ఎవ్వరూ ఊహించని కాంబినేషన్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తమిళ హీరో, ముచ్చటగా మూడోసారి ?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ తో చేయాల్సి ఉంది. పురాణాల నేపథ్యంలో ఒక భారీ పాన్ ఇండియా చిత్రం త్రివిక్రమ్ ప్లాన్ చేశారు.

trivikram srinivas
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్ తో చేయాల్సి ఉంది. పురాణాల నేపథ్యంలో ఒక భారీ పాన్ ఇండియా చిత్రం త్రివిక్రమ్ ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి 500 కోట్లకి పైగా బడ్జెట్ అవసరం అని, అల్లు అర్జున్ సుబ్రమణ్య స్వామి పాత్రలో కనిపిస్తారని వార్తలు వచ్చాయి. కానీ అల్లు అర్జున్ కి మరోవైపు డైరెక్టర్ అట్లీతో కమిట్మెంట్ ఉంది.
అల్లు అర్జున్ ముందుగా అట్లీ చిత్రాన్ని పూర్తి చేయాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకొంతకాలం బన్నీ కోసం ఎదురుచూడగా తప్పదు. దీనితో త్రివిక్రమ్ ఈ గ్యాప్ లో మరో చిత్రం కంప్లీట్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారట. టాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు బిజీగా ఉన్నారు. దీనితో త్రివిక్రమ్ ఒక క్రేజీ తమిళ హీరోతో మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు.. ధనుష్.
Actor Dhanush
ధనుష్ ఇప్పటికే ఇద్దరు తెలుగు దర్శకులతో సినిమాలు చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ చిత్రం.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర చిత్రంలో నటించారు. కుబేర మూవీ త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మరో తెలుగు దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ధనుష్ నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్, ధనుష్ ఇద్దరూ ఈ కాంబినేషన్ విషయంలో ఆసక్తిగా ఉన్నారట. త్వరలో ఈ కాంబినేషన్ గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.