- Home
- Entertainment
- మోహన్ బాబుకు ఇష్టమైన కొడుకు ఎవరు? మంచు విష్ణు, మనోజ్ ఆస్తి గొడవల్లో ఆయన ఎవరి వైపు
మోహన్ బాబుకు ఇష్టమైన కొడుకు ఎవరు? మంచు విష్ణు, మనోజ్ ఆస్తి గొడవల్లో ఆయన ఎవరి వైపు
మంచు వారి ఇంటి మంట ఆరినట్టే ఆరి మళ్ళీ రగులుకుంటుంది. రోజుకో కోణం బయటపడుతుంది. ఇంతకీ మోహన్ బాబు మద్దతు ఎవరివైపు. మంచు విష్ణు, మనోజ్ లలో ఆయనకు ఇష్టమైన కొడుకు ఎవరు..?
- FB
- TW
- Linkdin
Follow Us

గత కొంత కాలంగా మంచు వారి ఇంట జరుగుతున్న రచ్చ అందరికి తెలిసిందే. ఇది ఆస్తి కోసం అన్నదమ్ముల ఫైట్ అని ప్రచారం జరుగుతున్నా.. లోపల అలసు మేటర్ ఏముంది అనేదిమాత్రం ఎవరికి తెలియని మిస్టరీగానే మిగిలిపోయింది. మంచు వారి ఫ్యామిలీ ఒకప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది. మోహన్ బాబు కూతురు లక్ష్మితో పాటు. కొడుకులు ఇద్దరు విష్ణు, మనోజ్ లు కలిసి మెలిసి ఉండేవారు. వీరిమధ్య ఎప్పుడు గొడవలు వచ్చినట్టుగా వార్తలేవి బయటకురాలేదు.
ఎక్కడికి వెళ్ళినా కలిసి మెలిసి వెళ్లేవారు. ఫ్యామిలీ అంతా కలిసి సినిమాలు కూడా చేశారు. కొన్ని సినిమాలు కూడా నిర్మించారు. కాని వీరిమధ్య గొడవలు ఉన్నట్టు ఎప్పుడు బయటపడిందంటే.. మనోజ్ రెండో పెళ్ళి నుంచే వీరిమధ్య మనస్పర్ధలు బయటకువచ్చాయి. అంతకుముందు ఎప్పుడు ఇవి స్టార్ట్ అయ్యాయి అనేది తెలియదు. అప్పట్లో మనోజ్ పై విష్ణు అనుచరుల దాడి చేసినప్పటి నుంచి మంచువారి మంటలు బయటకు వచ్చాయి.
ఆస్తుల గురించే ఈ గొడవలు జరగుతున్నట్టు అప్పటి నుంచి ప్రచారం జరిగింది. దానికితోడు మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడం.. అది కూడా పేళ్లై , కొడుకు పుట్టి, విడాకులు అయిన అమ్మాయిని పెళ్ళాడటం వారికి నచ్చలేదని తెలుస్తోంది. అప్పటి నుంచి ఈరచ్చ కొనసాగుతూ.. అది పెద్ద దుమారంగామారింది. అదంతా పక్కన పెడితే.. ఇద్దరు కొడుకుల్లో మోహన్ బాబుకు ఎవరంటే ఇష్టం, ఈ గొడల్లో విష్ణుకు సపోర్ట్ చేస్తున్న మోహన్ బాబుకు చిన్నకొడుకు మనోజ్ అంటే ఇష్టం లేదా..?
Manchu Manoj
మనోజ్ పై దాడి చేయించడం, ఆస్తిల్లోహక్కు లేదు అనడం లాంటివి చూస్తే మనోజ్ పై మోహన్ బాబుకు ఉన్న కోపం వల్ల అలా అంటున్నాడా..? లేక నిజంగానే మనోజ్ అంటే అతనికి ఇష్టం లేదా? మోహన్ బాబు ఈ గొడవలు జరుగుతున్న టైమ్ లో ఓ ఆడియోను రిలీజ్ చేశారు. ఇంట్లో అందరికంటే మనోజ్ నే ఎక్కువగా గారాబం చేశామని, చాలా ముద్దుగా పెంచామని, ఏది అడిగినా కాదనకుండా ఇస్తూ వచ్చామన్నారు. కాని మనోజ్ తాగి ఇంట్లో గోడవలు పడుతున్నాడని, ఏ పనిచేయకుండా తాగుతూనే ఉన్నాడని ఆయన ఆరోపణ.
అంతే కాదు పనివారిపై చేయి చేసుకుంటున్నాడని, ఆస్తి కోసం తనపై దాడి కూడా చేశారన్నారు. ఆస్తి నా ఇష్టం, నా కష్టార్జితం ఎవరికైనా ఇచ్చుకుంటాను. లేదంటా అనాదాశ్రమానికి రాస్తాను అని కూడా మోహన్ బాబు అన్నారు. దీని బట్టి చూస్తే ఆయనకుమనోజ్ అంటే ప్రేమ ఉంది. కాని మనోజ్ చేసే పనుల వల్ల ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది అనిటాక్. కాని మరో వైపు ఈ విషమంలో మంచు విష్ణు హస్తం ఉంది అనేది మనోజ్ వాదన. తన తండ్రి మంచివాడని. కాని విష్ణు ఎప్పుడ పక్కనే ఉంది తండ్రిని ప్రభావితం చేస్తున్నాడని, తన పై ఉన్నవి లేనివి నూరిపోసి.. తనను దూరం పెట్టేలా చేస్తున్నాడన్నది మనోజ్ వాదన.
నిజానికి మంచు విష్ణు, మనోజ్ ఒక తల్లి బిడ్డలు కాదు. మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవికి లక్ష్మి, విష్ణు కలిగారు. ఆతరువాత ఆమె మరణించిన తరువాత విద్యాదేవి చెల్లెలు నిర్మలాదేవిని ఆయన పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి మనోజ్ పుట్టాడు. అయితే చిన్నతనం నుంచి ఆ అలమరికలు లేకుండా హ్యాపీగా ఉన్న ఈ అన్నదమ్ములు ఆస్తి కోసం కొట్టుకుంటున్నారు.
అయితే ఈ విషయంలో ఇద్దరు కొడుకుల్లో మోహన్ బాబు సపోర్ట్ మాత్రం పెద్ద కొడుకు విష్ణుకే ఇస్తున్నారు. అయితే అటు మనోజ్ మాత్రం తన తండ్రి తప్పులేదని.. అతన్ని మాన్యూప్లేట్ చేస్తూ.. తనపై ద్వేశాన్ని నింపుతున్నారని విష్ణును ఉద్దేశించి ఇండైరెక్ట్ గా అంటున్నాడు
. మోహన్ బాబుకు ఇద్దరు కొండుకులంటే ఇష్టమే... కాని ఈ విషయంలో మాత్రం సపోర్ట్ పెద్ద కొడుక్కే. అంతే కాదు మంచు మనోజ్ తన ఇంటిని ఖాళీ చేయాలని మోహన్ బాబు నోటీసులు కూడా ఇచ్చాడు. చిన్న కొడుకుపై కోపంతో ఉన్న మోహన్ బాబు.
అతన్ని ఇంటి నుంచి బయటకు పంపించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి వీరి విషయం ఎంత దూరం వెళ్తుందో చూడాలి. హైదరాబాద్ నుంచి ఈ ఇష్యూ తిరుపతి చేరింది. మరి అక్కడైనా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదా అనేది చూడాలి.