- Home
- Entertainment
- త్రిష మత్తు చూపులకు కుర్ర హృదయాలు గల్లంతే.. ట్రెడిషనల్ అందాలతో మైమరిపిస్తున్న తమిళ బ్యూటీ!
త్రిష మత్తు చూపులకు కుర్ర హృదయాలు గల్లంతే.. ట్రెడిషనల్ అందాలతో మైమరిపిస్తున్న తమిళ బ్యూటీ!
సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష క్రిష్ణన్ (Trisha Krishnan) కేరీర్ మరోసారి ఊపందుకుంది. తాజాగా తమిళం చిత్రం ‘రాంగి’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా రిలీజ్ సందర్భంగా నెట్టింట అందాల విందుతోనూ ఆకట్టుకుంటోంది.

తమిళ బ్యూటీ, స్టార్ హీరోయిన్ త్రిష తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. కొన్నేండ్ల పాటు టాలీవుడ్ ను ఊపూపిన ఈ హీరోయిన్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది. హీరోయిన్ గా మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, బాలయ్య, వెంకటేశ్ లాంటి బడా హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.
రీసెంట్ గానే 20 ఏండ్ల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్న త్రిష సినిమాల పరంగా ప్రస్తుతం జోరు పెంచుతోంది. తమిళం, మలయాళ భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది. కొన్నాళ్లుగా హిట్లతో సంబంధం లేకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
తాజాగా అదేతరహాలో త్రిష నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ రాంగి (Raangi) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి ఎం సరవనన్ దర్శకత్వం వహించారు. ఈరోజు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. టాక్ మాత్రం అదిరిపోయినట్టు తెలుస్తోంది. మున్ముందు ఇదే జోష్ కనబరిచే అవకాశం కనిపిస్తోంది. అయితే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా త్రిష సందడి చేస్తోంది.
పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తన అభిమానులకు చాలా దగ్గరగా ఉంటుంటోంది. అదేవిధంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతోనూ ఫ్యాన్స్, నెటిజన్లను మైమరిపిస్తోంది. గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఖుషీ చేస్తోంది. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది.
లేటెస్ట్ గా త్రిష పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. ట్రెడిషనల్ అందాలతో మతులు పోగొడుతోంది. దాదాపు నాలుగు పదుల వయస్సుకు చేరుకున్నా చెక్కు చెదరని గ్లామర్ బ్యూటీతో ఆకర్షిస్తోంది. కొంటె చూపులు, స్టన్నింగ్ స్టిల్స్ తో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. గ్లామర్ మెరుపులతో నెట్టింట దుమారం రేపుతోంది.
చాలా కాలం తర్వాత ఇంటర్నెట్ లో తెగ సందడి చేస్తోంది త్రిష. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆమె పోస్టులను, గ్లామర్ ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. రీసెంట్ గా తమిళ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan 1) తో సాలిడ్ హిట్ అందుకుని రైజ్ అయ్యింది. ప్రస్తుతం సతురంగ వేట్టై పార్ట్ 2, రామ్ పార్ట్ 1, పొన్నియిన్ సెల్వన్ 2, ది రోడ్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.