MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Loyola College: చెన్నై లయోలా కాలేజీలో చదివిన మన టాప్ హీరోలు వీళ్లే.. లిస్ట్ చూస్తే షాక్ అవుతారు!

Loyola College: చెన్నై లయోలా కాలేజీలో చదివిన మన టాప్ హీరోలు వీళ్లే.. లిస్ట్ చూస్తే షాక్ అవుతారు!

చెన్నైలోని ఫేమస్ లయోలా కాలేజీలో మన టాప్ హీరోలు చాలా మంది చదివారు. మహేష్ బాబు నుంచి దళపతి విజయ్ వరకు అందరూ ఈ కాలేజీలోనే చదివారు. ఇంతకీ ఆ కాలేజీలో చదివిన ఆ స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 07 2026, 07:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
లయోలా కాలేజీలో చదివిన హీరోలు
Image Credit : Asianet News

లయోలా కాలేజీలో చదివిన హీరోలు

సినిమా స్టార్ల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా తమ ఫేవరెట్ హీరోలు ఏం చదివారు? ఏ కాలేజీకి వెళ్లారు? లాంటి విషయాలు తెలుసుకోవడం వాళ్లకు చాలా ఇష్టం. చెన్నైలోని లయోలా కాలేజీకి సినిమా ఇండస్ట్రీతో మంచి కనెక్షన్ ఉంది. తమిళ హీరోలే కాదు, మన సౌత్ ఇండియాకు చెందిన చాలా మంది టాప్ హీరోలు ఇక్కడే చదివారు. అలా లయోలా కాలేజీలో చదువుకున్న 5 గురు స్టార్ హీరోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
విజయ్
Image Credit : KVN Productions

విజయ్

తమిళ టాప్ హీరో విజయ్ స్కూల్ డేస్ అయిపోగానే చెన్నై లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ (Viscom) కోర్సులో చేరారు. కానీ సినిమాల మీద ఉన్న పిచ్చితో కాలేజీ మధ్యలోనే ఆపేశారు. చిన్నప్పటి నుంచే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న విజయ్, అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు కోట్లాది మంది అభిమానులు ఉన్న స్టార్ హీరో అయ్యారు. ప్రస్తుతం విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

36
సూర్య
Image Credit : X

సూర్య

స్టార్ హీరో సూర్య కూడా లయోలా కాలేజీలోనే చదువుకున్నారు. ఆయన అక్కడ బీకామ్ పూర్తి చేశారు. ప్రముఖ నటుడు శివకుమార్ కొడుకు కావడంతో, సూర్య చదువు మధ్యలోనే ఆపేసి సినిమాల్లోకి వెళ్లిపోతాడేమో అని కాలేజీ యాజమాన్యం అనుమానపడిందట. ఈ విషయాన్ని సూర్య స్వయంగా ఇంటర్వ్యూలలో చెప్పారు. కానీ సూర్య తన డిగ్రీ పూర్తి చేశాకే సినిమాల్లోకి వచ్చారు. ఇప్పుడు ఆయన టాప్ హీరోగానే కాకుండా సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా కూడా రాణిస్తున్నారు.

46
విశాల్
Image Credit : X

విశాల్

యాక్షన్ హీరో విశాల్ కూడా లయోలా కాలేజీ పూర్వ విద్యార్థే. ఆయన అక్కడ ఇంగ్లీష్ లిటరేచర్ చదివారు. ఆ తర్వాత ఎంబీఏ కూడా పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక సినిమాల వైపు వచ్చిన విశాల్, మొదట్లో ఇండస్ట్రీలో పలు విభాగాల్లో పనిచేశారు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస హిట్స్ కొట్టి తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.

56
మహేష్ బాబు
Image Credit : Instagram

మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చెన్నై లయోలా కాలేజీలోనే చదువుకున్నారు. ఆయన అక్కడ బీకామ్ కోర్సు తీసుకున్నారు. కానీ యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తితో సినిమాల వైపు వచ్చారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన మహేష్ బాబు, ఆ తర్వాత హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి తెలుగులో నంబర్ వన్ హీరోగా ఎదిగారు.

66
జయం రవి
Image Credit : jayam ravi instagram

జయం రవి

తమిళనాట తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న హీరో జయం రవి. ఆయన కూడా లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ చదివారు. చదువు పూర్తయ్యాక ముంబైలో కొన్నాళ్లు పనిచేశారు. ఆ తర్వాత కమల్ హాసన్ నటించిన 'ఆళవందాన్' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ అనుభవంతో హీరోగా మారి వరుస సక్సెస్‌లు అందుకున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: ఓటీటీలోకి రాబోతున్న మలయాళీ థ్రిల్లర్.. చిన్న గొడవతో పెద్ద హంగామా, రఫ్ఫాడించిన నటి
Recommended image2
Rajamouli-Mayookha: రాజమౌళి అమ్మాయిని దత్తత తీసుకోవడానికి, మయూఖ మూవీకి ఉన్న సంబంధమేంటో తెలుసా?
Recommended image3
Jalsa Movie: జల్సాలోని 'చలొరే చలొరే చల్' పాటలో ఇంత అర్థం ఉందా.. మనిషి మృగానికన్నా దారుణం అని తేల్చేసిన కవి
Related Stories
Recommended image1
Chiranjeevi Songs: ఆ హీరో చిరంజీవి సాంగ్స్ చేయడం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదా ? అందుకే ఆపేశా అంటూ కామెంట్స్
Recommended image2
Jalsa Movie: జల్సాలోని 'చలొరే చలొరే చల్' పాటలో ఇంత అర్థం ఉందా.. మనిషి మృగానికన్నా దారుణం అని తేల్చేసిన కవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved