#Trisha: 'పట్టుదల' రెస్పాన్స్ పై త్రిష షాకింగ్ కామెంట్
#Trisha: అజిత్ నటించిన 'పట్టుదల' సినిమాపై త్రిష షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూసి వస్తున్న త్రిష తన నటన బాగుందని కొందరు అంటున్నారు అని అనటం జరిగింది. సినిమాలో త్రిష చాలా అందంగా కనిపించింది, అలాగే సెటిల్డ్ నటనతో ఆకట్టుకుంది.

తల అజిత్ (Ajith Kumar) తాజాగా హీరోగా నటించిన యాక్షన్ సినిమా 'విడా ముయర్చి’. తెలుగులో 'పట్టుదల’ (Pattudala Movie) పేరుతో విడుదల చేశారు. త్రిష హీరోయిన్. యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా ప్రధాన పాత్రలు పోషించారు. మగిళ్ తిరుమేని (Magizh Thirumeni) దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.
సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా వాయిదా పడి ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్, యాక్షన్ జానర్‌కు కేరాఫ్ అయిన అజిత్ 'పట్టుదల’ తో విజయం సాధించాడని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ క్రమమంలో ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూసి వస్తున్న త్రిష షాకింగ్ కామెంట్స్ చేసింది.
trisha
త్రిష తాజాగా 'విడా ముయర్చి’ ఫ్యాన్స్ షోకు చెన్నై వెట్రీ థియేటర్ కు వెళ్లారు. సినిమా చూసి అక్కడనుంచి వచ్చేస్తున్నప్పుడు...ఓ అభిమాని గట్టిగా ..త్రిష,నీ యాక్టింగ్ సూపర్ అని కామెంట్ చేసారు. దానికి త్రిష రెస్పాండ్ అవుతూ.. ధాంక్ గాడ్... నా నటన బాగుందని అతను అంటున్నాడు అందామె.
ఇది విన్న వారు షాక్ అవుతున్నారు. త్రిష ఇలా అందేమిటి అంటున్నారు. అయితే త్రిష ఇలా అనటానికి గల కారణం...రీసెంటా ఆమె సినిమాల్లో నటనకు నెగిటివ్ కామెంట్స్, రివ్యూలలో విమర్శలు వచ్చాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే త్రిష...మొత్తానికి నా నటన నచ్చిందని కొందరు అంటున్నారు అని అనటం జరిగింది.
'విడా ముయర్చి’ విషయానికి వస్తే...హాలీవుడ్ స్థాయి స్టైలిష్ మేకింగ్ అంతా బాగానే ఉందని అంటున్నారు. అయితే సామాన్య ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు లేవంటున్నారు. సినిమాలో అసలు కథేంటో చెప్పడానికి క్లైమాక్స్ దాకా టైమ్ తీసుకున్నారు.
ఇంటర్వెల్ దాకా అయితే సినిమాలో ఏమి జరిగినట్లు ఉండదు. ఆ తర్వాతే కథ ముందుకు కదులుతుంది. అక్కడి నుంచి సన్నివేశాలు ట్విస్ట్‌లు ఆకట్టుకుంటాయి. అయితే సినిమాలో త్రిష చాలా అందంగా కనిపించింది. అలాగే సెటిల్డ్ నటనతో చేసుకుంటూ వెళ్లింది. ఇక యాక్షన్ సీక్వెన్సుల్లో అజిత్ ఎక్కడా తగ్గలేదు.