MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mahesh Babu: కృష్ణ నుంచి మహేష్ బాబుకు అబ్బిన అలవాటు, సూపర్ స్టార్ కెరీర్ నిలబెట్టింది అదేనా?

Mahesh Babu: కృష్ణ నుంచి మహేష్ బాబుకు అబ్బిన అలవాటు, సూపర్ స్టార్ కెరీర్ నిలబెట్టింది అదేనా?

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ బాబుకు ఆయన నుంచి అబ్బిన గొప్ప అలవాటు ఏంటో తెలుసా? ఆ అలవాటే మహేష్ బాబును కెరీర్ ను నిలబెట్టిందా? ఇంతకీ విషయం ఏంటంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 14 2026, 10:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సూపర్ స్టార్ వారసుడిగా..
Image Credit : Asianet News

సూపర్ స్టార్ వారసుడిగా..

మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. కృష్ణ ఏడాదికి 15 సినిమాలు రిలీజ్ చేసిన రికార్డ్ ఉంది. కానీ మహేష్ బాబు మాత్రం ఏడాదికి ఒక్క సినిమాతో వచ్చినా.. అభిమానులకు ఫుల్ మీల్స్ ప్లాన్ చేస్తుంటాడు. అయితే మహేష్ బాబుకు కృష్ణ నుంచి వారసత్వంగా సినిమాలే కాదు ఓ అలవాటు కూడావచ్చింది. అదేంటో కాదు జ్ఞాపక శక్తి. ఇది తన కెరీర్ లో ఎంతో స్థాయికి ఎదగడానికి ఉపయోగపడింది. దానికి కారణం కూడా ఒకటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మహేష్ బాబుకి తెలుగు చదవడం రాదా?
Image Credit : Mahesh Babu\Instagram

మహేష్ బాబుకి తెలుగు చదవడం రాదా?

తెలుగు చిత్రసీమలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) డైలాగ్ డెలివరీకి, నాచురల్ యాక్టింగ్‌కి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలో డైలాగ్ చెబుతుంటే అది యాక్టింగ్ లా కాకుండా, ఇంట్లో సహజంగా మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది. అయితే, కోట్ల మంది హృదయాలను ఏలుతున్న ఈ టాలీవుడ్ హీరోకి తెలుగు చదవడం, రాయడం రాదనే విషయం తెలుసా? ఈ ఆసక్తికరమైన విషయాన్ని స్వయంగా మహేష్ బాబే ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.

Related Articles

Related image1
Janhvi Kapoor Home Tour: శ్రీదేవి జ్ఞాపకాలతో జాన్వీ కపూర్ ఇల్లు, 65 కోట్ల ఇంద్ర భవనం చూశారా?
Related image2
Asha Chocolate: 90s కిడ్స్ ఫేవరెట్ ఆశ చాక్లెట్ ఎందుకు ఆగిపోయింది? 10 దేశాల్లో అమ్ముడుపోయిన ఆశ ఎలా మాయమయ్యింది?
34
చెన్నైలో పెరగడం వల్ల
Image Credit : Facebook/@maheshbabu.universe

చెన్నైలో పెరగడం వల్ల

తన చిన్నతనం అంతా చెన్నైలోనే గడిచిందని, అందుకే తనకు తమిళం చదవడం, రాయడం కొద్దిగావచ్చు కానీ తెలుగు రాయడం, చదవడం రాదని మహేష్ బాబు వెల్లడించారు . చిన్నప్పటి నుంచి తెలుగు అక్షరాలు నేర్చుకునే అవకాశం దక్కకపోవడమే దానికి కారణమని ఆయన తెలిపారు. మరి "తెలుగులో మిమ్మల్ని ఎవరైనా తిడుతూ వార్తలు రాస్తే మీకు తెలియదా?" అని యాంకర్ ప్రశ్నించినప్పుడు.. "ఎవరితోనైనా చదివించుకుని తెలుసుకుంటా" అని మహేష్ బాబు నవ్వుతూ సమాధానమిచ్చారు

44
కృష్ణ నుంచి వారసత్వం వచ్చిన అలవాటు
Image Credit : Asianet News

కృష్ణ నుంచి వారసత్వం వచ్చిన అలవాటు

తెలుగు చదవడం రాకపోయినా అంత సుదీర్ఘమైన, క్లిష్టమైన డైలాగ్‌లను మహేష్ బాబు అంత సహజంగా ఎలా చెప్పగలుగుతున్నారు? దానికి సమాధానం ఆయన ఫోటోగ్రాఫిక్ అండ్ గ్రాస్పింగ్ మెమరీతోనే ఇది సాధ్యం అయ్యిందని అన్నారు. తన తండ్రి, సూపర్‌స్టార్ కృష్ణ గారి నుంచి అద్భుతమైన జ్ఞాపకశక్తి వారసత్వంగా తనకు వచ్చిందని.. షూటింగ్ సమయంలో డైరెక్టర్ కానీ, కో-డైరెక్టర్ కానీ డైలాగ్‌లను గట్టిగా చదివి వినిపిస్తారు, అలా వారు చెబుతుంటే విని, ఆ డైలాగ్‌లను వెంటనే దాన్ని మెమరీలో సేవ్ చేసుకుంటానని (Grasp) మహేష్ అన్నారు .భాష చదవడం రాకపోయినా, వినే శక్తి , డైలాగ్ ను గుర్తు పెట్టుకునే అలవాటు, దాన్ని సరికొత్త మోడ్యులేషన్‌తో వెండితెరపై పండించడమే మహేష్ బాబును నిజమైన 'సూపర్ స్టార్'గా నిలబెట్టింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మహేష్ బాబు ఘట్టమనేని
కృష్ణ ఘట్టమనేని
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: బాలకృష్ణకి ఇచ్చిపడేసిన ఎన్టీఆర్, దెబ్బకు ఇంట్లో నుంచి పరుగో పరుగు.. క్రమశిక్షణ తప్పితే అంతే
Recommended image2
korean kanakaraju Day 7 collections: వరుణ్ తేజ్ మూవీకి ఎదురుదెబ్బ, కొరియన్ కనకరాజు వారంలో ఎంత వసూలు చేసింది?
Recommended image3
Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ కు శాపం పెట్టిన ఉప్పల్ బాలు, పిలిచి అవమానిస్తారా అంటూ.. నవదీప్ పై ఫైర్
Related Stories
Recommended image1
Janhvi Kapoor Home Tour: శ్రీదేవి జ్ఞాపకాలతో జాన్వీ కపూర్ ఇల్లు, 65 కోట్ల ఇంద్ర భవనం చూశారా?
Recommended image2
Asha Chocolate: 90s కిడ్స్ ఫేవరెట్ ఆశ చాక్లెట్ ఎందుకు ఆగిపోయింది? 10 దేశాల్లో అమ్ముడుపోయిన ఆశ ఎలా మాయమయ్యింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved