MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 40 ప్లస్ హీరోయిన్ వెంట పడుతున్న రాజమౌళి, పూరి జగన్నాధ్.. ఆమెకి ఎందుకింత క్రేజ్ ?

40 ప్లస్ హీరోయిన్ వెంట పడుతున్న రాజమౌళి, పూరి జగన్నాధ్.. ఆమెకి ఎందుకింత క్రేజ్ ?

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలం హీరోయిన్ గా రాణించడం కష్టం. అందుకే హీరోయిన్లు వీలైనంత త్వరగా అవకాశాలు అందుకోవాలని ప్రయత్నిస్తారు. క్రేజ్ ఉన్నప్పుడే ఎక్కువ చిత్రాలకు సైన్ చేస్తుంటారు.

tirumala AN | Published : Apr 16 2025, 01:05 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Puri Jagannadh, Rajamouli

Puri Jagannadh, Rajamouli

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలం హీరోయిన్ గా రాణించడం కష్టం. అందుకే హీరోయిన్లు వీలైనంత త్వరగా అవకాశాలు అందుకోవాలని ప్రయత్నిస్తారు. క్రేజ్ ఉన్నప్పుడే ఎక్కువ చిత్రాలకు సైన్ చేస్తుంటారు. కొద్దిమంది హీరోయిన్లకు మాత్రమే దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణించే అవకాశం ఉంటుంది. వారిలో త్రిష గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. రెండు దశాబ్దాలుగా త్రిష సౌత్ లో తిరుగులేని స్టార్ గా రాణిస్తోంది. 

24
Asianet Image

ప్రస్తుతం త్రిష వయసు 41 ఏళ్ళు. ఆమె ఏజ్ పెరిగే కొద్దీ క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికీ ఆమెకి దళపతి విజయ్, అజిత్ లాంటి అగ్ర హీరోలతో నటించే ఛాన్సులు దక్కుతున్నాయి. తెలుగులో ప్రస్తుతం త్రిష మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం సౌత్ లో 40 ప్లస్ హీరోయిన్లలో త్రిషకి వస్తున్న క్రేజీ ఆఫర్స్ ఇంకెవరికీ రావడం లేదు. 

34
Trisha Krishnan

Trisha Krishnan

త్రిష గురించి మరో క్రేజీ రూమర్ వైరల్ గా మారింది. రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న SSMB 29 చిత్రంలో త్రిషకి ఛాన్స్ వచ్చిందట. ఒక కీలక పాత్ర కోసం రాజమౌళి త్రిషని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. మహేష్, త్రిష గతంలో అతడు, సైనికుడు చిత్రాల్లో నటించారు. మహేష్, రాజమౌళి చిత్రంలో ఆల్రెడీ హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఎంపికయ్యారు. 

44
actress trisha krishnan

actress trisha krishnan

అదే విధంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కూడా త్రిష వెంట పడుతున్నట్లు టాక్. పూరి, విజయ్ సేతుపతి కాంబినేషన్ చిత్రానికి ప్రకటన వచ్చింది. ఈ మూవీలో టబు హీరోయిన్ గా ఫైనల్ అయింది. మరో ఇంపార్టెంట్ రోల్ కోసం త్రిషని పూరి జగన్నాధ్ సంప్రదిస్తున్నారట. మరి త్రిష ఈ రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి. ఈ ఏజ్ లో త్రిష క్రేజ్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. త్రిష అన్ని రకాల చిత్రాలు చేస్తూ ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందారు. అందుకే ఆమె దర్శకులకు ఫస్ట్ ఛాయిస్ గా మారుతున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

Also Read: అలీని చులకనగా చూసిన ఆ హీరోయిన్ పరిస్థితి ఇదే.. మేనేజర్ వల్ల సౌందర్య తప్పుడు నిర్ణయం, ఏం జరిగిందంటే

tirumala AN
About the Author
tirumala AN
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది. Read More...
త్రిష
తెలుగు సినిమా
ఎస్.ఎస్. రాజమౌళి
మహేష్ బాబు ఘట్టమనేని
 
Recommended Stories
Top Stories