కొడుకు చనిపోయాడంటూ త్రిష కన్నీటి పర్యంతం.. పండగపూట ఇంట్లో విషాదంతో బ్రేక్ ప్రకటన
స్టార్ హీరోయిన్ త్రిష ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు మరణించాడు. ఎమోషనల్ అవుతూ షాకింగ్ పోస్ట్ పెట్టింది.
Trisha
స్టార్ హీరోయిన్ త్రిష కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆమె ఇంట్లో పండగపూట విషాదం చోటు చేసుకుంది. తన కొడుకులాంటి వాడు కన్నుమూశాడు. దీంతో త్రిష శోకసంద్రంలో మునిగిపోయింది. క్రిస్మస్ పండగ వేళ తన ఇంట్లో ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం పట్ల ఆమె కన్నీరు మున్నీరు అవుతున్నారు. తన హార్ట్ బ్రేక్ అయినంత పని కావడంతో ఆమె భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది త్రిష.
Trisha
మరి ఇంతకి త్రిష ఇంట్లో చోటు చేసుకున్న విషాదం ఏంటి? ఆమె ఎందుకు కన్నీటి పర్యంతమవుతున్నారు. త్రిష కొడుకు ఎవరు? ఈ కథేంటి అనేది చూస్తే, త్రిషకి ఇంకా పెళ్లి కాలేదు. ఆమె ఏజ్ 41. ఇంకా ఒంటరిగానే ఉంది. దళపతి విజయ్‌తో రహస్య ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే చాలా రోజులుగా త్రిష `జొర్రో` అనే పెంపుడు కుక్కని పెంచుకుంటుంది. దాన్ని తన సొంత కొడుకులా భావిస్తుంటుంది త్రిష. తనకు ఇంట్లో రిలాక్సింగ్ పాయింట్ జొర్రోనే. దానితో ఎంతో అనుబంధాన్ని కొనసాగిస్తుంది.
కానీ సడెన్‌గా ఈ రోజు(బుధవారం) ఉదయం జొర్రో చనిపోయింది. దీంతో ఈ విషాదాన్ని తట్టుకోలేక ఆమె కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ విషయాన్ని త్రిష సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తన బాధని, తన ఇంట్లో పండగపూట చోటు చేసుకున్న విషాదాన్ని వెల్లడించింది. `నా కొడుకు జొర్రో, ఈ క్రిస్మస్ నాడు తెల్లవారుజామున చనిపోయాడు. నా గురించి బాగా తెలిసిన వాళ్లకు, జొర్రో నాకు ఎంత ముఖ్యమైనదో తెలుస్తుంది. నేను, నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాం. కోలుకోవడానికి చాలా రోజులు పడుతుంది. అప్పటి వరకు అందుబాటులో ఉండను` అంటి పోస్ట్ చేసింది త్రిష.
ప్రస్తుతం త్రిష పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి ఆమె అభిమానులు స్పందిస్తూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని అంటున్నారు. స్ట్రాంగ్‌గా ఉండాల్సిన సమయం అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో త్రిష ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది.
ఇక త్రిష హీరోయిన్‌గానూ బిజీగా ఉంది. ఆమె తెలుగులో చిరంజీవితో కలిసి `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత తెలుగులో త్రిష చేస్తున్న సినిమా ఇది. తమిళంలో అజిత్ `విడమూయార్చి`, `గుడ్ బ్యాడ్ అగ్లీ` చిత్రాల్లో నటిస్తుంది. అలాగే సూర్యతో ఓ సినిమా, కమల్ హాసన్‌తో ఓ సినమా చేస్తుంది. ఈ ఏజ్‌లోనూ ఆమె ఫుల్ బిజీగా ఉంది. అదే సమయంలో సీనియర్లకి బెస్ట్ ఛాయిస్‌గా మారింది త్రిష.
read more:2025లో కోలీవుడ్ 1000 కోట్ల కల నెరవేరుతుందా? రాబోయే భారీ సినిమాల జాబితా
also read: జైలు నుంచి బయటకు వచ్చాక అల్లు అర్జున్‌ని కలిశారా? జానీ మాస్టర్ రియాక్షన్ ఇదే