- Home
- Entertainment
- రాజమౌళికి షాకిచ్చిన త్రిష, బ్లాక్ బస్టర్ మూవీ మిస్..ఆ క్రేజీ హీరోతో నటించకూడదని అలా చేసిందా ?
రాజమౌళికి షాకిచ్చిన త్రిష, బ్లాక్ బస్టర్ మూవీ మిస్..ఆ క్రేజీ హీరోతో నటించకూడదని అలా చేసిందా ?
Trisha and Rajamouli: స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని త్రిష ఎందుకు వదులుకుందో తెలుసుకుందాం.

Trisha , Rajamouli:
Trisha and Rajamouli:దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ త్రిష. 40 ఏళ్ళు దాటినా ఇంకా యువతరం హీరోయిన్లతో పోటీ పడుతూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అజిత్ సరసన నటించిన విడాముయర్చి సినిమా ఇటీవల విడుదలైంది. ఏప్రిల్ 10న అజిత్ తో కలిసి నటించిన మరో సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదల కానుంది.
Trisha Movies
మణిరత్నం దర్శకత్వంలో సింబు, కమల్ హాసన్ తో కలిసి నటించిన దక్ లైఫ్ జూన్ లో విడుదల కానుంది. ఆర్.జే.బాలాజీ దర్శకత్వంలో సూర్య 45లోనూ నటిస్తోంది. తెలుగులో విశ్వంభర అనే సినిమా కూడా చేస్తోంది. ఇన్ని సినిమాలు చేస్తున్న త్రిష రాజమౌళి సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకుందంటే నమ్మగలరా?
Trisha
2010లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న సినిమాలో సునీల్ హీరో. సునీల్ సరసన నటించడానికి త్రిష నిరాకరించిందట. అప్పటివరకు సునీల్ కమెడియన్ గానే నటించడం, సునీల్ సరసన నటిస్తే తన కెరీర్ దెబ్బతింటుందని భావించి త్రిష ఆ సినిమాలో నటించలేదట.
Trisha and Rajamouli
త్రిష నో చెప్పడంతో సలోని అశ్వానీని హీరోయిన్ గా తీసుకుని రాజమౌళి ఆ సినిమాని తీశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సునీల్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. తన సినిమాలో నటించడానికి నిరాకరించిన త్రిషను ఆ తర్వాత రాజమౌళి తన సినిమాల్లో తీసుకోలేదు.