MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాప్ 10 పాన్ ఇండియా స్టార్స్: ప్రభాస్-బన్నీలలో అక్కడ కింగ్ ఎవరు? ఎన్టీఆర్ షేక్స్ చరణ్ కి షాక్! 

టాప్ 10 పాన్ ఇండియా స్టార్స్: ప్రభాస్-బన్నీలలో అక్కడ కింగ్ ఎవరు? ఎన్టీఆర్ షేక్స్ చరణ్ కి షాక్! 

ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్... టాలీవుడ్ నుండి పాన్ ఇండియా స్టార్స్ గా ప్రచారం అవుతున్నారు. నిజంగా వీరిలో కింగ్ ఎవరో? నార్త్ లో ఫేమ్ ఉన్న మొనగాడు ఎవరో? లేటెస్ట్ సర్వే తేల్చేసింది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 23 2024, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Top Ten Pan India Stars

Top Ten Pan India Stars


ప్రముఖ బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ టాప్ 10 పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అభిప్రాయం ప్రకారం స్టార్ హీరోలకు ర్యాంక్స్ ఇచ్చింది. టాలీవుడ్ స్టార్స్ అయిన ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోలుగా ప్రచారం అవుతున్నారు. మరి వీరిలో కింగ్ ఎవరు? నార్త్ లో ఎక్కువ ఫేమ్ ఎవరికి ఉంది?. ఆర్మాక్స్ లేటెస్ట్ సర్వేతో ఇది తేటతెల్లం అయ్యింది.. 

 

26

హృతిక్ రోషన్ బాలీవుడ్ స్టార్స్ లో ఒకరు. అందం, నటన, డాన్సులు కలగలిపిన పర్ఫెక్ట్ స్టార్ హీరో హృతిక్ రోషన్. అయితే హృతిక్ కి రావాల్సినంత గుర్తింపు రాలేదు. హృతిక్ నెంబర్ వన్ కాలేకపోయాడు. ఆయనకు టాప్ 10 పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో 10వ స్థానం దక్కింది. ఇక రామ్ చరణ్ 9వ స్థానంలో నిలిచాడు. గతంలో రామ్ చరణ్ ర్యాంక్ టాప్ 5లో ఉండేది. ఆయన ఏకంగా తొమ్మిదో స్థానానికి పడిపోయాడు. 

36

సల్మాన్ ఖాన్ కి ఈ సర్వే ప్రకారం పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో 8వ స్థానం లభించింది. కొన్నాళ్లుగా సల్మాన్ ఖాన్ విజయాలు లేక ఇబ్బందిపడుతున్నారు.సల్మాన్ బాక్సాఫీస్ కొల్లగొట్టి చాలా కాలం అవుతుంది. కాగా వరుస పరాజయాల్లో ఉన్న అక్షయ్ కుమార్ సల్మాన్ ఖాన్ కంటే మెరుగైన ర్యాంక్ పొందడం విశేషం. అక్షయ్ కుమార్ కి ఆడియన్స్ పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో 7వ స్థానం కట్టబెట్టారు. 

 

46

ఒక్క పాన్ ఇండియా చిత్రం చేయకున్నా సూపర్ స్టార్ మహేష్ బాబుకి 6వ స్థానం దక్కడం విశేషం. మహేష్ బాబుకు ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడానికి ఇది నిదర్శనం. కాగా ఎన్టీఆర్ టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కాగా ఇదే సినిమాలో హీరోగా చేసిన రామ్ చరణ్ మాత్రం ర్యాంకింగ్ లో వెనుకబడ్డాడు. ఎన్టీఆర్ కి 5వ స్థానం దక్కింది. 

56


మరో టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్స్ ర్యాంకింగ్స్ లో సత్తా చాటాడు. ఆయనకు 4వ ర్యాంక్ ఇచ్చారు ఆడియన్స్. పుష్ప మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. పుష్ప 2 తో అల్లు అర్జున్ ఇమేజ్ మరింత పెరిగే సూచనలు ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ విజయ్ కి 3వ స్థానం దక్కడం విశేషం. విజయ్ కి పాన్ ఇండియా హిట్ లేదు. అయినా ఆయన ఫేమ్ లో సత్తా చాటుతున్నాడు. 


 

66
top ten pan india stars

top ten pan india stars

2023లో వరుస విజయాలు అందుకున్న షారుఖ్ ఖాన్ కి 2వ స్థానం దక్కింది. హిట్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసిన షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ చిత్రాలతో వేల కోట్లు కొల్లగొట్టాడు. డంకీ సైతం చెప్పుకోదగ్గ వసూళ్ళు రాబట్టింది. ఇక అగ్రస్థానం ప్రభాస్ కి దక్కింది. కల్కి మూవీతో ఆయన మరో భారీ హిట్ ఖాతాలో వేసుకోగా... నెంబర్ వన్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ అని ప్రేక్షకులు తీర్పు చెప్పారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లపై ఆయన ఆధిపత్యం చూపించాడు.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: నిజం దాచిన కార్తీక్- చెంప పగలగొట్టిన కాంచన- పారు, జ్యో వాదన
Recommended image2
Comedy Movies: కడుపుబ్బా నవ్వించే 8 కామెడీ సినిమాలు.. అస్సలు మిస్ కాకూడదు, IMDb రేటింగ్ లో కూడా టాప్
Recommended image3
OTT Movies: ఈ వారం ఓటీటీలో క్రేజీ సినిమాలు.. అడివి శేష్ డెకాయిట్ నుంచి ప్రదీప్ రంగనాథన్ ఎల్ఐకె వరకు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved