MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Trisha: విజయ్ కోసం..స్టార్ హీరోయిన్ తో గొడవ పడిన త్రిష, చివరికి ఏమైంది?

Trisha: విజయ్ కోసం..స్టార్ హీరోయిన్ తో గొడవ పడిన త్రిష, చివరికి ఏమైంది?

Trisha: హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన కొత్తలోనే  త్రిష కి విజయ్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది. అయితే… ఆ సమయంలోనే త్రిష విజయ్ కోసం మరో స్టార్ హీరోయిన్ తో గొడవపడిందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.   

2 Min read
Author : ramya Sridhar
| Updated : May 04 2026, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
హీరోయిన్ గా 24 ఏళ్ల ప్రయాణం..
Image Credit : trisha krishnan instagram

హీరోయిన్ గా 24 ఏళ్ల ప్రయాణం..

స్టార్ హీరోయిన్ త్రిషకు పరిచయం అవసరం లేదు. ఆమె ఈ సినిమా ఇండస్ట్రీలో 24 ఏళ్లుగా హీరోయిన్ గా కొనసాగుతోంది. తెలుగు, తమిళ సినిమాల్లో ఇప్పటికీ అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. 96, పొన్నియన్ సెల్వన్, లియో వంటి సినిమాలు ఆమెను మళ్లీ లైమ్ లైట్ లోకి తీసుకువచ్చాయి అని చెప్పొచ్చు.

ఎంతమంది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. త్రిష మాత్రం తన స్థానాన్ని పదిలంగా కాపాడుకున్నారు. అయితే.. రీసెంట్ గా వచ్చిన ‘థగ్ లైఫ్’ సినిమా మాత్రం ఆమెకు చాలా విమర్శలు తెచ్చిపెట్టాయి. కమల్ హాసన్ కి ప్రేయసిగా త్రిష నటించడం ఎవరికీ రుచించలేదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
విజయ్ తో త్రిష బంధం..
Image Credit : X

విజయ్ తో త్రిష బంధం..

ఇదిలా ఉండగా, త్రిష జీవితం కెరీర్ పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ, ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం తరచూ వివాదాల్లో నిలుస్తోంది. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత.. వీరిద్దరిపై రూమర్స్ రావడం ఎక్కువయ్యాయి.  త్రిష కారణంగానే విజయ్ తన భార్యకు విడాకులు ఇచ్చారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే… విజయ్ కోసం త్రిష ఓ స్టార్ హీరోయిన్ తో గొడవ పడ్డారనే పాత వార్త ఇప్పుడు తెరపైకి వచ్చింది. 

34
విజయ్ కోసం అసిన్ తో గొడవ పడిన త్రిష..?
Image Credit : our own

విజయ్ కోసం అసిన్ తో గొడవ పడిన త్రిష..?

త్రిష, అసిన్ దాదాపు ఒకే సమయంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇద్దరూ స్టార్ హీరోలతో వరస హిట్లు కొట్టడంతో, వారి మధ్య  పోటీ, గొడవలు ఉన్నాయనే ప్రచారం జరిగింది.  ముఖ్యంగా విజయ్ ‘తిరుప్పాచ్చి’ లో త్రిష, ‘ శివ కాశీ’ లో అసిన్ నటించడంతో ఈ వార్తలు మరింత ఎక్కువయ్యాయి.  ఆ తర్వాత ‘ పోకిరి’,‘ కావలన్’ చిత్రాల్లోనూ విజయ్ తో అసిన్ నటించడంతో త్రిష ఆమెతో గొడవపడిందని సమాచారం. అయితే.. ఆ గొడవ తర్వాత ఈ ఇద్దరు హీరోయిన్లు పెద్దగా మాట్లాడుకోవడం కూడా మానేశారట.

అయితే, ఆ తర్వాత అసిన్ బాలీవుడ్ పై దృష్టి పెట్టి, పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయ్యారు. దీంతో వారి మధ్య గొడవ గురించి చర్చ తగ్గింది. అయితే.. ఓ ఇంటర్వ్యూలో అసిన్ తో గొడవపై త్రిష స్పందించారు.  ‘ అసిన్ తో నాకు ఎలాంటి గొడవ లేదు. అసిన్ తోనే కాదు, ఏ హీరోయిన్ తోనూ నాకు గొడవలు గొడవలు జరగలేదు’ అని చెప్పడం విశేషం..

‘ వర్షం సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు తీసుకునేటప్పుడు నేను మొదటిసారి అసిన్ ను కలిశాను. అప్పుడు ఆమె నన్ను అభినందించారు. మేమిద్దరం ఒకేలాంటి పాత్రలు చేయడంతో.. మా మధ్య పోటీ ఉందని మీడియానే సృష్టించింది. నేను విజయ్ తో ఒక సినిమా చేస్తే, తర్వాతి సినిమాలో అసిన్ చేసేవారు. కానీ దాన్ని నేనెప్పుడూ వ్యక్తిగతంగా తీసుకోలేదు’ అని త్రిష చెప్పారు.

44
త్రిష చేతిలో కొత్త సినిమాలు...
Image Credit : Instagram

త్రిష చేతిలో కొత్త సినిమాలు...

ఇదిలా ఉండగా, త్రిష ప్రస్తుతం ‘కరుప్పు’, ‘ విశ్వంభర’,  ‘ రామ్’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి.  చాలా కాలం తర్వాత సిద్ధార్థతో కలిసి నటించేందుకు ఆమె కొత్త సినిమా సైన్ చేశారు. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
టీవీకే విజయ్
త్రిష
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Thalapathy vijay: DMK రూ.5వేల కోట్లు.. AIADMK రూ.5వేల కోట్లు.. మరి విజయ్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో తెలుసా?
Recommended image2
Vijay- Trisha: గెలుపు విజయ్ దే.. ఫ్యాన్ కామెంట్ కి.. త్రిష రియాక్షన్ ఇదే...!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved