ఇండియాలోనే నెంబర్ వన్ హీరో ఎవరో తేల్చేసిన తాజా సర్వే, మెగా హీరోలకు భారీ షాక్!
ప్రముఖ బాలీవుడ్ మీడియా బాలీవుడ్ టాప్ 10 హీరోలు ఎవరో తేల్చేసింది. ప్రేక్షకుల అభిప్రాయం ఆధారంగా స్టార్ హీరోలకు ర్యాంక్స్ ఇచ్చారు. మరి దేశం మెచ్చిన హీరో ఎవరో తెలుసా..
Top Ten Pan India Stars
ప్రముఖ బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ టాప్ 10 పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అభిప్రాయం ప్రకారం స్టార్ హీరోలకు ర్యాంక్స్ ఇచ్చింది. టాలీవుడ్ స్టార్స్ అయిన ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోలుగా ప్రచారం అవుతున్నారు. మరి వీరిలో కింగ్ ఎవరు? నార్త్ లో ఎక్కువ ఫేమ్ ఎవరికి ఉంది?. ఆర్మాక్స్ లేటెస్ట్ సర్వేతో ఇది తేటతెల్లం అయ్యింది..
ఒకప్పుడు సల్మాన్ ఖాన్ బాలీవుడ్ ని ఏలారు. ఈ మధ్య ఆయన విజయాల పరంగా వెనుకబడ్డారు. దాంతో సల్మాన్ ఖాన్ కి టాప్ 10 పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో చివరి స్థానం దక్కింది. ఇక రామ్ చరణ్ 9వ స్థానంలో నిలిచాడు. గతంలో రామ్ చరణ్ ర్యాంక్ టాప్ 5లో ఉండేది. ఆయన ఏకంగా తొమ్మిదో స్థానానికి పడిపోయాడు.
అక్షయ్ కుమార్ కి ఈ సర్వే ప్రకారం పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో 8వ స్థానం లభించింది. కొన్నాళ్లుగా అక్షయ్ కుమార్ విజయాలు లేక ఇబ్బందిపడుతున్నారు. అక్షయ్ బాక్సాఫీస్ కొల్లగొట్టి చాలా కాలం అవుతుంది. మహేష్ బాబుకి ఆడియన్స్ పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో 7వ స్థానం కట్టబెట్టారు.
ఒక్క పాన్ ఇండియా చిత్రం చేయకున్నా సూపర్ స్టార్ మహేష్ బాబుకి 7వ స్థానం దక్కడం విశేషం. మహేష్ బాబుకు ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడానికి ఇది నిదర్శనం. ఇక అల్లు అర్జున్ కి 7వ స్థానం దక్కింది. గతంలో అల్లు అర్జున్ సైతం టాప్ 5లో ఉండేవాడు. కానీ ఆయన ర్యాంక్ కూడా దిగజారింది. పుష్ప 2 విడుదల అనంతరం అల్లు అర్జున్ ఫేమ్ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కాగా ఇదే సినిమాలో హీరోగా చేసిన రామ్ చరణ్ మాత్రం ర్యాంకింగ్ లో వెనుకబడ్డాడు. ఎన్టీఆర్ కి 5వ స్థానం దక్కింది. దేవర మూవీతో మరోసారి నార్త్ లో ఎన్టీఆర్ సత్తా చాటాడు. దేవర వరల్డ్ వైడ్ రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హిందీలో రూ. 60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
అనూహ్యంగా అజిత్ కుమార్ 4వ స్థానం దక్కించుకున్నాడు. గతంలో ఆయన టాప్ 5లో కూడా లేడు. అజిత్ ఇటీవల కాలంలో మూవీ చేయలేదు. అజిత్ లేటెస్ట్ మూవీ తునివు విడుదలై ఏడాది దాటిపోయింది. అయినా అజిత్ కి ప్రేక్షకులు మెరుగైన స్థానం ఇవ్వడం విశేషం.
గత ఏడాది షారుఖ్ ఖాన్ బాలీవుడ్ ని షేక్ చేశాడు, వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. ఆయన నటించిన పఠాన్, జవాన్ చిత్రాలు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. షారుఖ్ ప్రస్తుతం 3వ ర్యాంక్ లో ఉన్నాడు. గతంలో ఆయన ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో ప్రభాస్ ఉన్నాడు. కల్కి మూవీతో ప్రభాస్ భారీ హిట్ కొట్టాడు. కల్కి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ఇక పాన్ ఇండియా నెంబర్ వన్ హీరో ర్యాంక్ విజయ్ కి దక్కింది. ఆయన గత చిత్రం గోట్ డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ గోట్ కి కనీస ఆదరణ దక్కలేదు. అలాగే విజయ్ కి ఒక్క పాన్ ఇండియా హిట్ లేదు. అయితే ఆయనకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.