రెడ్ లిప్స్ తో త్రిష ఘాటుగా అందాల హొయలు.. కొంచెం మేకప్ ఎక్కువైంది అంటూ కామెంట్స్
తెలుగులో వర్షం చిత్రంతో త్రిష హవా మొదలైంది. స్టార్ హీరోలందరితో ఆడి పాడింది. తన అందం, చిలిపితనంతో త్రిష చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు.
తెలుగులో వర్షం చిత్రంతో త్రిష హవా మొదలైంది. స్టార్ హీరోలందరితో ఆడి పాడింది. తన అందం, చిలిపితనంతో త్రిష చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని తన ఖాతాలో వేసుకుంది ఈ బ్యూటీ. ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా త్రిష విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
39 ఏళ్ల వయసులో కూడా త్రిషకి అద్భుతమైన ఆఫర్స్ వస్తున్నాయి. లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వం చిత్రంలో త్రిష నటించింది. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన పొన్నియన్ సెల్వం తమిళంలో మంచి విజయం దక్కించుకుంది.
ఈ ఏడాది పొన్నియిన్ సెల్వన్ రెండవ భాగం కూడా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. మునుపెన్నడూ చూడని విధంగా ఈ చిత్రంలో స్టార్ కాస్టింగ్ నటించిన సంగతి తెలిసిందే. ఐశ్వర్యారాయ్, విక్రమ్, కార్తీ, జయం రవి , శోభిత ధూళిపాళ, త్రిష ఇలా ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటించారు.
తాజాగా త్రిష తన గ్లామర్ తో మైకం తెప్పిస్తోంది. త్రిష సైమా అవార్డుల వేడుకలో పాల్గొంది. ఘాటైన రెడ్ లిప్స్ తో త్రిష ఇస్తున్న ఫోజులు కుర్రాళ్ళని మురిపించే విధంగా ఉన్నాయి.
ఆమె వయసు 39 లేక 19 అనే అనుమానం కలిగేలా త్రిష మెరుపులు మెరిపిస్తోంది. వర్షం, అతడు చిత్రాల టైం త్రిష ఎలా ఉండేదో ఇప్పుడు ఆమె లుక్స్ అలాగే ఉన్నాయి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
అయితే ఈ లుక్స్ లో త్రిష కాస్త ఓవర్ మేకప్ లో కనిపిస్తోంది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చూడ ముచ్చటగా ఉండే త్రిష ఇలా అతిగా మేకప్ వేసుకోవలసిన అవసరం లేదు అని అంటున్నారు.
ఏది ఏమైనా సైమా అవార్డుల వేడుకలో తన బ్యూటిఫుల్ లుక్స్ గ్లామర్ తో త్రిష మైమరపించే విధంగా ఫోజులు ఇచ్చింది. యువత ఆమెరెడ్ లిప్స్ పైనే కామెంట్స్ పెడుతున్నారు.
ప్రతి ఏడాది కనుల పండుగలా జరిగే సౌత్ సినీ వేడుక సైమా అవార్డ్స్ వేడుక దుబాయ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభం అయింది. సౌత్ నుంచి పలువురు సినీ తారలు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.
ప్రతిష్టాత్మకంగా సాగే ఈ అవార్డ్స్ వేడుకలో చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు అవార్డులు గెలుచుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్స్ 2023 లో విజేతగా నిలిచాడు.