిన అంశాలు చాలా ఉంటాయన్నారు. తెలివిగా సమాధానం చెప్పారు. అలా అని ఆ రూమర్స్ ని ఖండించలేదు, ఒప్పుకోలేదు.
మరోవైపు నిన్న సోమవారం వైజాగ్‌లో `ఖుషి` సక్సెస్ ఈవెంట్ ని నిర్వహించారు. ఇందులో ఫేక్ రివ్యూలు, ముఖ్యంగా యూట్యూబ్ రివ్యూలపై విజయ్ దేవరకొండ స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. కొందరు తనపై, తన సినిమాపై ఎటాక్ చేస్తున్నారని, ఫేక్ బీఎంఎస్ రేటింగ్‌లు, యూట్యూబ్ వీడియోలు, ఊరు, పేరు తెలియని వేల అకౌంట్లు తీసుకుని ఫేక్ రివ్యూలు చెబుతున్నారు. కానీ అవన్నీ దాటుకుని ఇక్కడి వరకు వచ్చారు. ఈ నెంబర్లు(కలెక్షన్లు), మీ ప్రేమ చూస్తుంటే ఆనందంగా ఉందని, ఇదంతా మీ( అభిమానులు) వల్లే అని, మీ ప్రేమ తనకు గట్టిగా తాకుతుందని తెలిపారు విజయ్. ట్రోలర్స్ కి గట్టిగా ఇచ్చిపడేశాడు.
అయితే ఈ ట్రోలర్స్ వెనకాల ఓ పెద్ద స్టార్ హీరో ఫ్యాన్స్ హస్తం ఉందంటున్నారు. వారేకావాలని ఇదంతా చేస్తుందని తెలుస్తుంది. తమ సినిమా పేరుని వాడుకుని ఇంత హిట్‌కొట్టడం పట్ల వాళ్లు రగిలిపోతున్నారట. పైగా విజయ్‌కి వస్తోన్న క్రేజ్‌ని చూసి తట్టుకోలేక తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. కానీ విశేష ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న హీరో ఫ్యాన్స్ ఇలా చేయడం విచారకరం.