పుష్ప 2 పై కుట్ర, థియేటర్లో విషప్రయోగం! ఇది వారి పనేనా?
పుష్ప 2 థియేటర్ లో విష ప్రయోగానికి పాల్పడ్డారు. ప్రేక్షకులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. ఇంతకీ ఈ దురాగతానికి పాల్పడింది ఎవరు? ఎక్కడ జరిగింది?
పుష్ప 2 వరల్డ్ వైడ్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న పుష్ప 2 ఆల్ టైం ఓపెనింగ్ రికార్డ్స్ నెలకొల్పింది. ఆర్ ఆర్ ఆర్, బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసింది. పుష్ప 2 డే వన్ వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 250 కోట్లకు పైమాటే అంటున్నారు. హిందీలో షారుఖ్ ఖాన్ జవాన్ పేరిట ఉన్న ఓపెనింగ్ డే రికార్డు రూ. 65 కోట్లను పుష్ప 2 బీట్ చేసింది. రూ. 72 కోట్లతో నయా బెంచ్ మార్క్ సెట్ చేసింది.
అల్లు అర్జున్ అండ్ పుష్ప 2 టీమ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. కాగా పుష్ప 2 థియేటర్స్ వద్ద చోటు చేసుకుంటున్న అవాంఛనీయ ఘటనలు యూనిట్ ని బాధకు గురి చేస్తున్నాయి. హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాటలో 35 ఏళ్ల వివాహిత కన్నుమూసింది. ఆమె కుమారుడు సైతం ప్రాణాపాయ స్థితికి వెళ్ళాడు. బాలుడికి చికిత్స జరుగుతుందని సమాచారం.
ముంబైలోని ఓ థియేటర్లో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పుష్ప 2 మూవీ చూస్తున్న ప్రేక్షకుల మీద విషప్రయోగం జరిగింది. బాంద్రా లో గల గెయిటీ గెలాక్సీ థియేటర్లో ఇంటర్వెల్ అనంతరం సెకండ్ హాఫ్ రన్ అవుతున్న సమయంలో ఓ దుండగుడు విషపూరిత వాయువు స్ప్రే చేశాడు. ఎయిర్ కండిషనింగ్ తో కూడిన థియేటర్ కావడంతో ఆ వాయువు తీవ్ర ప్రభావం చూపింది.
ప్రేక్షకులు ఊపిరాడక ఉక్కిరిబిక్కరి అయ్యారట. దగ్గు, వాంతులు, కళ్ళు తిరగడం వంటి లక్షణాలతో ఇబ్బంది పడ్డారట. థియేటర్ యాజమాన్యం సమస్య గురించి చర్యలు తీసుకున్నారట. కేసు నమోదు చేసిన అధికారులు ఈ చర్యకు పాల్పడిన దుండగుడిని గుర్తించే పనిలో ఉన్నారు. బాలీవుడ్ పై సౌత్ హీరోల ఆధిపత్యం భరించలేని కొందరు వ్యక్తులు ఇలా చేశారనే సందేహాలు కలుగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలతో సమానంగా పుష్ప 2 చిత్రానికి నార్త్ లో రెస్పాన్స్ వస్తుంది. పుష్ప 2 హిందీ వెర్షన్ ఎవరూ ఊహించని వసూళ్లు రాబట్టడం ఖాయం. దర్శకుడు సుకుమార్ దాదాపు మూడేళ్ల సమయం ఈ చిత్రానికి తీసుకున్నారు. రూ. 400 కోట్ల బడ్జెట్ కేటాయించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. సినిమాను భారీగా ప్రమోట్ చేశారు. అది కూడా ప్లస్ అయ్యింది.
Pushpa 2 twitter review
అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటించింది. ఫహద్ ఫాజిల్, జగపతిబాబు,సునీల్, అనసూయ, రావు రమేష్ కీలక రోల్స్ చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. శ్రీలీల ఓ స్పెషల్ సాంగ్ చేసింది.