- Home
- Entertainment
- అలీని చులకనగా చూసిన ఆ హీరోయిన్ పరిస్థితి ఇదే.. మేనేజర్ వల్ల సౌందర్య తప్పుడు నిర్ణయం, ఏం జరిగిందంటే
అలీని చులకనగా చూసిన ఆ హీరోయిన్ పరిస్థితి ఇదే.. మేనేజర్ వల్ల సౌందర్య తప్పుడు నిర్ణయం, ఏం జరిగిందంటే
తనని రిజెక్ట్ చేసినప్పటికీ సౌందర్య గొప్ప హీరోయిన్ అని అలీ అంటున్నారు. తనతో సూపర్ హిట్ చిత్రంలో నటించిన మరో హీరోయిన్ గర్వం ప్రదర్శించింది అని అందువల్ల ఆమె కెరీర్ పతనం అయింది అని అలీ తెలిపారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Comedian Ali, Soundarya
కమెడియన్ అలీ 52 చిత్రాల్లో హీరోగా నటించారు. అలీ కెరీర్ లో సూపర్ హిట్ చిత్రాలు చాలా ఉన్నాయి. యమలీల లాంటి బిగ్గెస్ట్ హిట్ అలీ సొంతం. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో అలీ, ఇంద్రజ కలసి నటించిన యమలీల చిత్రం అనేక రికార్డులు సృష్టించింది. అంత పెద్ద సక్సెస్ దొరికినప్పటికీ అలీ కమెడియన్ గా నటించడం ఆపలేదు. కమెడియన్ గా రాణిస్తూనే అవకాశం వచ్చినప్పుడు హీరోగా చేశారు.
ఒక కమెడియన్ పక్కన నటించడం కంటే పెద్ద హీరోతో నటించడానికే హీరోయిన్లు ఇష్టపడతారు. అప్పట్లో తనని చాలా మంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారని అలీ తెలిపారు. నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్లు కూడా రిజెక్ట్ చేశారు. ముందుగా ఓకె చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళ మేనేజర్ లు మధ్యలో దూరి.. అలీ కమెడియన్ మాత్రమే.. పెద్ద హీరో కాదు అని చెప్పేవారు. అందుకే చాలా మంది నాతో నటించడానికి ఇష్టపడలేదు.
సౌందర్యతో ఆసక్తికర సంఘటన జరిగింది. యమలీల చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించాల్సింది. ముందుగా సౌందర్య ఓకె చెప్పేసింది. కానీ అదే సమయంలో ఆమెకి నాగార్జున, బాలయ్య చిత్రాల్లో నటించే ఛాన్స్ వచ్చింది. దీంతో ఆమె మేనేజర్.. మేడమ్ ఇప్పుడు కమెడియన్ తో సినిమా చేస్తే ఆ ఎఫెక్ట్ మీ కెరీర్ పై పడుతుంది అని చెప్పాడు. మేనేజర్ వల్ల సౌందర్య యమలీల చిత్రాన్ని రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత ఇంద్రజని హీరోయిన్ గా తీసుకున్నాం. యమలీల సాధించిన విజయం చూసి సౌందర్య రియలైజ్ అయ్యింది.
Soundarya
ఏమాత్రం ఇగోకి పోకుండా వెంటనే ఎస్వీ కృష్ణారెడ్డికి ఫోన్ చేసి సార్.. నెక్స్ట్ మూవీలో నేను అలీ పక్కన నటించడానికి రెడీ అని చెప్పింది. దీనితో ఎస్వీ కృష్ణారెడ్డి శుభలగ్నం చిత్రంలో సౌందర్య, అలీ మధ్య చినుకు చినుకు అందెలతో అనే సాంగ్ ని రిక్రియేట్ చేశారు. సౌందర్యకి ఇగో ఉండదని అందుకే ఆమె అంత గొప్ప హీరోయిన్ అయింది అని అలీ అన్నారు.
Indraja
కానీ ఇంద్రజ అలా కాదు అంటూ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యమలీల తర్వాత ఇంద్రజకి నాగార్జున, బాలయ్య, శ్రీకాంత్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చింది. ఆ టైంలో నేను, ఇంద్రజ మరోసారి కలసి నటించాల్సింది. ఆ చిత్రం కోసం ఇంద్రజని అడిగితే నాకు ఇప్పుడు పెద్ద హీరోలతో ఆఫర్స్ వస్తున్నాయి, అలీతో నటించడం కుదరదు అంటూ చులకనగా చూసింది. ఆ తర్వాత తక్కువ టైంలోనే ఇంద్రజ కెరీర్ పతనం అయింది అంటూ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.