Suriya Scene Collection: సూర్య నటించిన 'సీన్' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సాధించిన కలెక్షన్లు ఎంతో తెలుసా? జిత్తు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?

సూర్య 'సీన్' అరాచకం..

సూర్య హీరోగా, జిత్తు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సీన్' థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సూర్య, నజ్రియా, నెస్లెన్ యాక్టింగ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ అని ఆడియన్స్ చెబుతున్నారు. బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమా దుమ్మురేపుతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 252.45 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

మాస్ యాక్షన్, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ కలగలిపి ఇదొక కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. కేరళలో శ్రీ గోకులం గోపాలన్‌కు చెందిన శ్రీ గోకులం మూవీస్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసింది. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్, ళగరం స్టూడియోస్ బ్యానర్లపై జ్యోతిక, సూర్య ఈ సినిమాను నిర్మించారు. జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరించారు.

సూర్య పవర్ ఫుల్ క్యారెక్టర్ 

ఈ సినిమాలో సూర్య డీఎస్పీ ఇంబరాజ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. సూర్య స్టైలిష్, మాస్ లుక్‌కు థియేటర్లలో విజిల్స్ పడుతున్నాయి. దీనికి తోడు విజువల్స్, సుషిన్ శ్యామ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయి. సూర్య, నెస్లెన్, నజ్రియా నజీమ్‌లతో పాటు ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన 'రోమాంచం', 'ఆవేశం' తర్వాత జిత్తు మాధవన్ డైరెక్ట్ చేస్తున్న తొలి తమిళ సినిమా ఇదే. ఆ సినిమాలతో మలయాళంలో సూపర్ హిట్ అయిన జిత్తు మాధవన్, సుషిన్ శ్యామ్ కాంబో మళ్లీ రిపీట్ కావడం ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్.