- Home
- Entertainment
- అది చాలా పవర్ ఫుల్, అయినా వద్దని చెప్పిన త్రివిక్రమ్.. బ్రో మూవీ గురించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్
అది చాలా పవర్ ఫుల్, అయినా వద్దని చెప్పిన త్రివిక్రమ్.. బ్రో మూవీ గురించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో తొలిసారి రాబోతున్న చిత్రం బ్రో ది అవతార్. సముద్రఖని దర్శకత్వంలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనతో తెరకెక్కిన ఈ మూవీ జూలై 28 న అంటే నేడు థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఆల్రెడీ ప్రీమియర్స్ మొదలయ్యాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో తొలిసారి రాబోతున్న చిత్రం బ్రో ది అవతార్. సముద్రఖని దర్శకత్వంలో, త్రివిక్రమ్ శ్రీనివాస్ రచనతో తెరకెక్కిన ఈ మూవీ జూలై 28 న అంటే నేడు థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఆల్రెడీ ప్రీమియర్స్ మొదలయ్యాయి. త్రివిక్రమ్, సముద్రఖని కలసి ఈ చిత్రాన్ని ఎలా వర్కౌట్ చేశారు ? పవన్, తేజు కాంబినేషన్ ఎలా సెట్ చేశారు లాంటి ఆసక్తికర అంశాలు ప్రస్తుతం ఫ్యాన్స్ లో చర్చ జరుగుతోంది.
తమిళంలో వినోదయ సీతం చిత్రాన్ని సముద్రఖని నటించి దర్శకత్వం వహించారు. సముద్రఖని పోషించిన దేవుడి పాత్రనే బ్రోలో పవన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో చేయాలనుకుంటున్నట్లు సముద్రఖని త్రివిక్రమ్ కి చెబితే.. ఆయన కథలో చాలా మార్పులు చేశారు. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ సెట్ చేసింది త్రివిక్రమే.
దీనితో పవన్ ఇమేజ్ కి తగ్గట్లుగా చాలా మార్పులు చేయాల్సి వచ్చింది. వరిజినల్ వర్షన్ లో ఈ చిత్ర నిడివి 99 నిముషాలు మాత్రమే. కానీ తెలుగులో బ్రో చిత్రానికి 135 నిమిషాల నిడివి కేటాయించారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా కొన్ని ఎలిమెంట్స్, పాటలు పెట్టడంతో నిడివి పెరిగింది. ఒరిజినల్ వెర్షన్ లో పాటలు లేవు.
యాక్షన్ అంశాలు కూడా లేవు. సముద్రఖని ఎమోషన్స్ మాత్రమే హైలైట్ చేస్తూ అక్కడ విజయం సాధించారు. కానీ తెలుగులో కమర్షియల్ అంశాలు చేర్చారు. ఇది పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి పూర్తి భిన్నమైన చిత్రం. సముద్రఖని ముందుగా ఈ చిత్రానికి 'కాల పురుషుడు' అనే టైటిల్ అనుకున్నారట. టైటిల్ పవర్ ఫుల్ గా ఉంటూ సౌండింగ్ కూడా అదిరిపోయింది.
కానీ త్రివిక్రమ్ ఈ టైటిల్ వద్దని చెప్పారట. ఇది ఎమోషన్స్ బేస్ తో సాగే చిత్రం. ఇలాంటి చిత్రాన్ని అంత పవర్ ఫుల్ టైటిల్ పెడితే రాంగ్ వే లో అంచనాలు పెంచినట్లు అవుతుందని భావించారట. అందుకే సింపుల్ అండ్ స్టైలిష్ గా బ్రో అని పెట్టారు. ఈ మూవీలో తేజు కూడా పవన్ ని బ్రో అని పిలుస్తూ ఉంటాడు. దీనితో ఈ టైటిల్ యాప్ట్ అని భావించారు.
జీవితంలో సెకండ్ ఛాన్స్ ఉండదు.. గడచిన సమయం తిరిగి రాదు. కానీ ఆ కాలమే దిగివచ్చి చనిపోయిన వ్యక్తికి మరో అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో సముద్రఖని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు పవన్, తేజు కలసి నటించడం తో బ్రో మూవీ పై అంచనాలు పెరిగాయి. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా వారియర్, రోహిణి, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు.