- Home
- Entertainment
- Garividi Lakshmi 7 Days Collections: గరివిడి లక్ష్మి మూవీకి హిట్ టాక్, కలెక్షన్లు మాత్రం రివర్స్.. కారణం ఇదే
Garividi Lakshmi 7 Days Collections: గరివిడి లక్ష్మి మూవీకి హిట్ టాక్, కలెక్షన్లు మాత్రం రివర్స్.. కారణం ఇదే
Garividi Lakshmi 7 Days Collections: బుర్రకథ కళాకారిణి, ఫోక్ సింగర్ గరివిడి లక్ష్మి జీవితం ఆధారణంగా రూపొందిన గరివిడి లక్ష్మి సినిమా బాక్సాఫీసు వద్ద అదిరిపోయే వసూళ్లని రాబడుతోంది. వారం పూర్తయినా స్ట్రాంగ్‌గా ఉంది.

పాజిటివ్ టాక్‌తో రన్ అవుతున్న గరివిడి లక్ష్మి మూవీ
ఆనంది, రాగ్ మయూర్ జంటగా, వీకే నరేష్, రాశి, శరణ్య, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రధారులుగా `గరివిడి లక్ష్మి` రూపొందిన విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర బుర్రకథ జానపద కళాకారిణి, గాయని గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. దీనికి చరణ్ అర్జున్ సంగీతం అందించడం విశేషం. బయోపిక్ తరహాలో రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా శనివారం (అక్టోబర్ 17)న విడుదలైంది. ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. కానీ కలెక్షన్ల పరంగా ఆ రేంజ్‌లో సత్తా చాటలేకపోతుంది.
గరివిడి లక్ష్మి మూవీ ఏడు రోజుల కలెక్షన్లు
`గరివిడి లక్ష్మి` మూవీ విడుదలై వారం రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు కలెక్షన్లు ఎంత వచ్చాయి? ఇంకా ఎంత రావాలి? సినిమా హిట్టా ఫట్టా? అనేది చూస్తే. సాక్నిల్క్ లెక్కల ప్రకారం.. ఏడు రోజుల్లో ఈ చిత్రానికి రూ.5.90కోట్ల గ్రాస్ వచ్చింది. రెండున్నకోట్ల షేర్ వచ్చింది. సినిమా హిట్ కావాలంటే మూడు కోట్ల షేర్ రావాలి. అంటే ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యిందని చెప్పొచ్చు. శనివారం, ఆదివారంతో మూవీ లాభాల్లోకి వెళ్తుంది. అయితే తక్కువ బడ్జెట్‌తో సినిమా తీయడం, తక్కువకే అమ్మడంతో ఈజీగా బ్రేక్ ఈవెన్‌కి చేరుకుందని సమాచారం.
గరివిడి లక్ష్మి మూవీ రోజు వారి కలెక్షన్లు
ఇదిలా ఉంటే ఏడో రోజు ఈ మూవీకి ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే, రూ.52లక్షల నెట్ వసూలు చేసింది. అయితే ప్రారంభం నుంచి ఈ మూవీకి కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. మొదటి రోజు రూ.60లక్షల నెట్, రెండో రోజు రూ.78లక్షలు, మూడో రోజు రూ.68లక్షలు, నాల్గో రోజు కోటి రూపాయలు, ఐదో రోజు రూ.88లక్షలు, ఆరో రోజు రూ.70లక్షలు రాబట్టింది. గురువారంతో పోల్చితే 26శాతం తగ్గాయి. కానీ స్ట్రాంగ్‌గానే రన్ అవుతుంది. ఈ శనివారం, ఆదివారం ఈ మూవీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా థియేట్రికల్‌గా ఇది నిర్మాతలకు సేఫ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు.
గరివిడి లక్ష్మి బాక్సాఫీసు వద్ద స్ట్రగుల్స్
ఇదిలా ఉంటే ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాలేదనే టాక్ ఉంది. టాక్‌ని బట్టి చూస్తే ఇది ఈజీగా యాభై కోట్ల వరకు వెళ్లాలి. కానీ ఆరు కోట్ల వద్దనే కొట్టుకుంటోంది. ఇక లాంగ్ రన్‌లో మరో కోటి రెండు కోట్లు వస్తాయి, కానీ అంతకు మించి వచ్చే అవకాశం కనిపించడం లేదు. వచ్చే వారంతో సినిమా క్లోజ్ కాబోతుంది. పెద్ద సినిమాలున్న నేపథ్యంలో థియేటర్ల నుంచి దీన్ని ఎత్తేసే అవకాశం ఉంది. పైగా సోమవారం నుంచి వసూళ్లు మరింతగా పడిపోయే ఆస్కార్ ఉంది. మొత్తంగా ఈ సినిమా ఎనిమిది కోట్లలోపే క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గరివిడి లక్ష్మికి కలెక్షన్లు రాకపోవడానికి కారణాలు ఇవే
సినిమా జనాల్లోకి పెద్దగా వెళ్లకపోవడానికి అసలు కారణంగా పోటీలో రావడం. దసరాకి మూడు నాలుగు పెద్ద సినిమాలున్నాయి. `జైలర్ 2`, `రణబాలి`,`క్రేజీ కళ్యాణం` వంటి చిత్రాలున్నాయి. దీంతో థియేటర్లు పెద్దగా దక్కలేదు. పైగా చిత్ర బృందం కూడా పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. దీంతో సినిమా జనాల్లోకి వెళ్లలేదు. దీనికితోడు గరివిడి లక్ష్మి ఉత్తరాంధ్రకి తెలిసిన గాయని. మిగిలిన ఆంధ్రాకిగానీ, రాయలసీమ, తెలంగాణ ప్రజలకు ఆమె ఎవరో పెద్దగా తెలియదు. ఇక్కడ పాపులారిటీ లేదు. దీంతో సినిమాని చూసేందుకు ఇక్కడి ఆడియెన్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అందుకే ఈ చిత్రానికి పెద్దగా ఆదరణ దక్కడం లేదు. ఇదే కాదు ఇప్పుడు ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్ లకు పెద్దగా ఆదరణ లేదు. యాక్షన్ మూవీ, కామెడీ, ఫ్యామిలీ చిత్రాలకే ఆదరణ దక్కుతోంది. బయోపిక్‌లు చూసేందుకు జనం ఆసక్తి చూపించడ లేదు. దీనివల్లే ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. మరి మున్ముందు ఏదైనా మ్యాజిక్ జరుగుతుందా అనేది చూడాలి.

