- Home
- Entertainment
- జన నాయకుడు ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్ల రెమ్యూనరేషన్స్.. ప్రభాస్, బన్నీలకు షాకిచ్చేలా విజయ్ పారితోషికం
జన నాయకుడు ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్ల రెమ్యూనరేషన్స్.. ప్రభాస్, బన్నీలకు షాకిచ్చేలా విజయ్ పారితోషికం
దళపతి విజయ్ రాజకీయాల్లోకి వెళ్తోన్న నేపథ్యంలో ఆయన నటిస్తోన్న చివరి మూవీ `జన నాయకుడు`. దీనికిగానూ ఆయన తీసుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే.

భగవంత్ కేసరి రీమేక్‌గా `జన నాయకుడు`
దళపతి విజయ్ నటిస్తున్న చివరి మూవీ `జన నాయకుడు`. దీనిపై కోలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన నటిస్తోన్న చివరి మూవీ ఇదే కావడంతో అభిమానులు ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. సినిమా ఎలా ఉన్నా, బ్టాక్ బస్టర్ చేయాలనేంత కసితో ఉన్నారు. ఈ సినిమా తెలుగులో వచ్చిన `భగవంత్ కేసరి`కి రీమేక్ అనే విషయం తెలిసిందే. ఇటీవలే నిర్మాత సాహు గారపాటి ఈ విషయాన్ని కన్ఫమ్ చేశారు. ఇక సినిమా సెన్సార్ ఇబ్బందుల్లో ఉంది. ఇష్యూ ఇప్పుడు కోర్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ నెల 9న జన నాయకుడు విడుదల
ఇదిలా ఉంటే `జన నాయకుడు` మూవీ ఈ నెల 9న విడుదల కానుంది. కోర్ట్ ఆదేశాల మేరకు సినిమా రిలీజ్ కాబోతుందని చెప్పొచ్చు. ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే మమితా బైజు కీలక పాత్ర పోషిస్తుంది. మరోవైపు బాబీ డియోల్ విలన్‌గా చేస్తుండగా, ప్రకాష్ రాజ్, గౌతమ్ మీనన్, ప్రియమణి, నరేన్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుథ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
విజయ్‌కి ఇండియాలోనే అత్యధిక పారితోషికం
ఇందులో నటించిన ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్ల పారితోషికాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అత్యధికంగా విజయ్ తీసుకుంటున్నారు. ఆయనకు ఇండియాలోనే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ ఇస్తోంది కేవీఎన్ ప్రొడక్షన్. ఆయన చివరి మూవీ కావడంతో దానికి గుర్తుగా, గ్రాండ్ వీడ్కోలు పలికేలా ఏకంగా రూ.240కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు సమాచారం. ఇది ప్రభాస్, అల్లు అర్జున్, రజనీకాంత్ ల పారితోషికాల కంటే ఎక్కువ కావడం విశేషం. బిగ్ పాన్ ఇండియా స్టార్స్ ని మించిన రెమ్యూనరేషన్స్ విజయ్ ఈ మూవీకి తీసుకుంటున్నారని చెప్పొచ్చు.
జన నాయకుడు టీమ్ పారితోషికాల వివరాలు
ఇక ఆ తర్వాత దర్శకుడు హెచ్ వినోద్ అందుకుంటున్నారు. ఆయనకు రూ.25కోట్లు ఇస్తున్నారట. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్‌కి రూ.13కోట్లు, హీరోయిన్ పూజా హెగ్డే కి రూ.3కోట్లు ఇస్తుండగా, విలన్‌గా చేస్తున్న బాబీ డియోల్‌కి సైతం మూడు కోట్లు అని సమాచారం. హీరోయిన్ మమితా బైజుకి యాభై లక్షలు ఇస్తున్నారట. గౌతమ్ మీనన్‌కి కోటిన్నర, ప్రకాష్ రాజ్‌కి రెండు కోట్లు, ప్రియమణికి రెండు కోట్లు, నరేన్‌కి కోటి వరకు ఇస్తున్నట్టు సమాచారం. ఇలా ఈ మూవీకి ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్ల పారితోషికమే ఏకంగా రూ.300కోట్లు కావడం విశేషం. ఇక మొత్తం బడ్జెట్ రూ.365కోట్లు. అంటే కేవలం రూ.60-70 కోట్లతో సినిమాని తీశారని చెప్పొచ్చు.

