ప్రభాస్ సరసన త్రిష, ఏ ప్రాజెక్టో తెలిస్తే మతిపోతుంది
త్రిష తగ్గేదేలే అన్నట్లు వయస్సుతో సంభందం లేకుండా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ తో త్రిష కాంబినేషన్ రిపీట్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు ఓ దర్శకుడు.
Trisha, prabhas
పాన్ ఇండియా డార్లింగ్ ప్రభాస్ ఫుల్ రైజింగ్ లో ఉన్నారు . 'కల్కి' సక్సెస్ ని ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో నెక్ట్స్ ప్రాజెక్టులకు రెడి అవుతున్నారు. అయితే ప్రభాస్ వంటి స్టార్ ప్రక్కన నటించే హీరోయిన్ ఎవరనేది ప్రతీసారి పజిలే. ఎందుకంటే ఆయన యాక్షన్ హీరోయిజంను మ్యాచ్ చేసే అందాల భామ అయ్యిండాలి. ఆ హీరోయిన్ కు ప్యాన్ ఇండియా ఇమేజ్ ఉంటే బాగా ప్లస్ అవుతుంది. బిజినెస్ పరంగా ఉండే లెక్కలు అన్ని హీరో,హీరోయిన్స్ కాంబినేషన్ క్రేజ్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. అలాంటి క్రేజీ కాంబినేషన్ త్రిష, ప్రభాస్. వీళ్లిద్దరు మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవ్వబోతోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
త్రిష,ప్రభాస్ కాంబినేషన్ లో వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాలు వచ్చాయి. వీరి కెమిస్ట్రీకి సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. వీళ్లద్దరి మధ్యా లవ్ ఎఫైర్ నడిచిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ప్రభాస్ ఫుల్ ఫామ్ లోకి వచ్చాక మళ్లీ వీరి కాంబినేషన్ లో సినిమా అయితే రాలేదు. ఇక త్రిష రిటైర్ అయ్యిందా అంటే ఆమె ఇప్పటికి పెద్ద హీరోల సరసన సినిమాలు చేస్తోంది.
మొన్నటికి మొన్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన లియోలో త్రిష హీరోయిన్. అలాగే రీసెంట్ గా ఆమె బృంద అనే వెబ్ సీరిస్ సైతం చేసింది. ఇలా త్రిష తగ్గేదేలే అన్నట్లు వయస్సుతో సంభందం లేకుండా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ తో త్రిష కాంబినేషన్ రిపీట్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు దర్శకుడు. త్రిష తమిళంలో, మళయాళంలో,తెలుగులో, హిందీలో ఇలా అన్ని భాషల్లో చేసింది. కాబట్టి ప్యాన్ ఇండియా హీరోయిన్ ఓ రకంగా. ఇక ఇంతకీ ఈ కాంబినేషన్ సెట్ చేస్తున్న దర్శకుడు ఎవరూ అంటే....
‘యానిమల్’, ‘అర్జున్ రెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు ప్రభాస్‌తో కలిసి ‘స్పిరిట్’ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ లో హీరోకు వైఫ్ క్యారక్టర్ ఉంటుందిట. పోలీస్ కు భార్య. దానికి డిగ్నిఫైడ్ గా ఉండాలి, తెలుసున్న హీరోయిన్ అయ్యిండాలి. అనే ఆలోచనలోంచి త్రిష అనే ఐడియా పుట్టిందంటున్నారు. ఇదే ఖరారు అయితే ఇప్పుడు నాలుగోసారి ప్రభాస్ కు జోడీగా త్రిష నటించనుంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రభాస్‌తో..
300 కోట్లకు పైగా బడ్జెట్‌తో భారీ ఎత్తున రూపొందనున్న ఈ సినిమా రెండేళ్లకు పైగా షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రం జనవరి 2025లో సెట్స్‌పైకి వెళ్లనుంది.
'యానిమల్' సక్సెస్‌తో మంచి ఊపు మీద ఉన్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇప్పుడు ఆయన దృష్టి అంతా నెక్ట్స్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో చేయబోయే స్పిరిట్‌పైనే ఉంది. అలాగే ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున ప్రాజెక్ట్ ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రని పోషిస్తున్నారు.
Actor Trisha Brinda series first responses review
యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత సందీప్ వంగ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో హీరోల పాత్రలా.. స్పిరిట్ లో కూడా విభిన్నమైన పాత్రలో ప్రభాస్ ని చూపిస్తారని నమ్మకంతో ఫ్యాన్స్ చాలా క్యూరియాసిటీతో ఉన్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించిన ఆసక్తికర విషయాలను సందీప్ వంగ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేసారు. ఈ మూవీ స్టోరీ లైన్ గురించి మాట్లాడుతూ.. “ప్రభాస్ ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. అలాంటి ఆఫీసర్ జాబ్ లో, తనకి దగ్గర వ్యక్తి విషయంలో ఒక తప్పు జరుగుతుంది. ఆ తరువాత ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా రియాక్ట్ అయ్యాడు” అనేది కథని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో రీసెంట్గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తాను 'స్పిరిట్' సినిమా విజయం పట్ల కాన్ఫిడెంట్‌గా మాట్లాడారు. ఇప్పటికే సినిమా స్ట్రిప్ట్ 60 శాతం పూర్తైందన్న ఆయన సినిమా ఫస్ట్ డే కలెక్షన్ అప్పుడే అంచనా వేసేశారు. ప్రభాస్ స్టార్డమ్తో దేశవ్యాప్తంగా ఓపెనింగ్ రోజే (ఫస్ట్ డే) రూ.150 కోట్లు వసూలు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అలాగే స్పిరిట్ బడ్జెట్ విషయానికి వస్తే... దాదాపు రూ.300 కోట్లతో తెరకెక్కనుందని తెలియచేసారు. అలాగే 'స్పిరిట్' సినిమాప్రభాస్తో మూవీ అనగానే రూ.300+ కోట్లు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చే ప్రొడ్యుసర్లు ఉన్నారని సందీప్ అన్నారు. దాంతో తనకు ఈ సినిమా బడ్జెట్ విషయంలో అసలు ఆలోచించుకోవాల్సిన పనిలేదని తెల్చి చెప్పారు.
అలాగే భారీ బడ్జెట్‌తో రూపొందనున్న స్పిరిట్, ప్రభాస్ ఇమేజ్‌తోనే టీజర్, ట్రైలర్, ఆడియో రిలీజ్, ప్రీ ప్రమోషన్స్‌తోపాటు శాటిలైట్, డిజిటల్ రైట్స్‌తోనే పూర్తి బడ్జెట్ రికవరీ అయ్యే అవకాశం ఉందని సందీప్ అభిప్రాయపడ్డారు. ఈ కామెంట్స్ తో ప్రభాస్ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి.
Prabhas
కాగా ఈ సినిమా స్క్రిప్ట్ ని యానిమల్ కంటే ముందే ప్రభాస్ కి వినిపించారట. కరోనా సమయంలో ప్రభాస్ కి ఈ స్టోరీ లైన్ చెప్పగా.. ఆయనకి బాగా నచ్చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక 2024 నవంబర్ లేదా డిసెంబర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సందీప్ అన్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని సందీప్ అన్నారు. స్పిరిట్‌కు ముందే ప్రభాస్‌తో ఒక హాలీవుడ్ రీమేక్ చేసే అవకాశం వచ్చినా, ఈ సినిమా కోసం దానిని ఒప్పుకోలేదన్నారు.
Sandeep vanga
ఇక ఇప్పటికే యానిమల్ సినిమాతో సందీప్ మార్కెట్ పెరిగింది. ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.900 కోట్ల మార్క్ అందుకుంది.ఇప్పుడు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో సినిమా సందీప్ స్థాయిని మరింత పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటోంది ట్రేడ్.
స్పిరిట్ మూవీ షూటింగ్ 2024లో ప్రారంభమై 2025 లో రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. స్పిరిట్ మూవీని టీసిరీస్ తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. స్పిరిట్ చిత్రాన్ని 2025 క్రిస్మస్ లేదా సంక్రాంతికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించాడు. సెప్టెంబరు 2024లో షూటింగ్ ప్రారంభిస్తానని, ఈ గ్యాప్ లో స్క్రిప్ట్ పూర్తి చేస్తానని తెలిపాడు. ఈ సినిమాలో ప్రభాస్ నిజాయతీ, ధైర్యసాహసాలు కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడని ప్రకటించాడు సందీప్.